July

కార్పొరేట్ల నుంచి దేశ రక్షణే లక్ష్యం

   దేశాన్ని స్వదేశీ, విదేశీ కార్పొరేట్ల నుంచి రక్షించి ప్రభుత్వరంగాన్ని కాపా డటమే సెప్టెంబర్‌ 2న దేశవ్యాప్తంగా అన్ని ట్రేడ్‌యూనియన్లు తలపెట్టిన సమ్మె లక్ష్యమని సిఐటియు ఆలిండియా ప్రధానకార్యదర్శి తపన్‌సేన్‌ ఉద్ఘాటించారు. సోమవారం ఉదయం విశాఖపట్నంలోని సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో తపన్‌సేన్‌ మాట్లాడుతూ, దేశ ప్రధాని మోడీ 'మేకిన్‌ ఇండియా' పేర దేశ ప్రజలను నయవంచనకు గురిచేస్తున్నాడని ఎద్దేవా చేశారు. ప్రభుత్వరంగ వినాశనమే మోడీ, బిజెపి ధ్యేయమన్నారు.

ఉద్యోగ భద్రత కల్పించాలి:ఎమ్మెల్సీ శర్మ

రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఎమ్మెల్సీ ఎంవిఎస్‌ శర్మ డిమాండ్‌ చేశారు. ఎపి స్టేట్‌ గవర్నమెంట్‌ కాంట్రాక్ట్‌ అండ్‌ అవుట్‌ సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ (సిఐటియు) ఆధ్వర్యాన సోమవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శర్మ మాట్లాడుతూ, కాంట్రాక్ట్‌ ఉద్యోగులను పర్మినెంటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిందన్నారు.

రుణ ఘోష..

                  ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం విడుదల చేసిన ఎపి వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యాలు ఎంత ఘనంగా ఉన్నా ఆచరణపై అనుమానాలు కలుగుతున్నాయి. అందుక్కారణాలు లేకపోలేదు. విభజనానంతర ఆంధ్రప్రదేశ్‌కు తొలి సిఎం అయిన చంద్రబాబు గత సంవత్సరం ఆవిష్కరించిన రుణ ప్రణాళిక టార్గెట్లు, సాధించిన ప్రగతిని పరిశీలిస్తే తాజా ప్లాన్‌కూ అదే గతి పడుతుందేమోనన్న సందేహం కలుగుతుంది. 2014-15 ప్రణాళిక లక్ష్యం రూ.91,459 కోట్లు కాగా బ్యాంకులు 85,345 కోట్లే ఇచ్చాయి. అందులో కూడా ప్రాధాన్యతా రంగాలకు బాగా తగ్గించేశాయి. ఈ విషయాన్ని ప్రజలు ఎలా విస్మరిస్తారు?

ఉపాధి కోల్పోయిన వారికి అండగా సిపిఎం..

రాజధాని నిర్మాణం కారణంగా  ఉపాధి కోల్పోయిన వ్యవసాయ కూలీలకు రోజుకు 300చోప్పున నెలకు 9వేల రూపాయలు ఇవ్వాలని, అవి కుడా ఏప్రిల్ నెల నుండి లెక్కకట్టి ఇవ్వాలని, రైతులకు ఏవిధంగా అయితే రాజధాని ప్రాంతంలో సంపూర్ణ రూణమాఫీ చేశారో అదే విధంగా డ్వాక్ర మహిళలకు కూడా సంపూర్ణ రుణమాఫీ చేయాలని సిఆర్ డిఎ కార్యలయం ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో రాజధాని ప్రాంతా గ్రామాల ప్రజలు ధర్న కార్యక్రమం నిర్వహించారు..ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు, కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు తదితరులు పాల్గొన్నారు .

 

మార్గదర్శి కొరటాల..

               భూస్వామ్య కుటుంబంలో పుట్టి విద్యార్థి దశలోనే ఉద్యమాలు నడిపిన నేత కొరటాల సత్యన్నారాయణ. ఆనాటి విద్యార్థి సంఘం జిల్లా నాయకులైన ఎంబి, ఎంహెచ్‌, ఎల్‌బిజిల సాన్నిహిత్యంతో కమ్యూనిస్టు పార్టీ వైపు ఆకర్షితులై పేద ప్రజల శ్రేయస్సుకై జీవితాన్ని త్యాగం చేసిన ధన్యజీవి. ఆయన రేపల్లె డివిజన్‌ పార్టీ కార్యదర్శిగా, జిల్లా కార్యదర్శిగా, రాష్ట్ర కార్యదర్శిగా, కేంద్ర కమిటీ సభ్యులుగా, పొలిట్‌బ్యూరో సభ్యులుగా అంచెలంచెలుగా ఎదిగిన ప్రజానాయకులు. రేపల్లె ఏరియాలో చేనేత కార్మికుల సమస్యలపై నిరంతరం అలుపెరగని కృషి చేశారు.

సంక్షోభంపై హెచ్చరిక

             ప్రస్తుత ప్రపంచ ఆర్థిక పరిస్థితినీ, పరిణామాలనూ 1930 నాటి ఆర్థిక సంక్షోభ పరిణామాలతో పోల్చుతూ.. ఇటీవల లండన్‌ బిజినెస్‌ స్కూలులో జరిగిన సదస్సులో భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బిఐ) గవర్నర్‌ రఘురాం రాజన్‌ చేసిన ప్రసంగం సంచలనాన్నే సృష్టించింది. జాగ్రత్త వహించకపోతే 1930 నాటి పరిణామాలు పునరావృతమయ్యే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. ఐఎంఎఫ్‌ మాజీ ఆర్థిక సలహాదారుగానూ, పెద్ద ఆర్థిక వ్యవస్థ ఉన్న భారతదేశ రిజర్వు బ్యాంక్‌కు గవర్నర్‌గానూ ఉన్న వ్యక్తి చెప్పిన ఏ వ్యాఖ్యలకైనా విలువ ఉంటుంది.

ఆర్థిక సంక్షోభంలో ఏపీ..

అరకొర ఆదాయం! పెరుగుతున్న ఖర్చులు! కేంద్ర సాయం శూన్యం! నిధుల సర్దుబాటుకు తిప్పలు! తప్పని ఓవర్‌ డ్రాఫ్టులు! ఏపీ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఇది! దీంతో నిధులు సర్దుబాటు చేయలేక ఆర్థిక శాఖాధికారులు తలపట్టుకుంటున్నారు. వారానికోసారి ఢిల్లీ వెళ్లి కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం చేస్తున్న ప్రయత్నాలు కూడా ఫలించడం లేదు. రూపాయి కూడా విదల్చకుండా చూద్దాం చేద్దాం అంటూ దాటవేస్తున్నారు. ఇక, బడ్జెట్‌లో పన్ను ఆదాయాన్ని రూ.3200 కోట్లుగా నిర్దేశించినా.. ఏ నెలా రూ.2800 కోట్లు మినహా రాలేదు. వసూలుకు, లక్ష్యానికి రూ.400 కోట్లు తేడా ఉంది.

ప్రాణాలు తీస్తున్న వ్యాపం..

వ్యాపం కుంభకోణంతో సంబంధమున్న వారు ఒక్కొరొక్కరూ మరణి స్తుండటం అనేక సందేహాలను రేకెత్తిస్తోంది. తాజాగా ఈ అంశంపై వార్తలు రాస్తు న్న జర్నలిస్టు, జబల్పూర్‌కు చెందిన వైద్య కళాశాల డీన్‌ మరణించారు. డీన్‌ డాక్టర్‌ అరుణ్‌ శర్మ మృతదేహాన్ని న్యూఢిల్లీలోని ఓ హోటల్లో ఆదివారం ఉదయం కనుగొ న్నారు. నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ వైద్య కళాశాలకు ఆయన డీన్‌గా వ్యవహరి స్తున్నారు. వ్యాపం కుంభకోణాన్ని ఆయన పరిశోధిస్తున్నారు. సరిగ్గా ఏడాది క్రితం ఇన్చార్జి డీన్‌ అయిన డాక్టర్‌ డి.కె. సక్కలే 90శాతం కాలిన గాయాలతో చనిపోయి కనిపించారు. డాక్టర్‌ శర్మ మృతిపై ప్రస్తుతం ఏమీ వ్యాఖ్యానించలేమని ఢిల్లీ పోలీసు లు చెప్పారు.

దొంగను ఊరేగించడమా?

టిడిపి ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి జైలు నుంచి బెయిల్‌పై బయటకు వస్తూ మాట్లాడిన మాటలు సభ్య సమాజం సిగ్గుపడేలా ఉన్నాయని, ఇకపై ఈ మాటలు మానకపోతే సహించేది లేదని మంత్రులు, ఎమ్మెల్యేలు హెచ్చరించారు. మంత్రులు మహేందర్‌రెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి వేరువేరుగా విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు శిక్షణతో రేవంత్‌రెడ్డి పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి మండిపడ్డారు. మరోసారి ముఖ్యమంత్రి గురించి మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు.

Pages

Subscribe to RSS - July