July

పది వామపక్షాల తీర్మానం...

ఎన్నికల ముందు తెలుగుదేశం ప్రభుత్వమిచ్చిన వాగ్దానం మేరకు డ్వాక్రా సంఘాలన్నింటికీ లక్ష రూపాయల రుణమాఫీ చేయాలని, ఆధార్‌తో సంబంధం లేకుండా దీన్ని వర్తింపజేయాలని పది వామపక్ష పార్టీల రౌండ్‌టేబుల్‌ సమావేశం తీర్మానించింది. డ్వాక్రా మహిళల సమస్యలపై గురువారం వామపక్షాల ఆధ్వర్యాన గాంధీనగర్‌ ప్రెస్‌క్లబ్‌లో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు అధ్యక్షతన రౌండ్‌టేబుల్‌ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు డ్వాక్రా మహిళలకిచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందారన్నారు.

చారిత్రాత్మక తీర్పు

జులై5న నిర్వహించిన రిఫరెండమ్‌లో గ్రీకు ప్రజలు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమైనది. ప్రపంచ అభ్యుదయగాముక ప్రజల్లోనూ, శ్రామిక వర్గంలోనూ ఈ తీర్పు ఎంతటి ఉద్వేగం కలిగించిందో ఏథెన్స్‌తో సహా లండన్‌, మాడ్రిడ్‌ వంటి నగరాల్లో వ్యక్తమైన హర్షాతిరేకాలే తెలియజేస్తున్నాయి. తమ జీవన ప్రమాణాలను దారుణంగా దెబ్బతీసే ఇయు రుణదాతల షరతులను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని గ్రీకు ప్రజలు ఈ రిఫరెండం ద్వారా మరోసారి తిరుగులేని తీర్పునిచ్చారు. గత జనవరిలో జరిగిన ఎన్నికల్లో పొదుపు చర్యలకు వ్యతిరేకంగా పలు హామీలు ఇచ్చిన సిప్రాస్‌ నేతృత్వంలోని సిరిజా పార్టీకి వారు విజయం చేకూర్చి పెట్టారు.

ప్రభుత్వ వైఖరి వల్లే ఆత్మహత్యలు : పి.మధు

గుంటూరు జిల్లా అమృతలూరు మండలం కోడితాడిపర్రులో దశాబ్దాల తరబడి సాగుచేసుకుంటున్న తమ భూములను బలవంతంగా వేలం వేయాలని దేవాదాయశాఖ అధికారులు తీసుకున్న నిర్ణయానికి నిరసనగా ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన ఆరుగురు రైతుల్లో మరొకరు బుధవారం ఉదయం మృతి చెందారు.. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్సపొందుతున్న వీర్లపాటి చెత్తయ్య(70) బుధవారం ఉదయం మృతిచెందాడు. దీంతో బాధితులు మరింత ఆగ్రహంతో ప్రభుత్వాస్పత్రి వద్ద పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

సీబీఐకి వ్యాపం: సుప్రీం

వ్యాపం అంశంపై దర్యాప్తు చేపట్టా ల్సిందిగా సుప్రీం కోర్టు కేంద్ర నేర దర్యాప్తు సంస్థ (సి.బి.ఐ.)ని ఆదేశించింది. వరుస హత్యలతో తీవ్ర సంచలనం సృష్టిస్తున్న ఈ వ్యవహారంలో ఒక కానిస్టేబుల్‌ అనుమానాస్పద స్థితిలో చనిపోయిన సంగతి గురువారం వెలుగులోకి వచ్చింది. దీంతో వ్యాపం మృతుల సంఖ్య 46కు చేరింది. వ్యాపం కుంభకోణం మామూలు అవినీతి కుంభకోణం లాంటిది కాదని, రాజకీయ పెద్దలకు, మాఫియా కలగలిసి నడిపిన పెద్ద కుంభకోణమని ఈ హత్యా పరంపర చూస్తే అర్థమవుతున్నది.

విజయవాడ మెట్రోకు మోకాలడ్డు

 నవ్యాంధ్ర రాజధాని చెంతనే ఉన్న ఆంధ్రుల వాణిజ్య రాజధాని విజయవాడలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టి న మెట్రో రైల్‌ ప్రాజెక్టుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. సాక్షాత్తు రాష్ట్రానికి చెందిన ఓ కేంద్ర మంత్రే ’విజయవాడ మెట్రో రైల్‌ ప్రాజెకు’్టకు మోకాలడ్డుతున్నట్లు సమాచారం. రోజురోజుకూ విస్తరిస్తున్న విజయవాడ నగరంలో ట్రాఫిక్‌ కష్టాలను అధిగమించేందుకు గన్నవరం విమానాశ్రయం నుంచి రాజధాని నగరం అమరావతి వరకు మెట్రో రైలు మా ర్గాన్ని నిర్మించాలని ఏపీ సర్కార్‌ భావించింది.

మసకబారుతున్న మోడీ ''ప్రభ''

2013, 2014 సంవత్సరాల్లో 'హర, హర మోడీ' నినాదాలు దేశంలో మిన్నంటాయి. బిజెపిపై మోజుకంటే కాంగ్రెస్‌కు పట్టిన బూజు చూసి జనం (31 శాతమే) బిజెపికి ఓటేశారు. 'జనం' అంటే ఏ జనం అన్న ప్రశ్న ఉదయిస్తుంది. అంబానీలు, అదానీల గురించి మళ్ళీ చెప్పాల్సిన పని లేదు. సంవత్సరంలో మోడీ తిరిగిన 18 దేశాలకూ దేశంలోని పెట్టుబడిదారులను వెంటేసుకుని వెళ్ళారు. ఆస్ట్రేలియా, మంగోలియాకు అదానీని ప్రత్యేకంగా తీసుకెళ్ళారు. అందుకే అనుకుంటా ఆ బృందంలోని సభ్యుల వివరాలు ఇవ్వమని ఆర్‌టిఐ కింద అడిగినా ఇవ్వట్లేదు కేంద్ర ప్రభుత్వం. ఏమైనా, ఈ పెట్టుబడిదారుల 'బృందం' ఎన్నికల ముందూ బలపరిచారు. ఇప్పుడూ బలపరుస్తున్నారు.

పార్టీల గుండెల్లో రైళ్లు

సుప్రీం కోర్టు రాజకీయ పార్టీలను ఎక్కడ సమాచార హక్కు చట్టం పరిధిలోకి తెస్తుందోనన్న భయంతో నాయకులు గుండెల్లో రైళ్లు పరుగులు తీస్తున్నాయి. రాజకీయ పార్టీలను సమాచార హక్కు చట్టం పరిధిలోకి తెస్తే కాంగ్రెస్,బిజెపి తదితర జాతీయ పార్టీలతో పాటు టిఆర్‌ఎస్, తెలుగుదేశం, అన్నా డిఎంకె, డిఎంకె, సమాజ్‌వాదీ, ఆమ్‌ఆద్మీ లాంటి మెజారిటీ ప్రాంతీయ పార్టీల ఆర్థిక రావాదేవీలన్నీ బట్టబయలవుతాయి. అందుకే ఆయా పార్టీల నాయకుల గుండెల్లో గుబులుపుట్టింది.

ప్రభుత్వరంగంతోనే సాధ్యం

భారతదేశ రక్షణ ప్రభుత్వ రంగ సంస్థలతోనే సాధ్యమని సిఐటియు జాతీయ ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్‌ అన్నారు. సోమవారం రాత్రి ఉక్కునగరంలోని గురజాడ కళాక్షేత్రంలో స్టీల్‌ సిఐటియు ఆధ్వర్యాన 'సేవ్‌ ప్లబిక్‌సెక్టర్‌-సేవ్‌ ఇండియా' అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న తపన్‌సేన్‌ మాట్లాడుతూ.. భారత స్వాతంత్రోద్యమం ద్వారా బ్రిటీష్‌ పాలకులను వెళ్లగొట్టగలిగినా, వారి విధానాలను మాత్రం మన పాలకులు అనుసరిస్తున్నారన్నారు. మోడీ ప్రభుత్వం ఈ విధానాలను మరింత వేగంగా అమలుచేస్తోందన్నారు.

సెప్టెంబరు 2న దేశవ్యాప్త సమ్మె..

కేంద్ర ప్రభుత్వ కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలకు నిరసనగా సెప్టెంబరు రెండో తేదీన దేశవ్యాప్త సమ్మె నిర్వహిస్తున్నట్లు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు ప్రకటించారు. నెల్లూరు బాలాజీనగర్‌లోని సిపిఎం కార్యాలయంలో మంగళవారం ఆ పార్టీ జిల్లా ప్లీనం నిర్వహించారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ, సమ్మెను పార్టీ కార్యకర్తలు విజయవంతం చేయాలని కోరారు. దేశవ్యాప్త సమ్మెకు బిజెపి అనుబంధ సంస్థ అయిన బిఎంఎస్‌ కూడా మద్దతిస్తోందని చెప్పారు. వివిధ వర్గాల ప్రజల సమస్యలపై ఆగస్టు ఒకటో తేదీ నుంచి 14వతేదీ వరకు ఆందోళనలకు పిలుపునిచ్చారు. ప్రధానంగా పంటలకు గిట్టుబాటు ధరలు దక్కడంలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

అవినీతిపై లెఫ్ట్‌ సమరం

బిజెపి నేతృత్వంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో అత్యున్నత స్థాయిలో చోటుచేసుకుంటున్న  అవినీతిని ఎండగట్టేందుకు వామ పక్షాలు సమరశంఖం పూరించాయి. ఈ నెల 20న దేశవ్యాప్త ఆందోళన నిర్వహించాలని ఆరు వామపక్ష పార్టీలు నిర్ణయిం చాయి. అవినీతి, ఆశ్రితపక్షపాతంలో కూరుకుపోయిన మంత్రు లను తొలగించి వారిపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్‌తో రాష్ట్రస్థాయిలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించాయి. ఈ మేరకు ఆదివారం ఢిల్లీలోని సిపిఎం ప్రధాన కార్యాలయంలో సిపిఐ, సిపిఐఎంఎల్‌-లిబరేషన్‌, ఆలిండియా ఫార్వర్డ్‌బ్లాక్‌(ఎఐఎఫ్‌బి), ఎస్‌యుసిఐ(సి), ఆరెస్పీ నేతలు సమావేశమయ్యారు.

Pages

Subscribe to RSS - July