July

ప్రాణాలు తీస్తున్న వ్యాపం..

వ్యాపం కుంభకోణంతో సంబంధమున్న వారు ఒక్కొరొక్కరూ మరణి స్తుండటం అనేక సందేహాలను రేకెత్తిస్తోంది. తాజాగా ఈ అంశంపై వార్తలు రాస్తు న్న జర్నలిస్టు, జబల్పూర్‌కు చెందిన వైద్య కళాశాల డీన్‌ మరణించారు. డీన్‌ డాక్టర్‌ అరుణ్‌ శర్మ మృతదేహాన్ని న్యూఢిల్లీలోని ఓ హోటల్లో ఆదివారం ఉదయం కనుగొ న్నారు. నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ వైద్య కళాశాలకు ఆయన డీన్‌గా వ్యవహరి స్తున్నారు. వ్యాపం కుంభకోణాన్ని ఆయన పరిశోధిస్తున్నారు. సరిగ్గా ఏడాది క్రితం ఇన్చార్జి డీన్‌ అయిన డాక్టర్‌ డి.కె. సక్కలే 90శాతం కాలిన గాయాలతో చనిపోయి కనిపించారు. డాక్టర్‌ శర్మ మృతిపై ప్రస్తుతం ఏమీ వ్యాఖ్యానించలేమని ఢిల్లీ పోలీసు లు చెప్పారు.

దొంగను ఊరేగించడమా?

టిడిపి ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి జైలు నుంచి బెయిల్‌పై బయటకు వస్తూ మాట్లాడిన మాటలు సభ్య సమాజం సిగ్గుపడేలా ఉన్నాయని, ఇకపై ఈ మాటలు మానకపోతే సహించేది లేదని మంత్రులు, ఎమ్మెల్యేలు హెచ్చరించారు. మంత్రులు మహేందర్‌రెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి వేరువేరుగా విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు శిక్షణతో రేవంత్‌రెడ్డి పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి మండిపడ్డారు. మరోసారి ముఖ్యమంత్రి గురించి మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు.

నకిలీ విశ్వవిద్యాలయాలు..!

దేశవ్యాప్తంగా ఉన్న నకిలీ విశ్వ విద్యాలయాల జాబితాను యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యుజిసి) బుధవారం విడుదల చేసింది. ఈ జాబితాను యుజిసి తన వెబ్‌సైట్లో ఉంచింది. రాష్ట్రాల వారీగా 21 నకిలీ విశ్వవిద్యాలయాల పేర్లను ప్రకటించింది. అత్యధిక సంఖ్యలో నకిలీ విశ్వవిద్యాలయాలున్న రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్‌ (8) నిలిచింది. తర్వాతి స్థానంలో ఆరు నకిలీ విశ్వవిద్యాలయాలతో ఢిల్లీ స్థానం పొందింది. అయితే ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన విద్యాసంస్థలు లేవు.

సుప్రీం కోర్టు సంచలన తీర్పు

రేప్‌ కేసులపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. అత్యాచార కేసుల్లో మధ్యవర్తిత్వాన్ని ప్రొత్సహించడం ఆమోదయోగ్యం కాదని బుధవారం సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. అలా చేయడం పెద్ద తప్పిదం అవుతుందని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. పైగా అది మహిళల గౌరవానికి భంగం కలిగించడమేనని సుప్రీం స్పష్టం చేసింది. ఇటీవల తమిళనాడు హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు తప్పు పట్టింది. మద్రాస్‌ హైకోర్టు రేప్‌ కేసులో నిందితుడికి బైయిల్‌ ఇచ్చింది. బాధితురాలితో మధ్యవర్తిత్వం కుదుర్చుకునేందుకు వీలుగా బెయిల్‌ ఇస్తున్నట్లు న్యామూర్తి ప్రకటించారు. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తాజా తీర్పు ప్రాధాన్యత సంతరించుకుంది.

యోగా క్లాసులపై నిషేధం..

 ఓ వైపు భారత దేశం నేతృత్వంలో ప్రపంచ దేశాలన్నీ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకొని కొద్ది రోజులు కూడా గడవక ముందే సెంట్రల్ రష్యాలోని నిజ్నెవర్టొవిస్క్ నగరంలో అధికారులు మతపరమైన మూఢత్వం వ్యాప్తిని అరికట్టడం కోసమని చెప్తూ యోగా తరగతులపై నిషేధం విధించారు. పరమ శివుడు మొట్టమొదట పాటించినట్లు భారతీయ పురాణాలు చెప్తున్న కఠినమైన ఆసనాలు కలిగి ఉన్న హఠయోగ తరగతులు నిర్వహిస్తున్న రెండు స్టూడియోలపై అధికారులు ఈ నిషేధాన్ని విధించారు. అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా హఠయోగానికి ఎంతో ప్రజాదరణ ఉంది.

పోరాటాలకు సిద్దం..పి మధు

ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా , ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఆగస్ట్ 1వతేదీ నుండి 14వతేదీ వరకు దేశ వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు తెలిపారు. విజయవాడ సిపిఎం పార్టీ కార్యలయంలో జరిగిన విలేకర్ల సమావేశంలో మధు మాట్లాడారు. రాష్ట్రంలో సంక్షేమం అరకొర ఉందని , చిరుద్యోగులు , కార్మికుల హక్కులపైదాడి ఈ కాలంలో బాగా పెరిగిపోయిందని, పాలనలో ఏకపక్షం తెలుగుదేశం పార్టీ వ్యవహారిస్తుందని మధు అన్నారు.

సొమ్ములిస్తేనే సేవలు..!

'ఆరధ్రప్రదేశ్‌కు ఇక సేవలు అరదిచాల్సిన అవసరం లేదు. వారు డబ్బులు చెల్లిస్తేనే సేవలు అరదిరచండి.'' అరటూ తెలంగాణ అదధికారులు తీసుకున్న కొత్త నిర్ణయం మరో సరికొత్త వివాదానికి తెరతీస్తోరది. ఉన్నత స్థాయిలో అనుమతి లేకుండా బయట శాఖల అధికారులతో మాట్లాడవద్దని, వారి కార్యాలయాలకు వెళ్లవద్దని తెలంగాణ ప్రభుత్వం నియమిరచిన సెరటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ డైరెక్టర్‌ జనరల్‌ శివశంకర్‌ ఇచ్చిన ఆదేశాలపై ఆరదోళనన ప్రారంభమైరది. అది కూడా భారత రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ రాష్ట్ర పర్యటన సందర్భంగా హైదరాబాద్‌లో ఉన్న సమయంలోనే ఈ ఆదేశాలు విడుదల కావడం గమనార్హం.

Pages

Subscribe to RSS - July