July

సెప్టెంబరు 2న దేశవ్యాప్త సమ్మె..

కేంద్ర ప్రభుత్వ కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలకు నిరసనగా సెప్టెంబరు రెండో తేదీన దేశవ్యాప్త సమ్మె నిర్వహిస్తున్నట్లు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు ప్రకటించారు. నెల్లూరు బాలాజీనగర్‌లోని సిపిఎం కార్యాలయంలో మంగళవారం ఆ పార్టీ జిల్లా ప్లీనం నిర్వహించారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ, సమ్మెను పార్టీ కార్యకర్తలు విజయవంతం చేయాలని కోరారు. దేశవ్యాప్త సమ్మెకు బిజెపి అనుబంధ సంస్థ అయిన బిఎంఎస్‌ కూడా మద్దతిస్తోందని చెప్పారు. వివిధ వర్గాల ప్రజల సమస్యలపై ఆగస్టు ఒకటో తేదీ నుంచి 14వతేదీ వరకు ఆందోళనలకు పిలుపునిచ్చారు. ప్రధానంగా పంటలకు గిట్టుబాటు ధరలు దక్కడంలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

అవినీతిపై లెఫ్ట్‌ సమరం

బిజెపి నేతృత్వంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో అత్యున్నత స్థాయిలో చోటుచేసుకుంటున్న  అవినీతిని ఎండగట్టేందుకు వామ పక్షాలు సమరశంఖం పూరించాయి. ఈ నెల 20న దేశవ్యాప్త ఆందోళన నిర్వహించాలని ఆరు వామపక్ష పార్టీలు నిర్ణయిం చాయి. అవినీతి, ఆశ్రితపక్షపాతంలో కూరుకుపోయిన మంత్రు లను తొలగించి వారిపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్‌తో రాష్ట్రస్థాయిలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించాయి. ఈ మేరకు ఆదివారం ఢిల్లీలోని సిపిఎం ప్రధాన కార్యాలయంలో సిపిఐ, సిపిఐఎంఎల్‌-లిబరేషన్‌, ఆలిండియా ఫార్వర్డ్‌బ్లాక్‌(ఎఐఎఫ్‌బి), ఎస్‌యుసిఐ(సి), ఆరెస్పీ నేతలు సమావేశమయ్యారు.

కార్పొరేట్ల నుంచి దేశ రక్షణే లక్ష్యం

   దేశాన్ని స్వదేశీ, విదేశీ కార్పొరేట్ల నుంచి రక్షించి ప్రభుత్వరంగాన్ని కాపా డటమే సెప్టెంబర్‌ 2న దేశవ్యాప్తంగా అన్ని ట్రేడ్‌యూనియన్లు తలపెట్టిన సమ్మె లక్ష్యమని సిఐటియు ఆలిండియా ప్రధానకార్యదర్శి తపన్‌సేన్‌ ఉద్ఘాటించారు. సోమవారం ఉదయం విశాఖపట్నంలోని సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో తపన్‌సేన్‌ మాట్లాడుతూ, దేశ ప్రధాని మోడీ 'మేకిన్‌ ఇండియా' పేర దేశ ప్రజలను నయవంచనకు గురిచేస్తున్నాడని ఎద్దేవా చేశారు. ప్రభుత్వరంగ వినాశనమే మోడీ, బిజెపి ధ్యేయమన్నారు.

ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా?

 బిజెపి భీష్మాచార్యులు లాల్‌కృష్ణ అద్వానీ ''మళ్లీ చీకటి రోజులు రాబోతున్నాయని'' తన భయాన్ని పైకి వ్యక్తీకరించి, కొందరి మనసులనున్న, బయటకు రాని భయాన్ని ఆవిష్కరించారు. ''ఇప్పుడు మనం ప్రజాస్వా మ్యంలోనే ఉన్నామా?'' అసలు ప్రజాస్వామ్యమంటే ఏమిటీ? అనే ఇంకో ప్రశ్న కూడా ఉదయిస్తుంది. ''అద్వానీ ఆ మాట ఎందుకన్నారు? రాబోయే చీకటి రోజుల చిహ్నాలు ఇప్పుడు కనిపిస్తున్నాయా? ఎలా అంచనా వేయగలిగారు? అన్నిటికీ సమాధానాలు అవసరమే!

ప్రకృతి గతితర్కం

 పురాతన కాలంనాటి అద్భుతమైన స్వాభావిక తాత్విక ఊహలు, అరబ్బుల కాలంలో అడపాదడపా చోటు చేసుకున్న మహావిష్కరణలు ఎక్కువభాగం ఎలాంటి ఫలితాలు ఇవ్వకుండానే అంతర్ధానమైపో యాయి. ప్రకృతిని ఆధునికంగా పరిశోధించి సాధించిన శాస్త్రీయమైన, క్రమబద్ధమైన పరిపూర్ణమైన శాస్త్రీయాభివృద్ధి మాత్రమే కాల పరీక్షకు నిలిచింది. ఈ ఆధునిక శాస్త్ర పరిశోధనాకాలంనుండి ఒక నూతన శకం ఆరంభమయ్యింది. ఇదంతా అతి సమీప చరిత్రయే. జర్మన్లు ఈ శకాన్ని సంస్కరణ యుగంగా పిలుచుకుంటే, ఫ్రెంచి వారు పునరుజ్జీవనశకంగా పిలుచుకున్నారు. ఇటలీవారు సంగీత, సాహిత్యాలు, కళలు, కుడ్యాల నిర్మాణంలో అద్భుత ప్రగతిసాధించిన కాలంగా పేర్కొన్నారు.

నేటినుండి బ్రిక్స్‌ సదస్సులు

బుధవారం నుండి రష్యాలో ప్రారంభం కానున్న బ్రిక్స్‌ దేశాల కూటమి సదస్సు, షాంఘై సహకార సంస్థ సదస్సు సానుకూల ఫలితాల సాధనపైనే దృష్టి పెట్టాయి. ముఖ్యంగా ఆసియా మౌలిక వసతుల పెట్టుబడుల బ్యాంక్‌ (ఎఐఐబి) ఏర్పాటు వంటి అంశాలతో పాటు ఇప్పటి వరకూ చర్చలకు మాత్రమే పరిమితమైన ఈ రెండు వ్యవస్థలు సకారాత్మక సహకారాన్ని బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి. రష్యాలోని ఉఫాలో ప్రారంభం కానున్న బ్రిక్స్‌ గ్రూప్‌ దేశాల సదస్సులో ఎఐఐబి ఏర్పాటు, అత్యవసర రిజర్వ్‌ ఏర్పాటు వంటి అంశాలను చైనా ప్రధానంగాచర్చకు తెనున్నట్టు తెలుస్తుంది.

రాజ్యం-విప్లవం

                లెనిన్‌ రాసిన ప్రసిద్ధ గ్రంథాల్లో ఒకటి 'రాజ్యము-విప్లవము'. దీన్నాయన 1917 ఫిబ్రవరిలో జరిగిన బూర్జువా విప్లవానంతరం అజ్ఞాతంలో వుంటూ, 1917 ఆగస్టు, సెప్టెం బర్‌ నెలల్లో రాశాడు.

వ్యాపంపై 9న విచారణ

మధ్యప్రదేశ్‌లోని వ్యాపం కుంభకోణంపై సుప్రీం కోర్టు పర్యవేక్షణలో సిబిఐ దర్యాప్తు కోరుతూ కాంగ్రెస్‌ నేత దిగ్విజరు సింగ్‌, ముగ్గురు ఆర్‌టిఐ కార్యకర్తలు దాఖలు చేసిన పిటిషన్‌పై ఈనెల 9న విచారణ చేపట్టేందుకు సుప్రీం కోర్టు మంగళవారం అంగీకరించింది. ''అన్ని అంశాలు కలిపి ఒకేసారి విచారించాలని నిర్ణయించాం. జులై 9న విచారిస్తా''మని ప్రధాన న్యాయమూర్తి హెచ్‌.ఎల్‌.దత్తు, జస్టిస్‌ అరుణ్‌ కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ అమితవ రారులతో కూడిన ధర్మాసనం పేర్కొంది.

రాజీలేని తీర్పు..

అత్యాచార కేసుల్లో ఎటువంటి మధ్యవర్తిత్వానికి, రాజీకి తావు ఉండరాదని అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇవ్వడం హర్షణీయం. ఇవి అపరాధ రుసుముతో చెల్లిపోయేంత స్వల్ప నేరాలు కావనీ, ఏమాత్రం మెతక వైఖరి అవలంబించడానికి ఆస్కారం లేనివనీ కింది కోర్టులకు సుప్రీం స్పష్టం చేయడం అభినందనీయం. మైనర్‌ బాలిక రేప్‌ కేసుకు సంబంధించి మధ్యప్రదేశ్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సదరు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పుడు చేసిన సంచలన తీర్పు అది.

Pages

Subscribe to RSS - July