ఐరోపాలో పతాక స్థాయికి చేరిన తగవులాట గ్రీస్‌కి, దాని రుణదాతలకూ మధ్య నడుస్తున్న రాజకీయ చదరంగంలో వేస్తున్న ఎత్తులు, పైఎత్తుల పర్యవసానం అని బయటివాళ్లకి అనిపిస్తుంది. నిజానికి ఐరోపా నాయకులు ఈ రుణ రణం మొక్క అసలు స్వభావాన్ని అంతిమంగా బయట పెడుతు న్నారు. దీని విశ్లేషణ అంత ఆనందదాయకంగా ఉండదు. ఇది డబ్బు, అర్థశాస్త్రం కంటే అధికారం, ప్రజాస్వామ్యాలతో ముడిపడిన అంశం.