పుష్కరాల్లో హెలీ టూరిసం

గోదావరి పుష్కరాలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఏపీ సర్కార్‌ పుష్కర యాత్రికుల కోసం హెలీ టూరిజాన్ని ప్రవేశపెట్టింది. ఈ నెల 14 నుంచి 25వ తేదీ వరకూ రాజమండ్రిలోని అన్ని పుష్కర ఘాట్లను ఆకాశమార్గాన హెలికాప్టర్‌ ద్వారా వీక్షించే అవకాశం కల్పించారు. గోదావరి జిల్లాల పిండివంటలతో ‘మెగా ఫుడ్‌ ఫెస్టివల్‌ ’ నిర్వహిస్తున్నారు. తిరుపతిసహా రాష్ట్రంలోని 13 ప్రధాన ఆలయాల నమూనాలను రాజమండ్రిలో ఏర్పాటు చేశారు. ఇవి భక్తులను అలరించనున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రముఖ సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీ కృష్ణ, సినీ సంగీత దర్శకుడు కీరవాణి తదితరులు భక్తులను అలరించనున్నారు. గోదావరి పుష్కరాల్లో ప్రజలు తాము పొందిన అనుభూతిని #MahaPushkaram2015 ట్విటర్‌ లేదా ఫేస్‌బుక్‌లో పంచుకోవచ్చని ప్రభుత్వం సూచించింది. బస్సులు, పురోహితులు, పుష్కర పూజలు తదితర బుకింగ్‌లు కోసం http://www.godavarimahapushkaram.org/లో సంప్రదించాలని కోరారు.