
సెక్షన్-8కి తాను వ్యతిరేకినని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. హైదరాబాద్ అందరికీ సొంతిళ్లు వంటిదని, ఉమ్మడి రాజధాని శాంతిభద్రతలను కేంద్రానికి అప్పగించాలనడం సరికాదని అన్నారు. హైదరాబాద్‌లో ఉన్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య అంతర్యుద్ధం వచ్చేలా ప్రభుత్వాలు వ్యవహరిస్తే అప్పుడు సెక్షన్ 8 అవసరం వస్తుందని చెప్పారు. సెక్షన్ 8ను ప్రవేశపెట్టి కొత్త రాష్ట్రం ఇచ్చిన ఆనందాన్ని హరించొద్దని ఆయన అన్నారు. అవసరమైతే దీనికోసం హైదరాబాద్‌లో ఓ కేంద్ర కార్యాలయాన్ని పెట్టండి. ఓ ఐపీఎస్ అధికారికి దాని పర్యవేక్షక బాధ్యతలను అప్పగించండి. నేరుగా ప్రధానమంత్రి కార్యాలయానికి జవాబు చెప్పేలా చేయండి..' అని అన్నారు.