July

తహసిల్ధార్‌కు సిఎం వార్నింగ్

'అసలు నిన్నక్కడికి ఎవరెళ్లమన్నారు. నీవె వెళ్లినందువల్లే ఇంత రాద్దాంతం జరుగుతోంది. ప్రతి పక్షాలు అవకాశాన్ని తీసుకున్నాయి. అది పోలీసుల పని కదా... పోలీసులకు చెప్పి ఉంటే సరిపోయేది.' అని ముసునూరు తాహిసిల్ధార్‌ వనజాక్షినుద్ధేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నట్లు తెలిసింది. సోమవారం ఉదయం ముఖ్యమంత్రి తన నివాసంలో ఎంఎల్‌ఏ దాడి వ్యవహారం సంఘ టనపై పంచాయతీ నిర్వహించారు. ఇరువర్గాలతో విడివిడిగా మాట్లాడారు. విశ్వసనీయ వర్గాల సమా చారం ప్రకారం ఆయన బాధిత మహిళా అధికారి తీరుపైనే ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.

వికీలీక్స్‌ వార్తలు అవాస్తవం

వికీలీక్స్‌ వెల్లడించినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని, ట్యాపింగ్‌ కోసం సింగపూర్‌ హ్యాకింగ్‌ టీమ్‌కు ఏపీ ప్రభుత్వం బాధ్యతలు అప్పగించినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని ఏపీ ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి దుష్ప్రచారాలు మానుకోవాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు కొన్ని రాజకీయ పార్టీలు, వారి తొత్తులుగా ఉన్న చానెళ్ల కుట్ర చేస్తున్నాయని యనమల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కథనాలకు, మెయిల్స్‌కు సంబంధించి... ఏపీ ప్రభుత్వానికి సబంధంలేదని మంత్రి యనమల స్పష్టం చేశారు.

అడకత్తెరలో భారత జాతీయ బ్యాంకులు

 ప్రపంచ ఆర్థిక సంకోభ ధాటి నుండి ప్రపంచ బ్యాంకింగ్‌ వ్యవస్థను రక్షించడం కోసం బాసెల్‌ 3 ప్రమాణాలు రూపకల్పన చేయబడ్డాయి. ప్రపంచీకరణ నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థను ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానించిన కారణంగా భారత రిజర్వ్‌ బ్యాంక్‌ 1-4-2013 నుండి భారత దేశంలోని జాతీయ బ్యాంకులు, ప్రైవేటు బ్యాంకులు బేసెల్‌ 3 ప్రమాణాలను అమలుచేయాలని అదేశించింది. ఈ ప్రమాణాల అమలుతో బ్యాం కుల పరిరక్షణ ఎలాగున్నా, అదనపు మూలధన సమీకరణలో జాతీయ బ్యాంకులు జీవన్మరణ పోరాటం జరుపుతూ, అంతిమంగా ప్రైవేటీ కరణ దిశగా అడుగులు వేయాల్సిన దుర్భర పరిస్థితులను నరేంద్రమోడీ నాయకత్వంలోని యన్‌డిఎ ప్రభుత్వం కల్పిస్తున్నది.

ఈనాటికీ తరగని మార్క్స్ ప్రాధాన్యత

2007లో లండన్‌లో యూదుల పుస్తక వారోత్సవం జరుగుతున్నది. అప్పటికి కారల్‌ మార్క్స్‌ వర్థంతి (మార్చి14) మరి రెండు వారాలుంది. పుస్తక వారోత్సవం జరుగుతున్నది కూడా లండన్‌లో మార్క్స్‌తో బాగా ముడివడిన బ్రిటిష్‌ మ్యూజియం లైబ్రరీలోని వలయాకారపు పఠన మందిరం సమీపంలో. జాక్స్‌ అట్టాలీ, నేనూ ఆయనకు జోహార్లర్పించేందుకు అక్కడకు చేరాం. మేమిద్దరం చాలా భిన్నమైన తరహాలకు చెందిన సోషలిస్టులం. అయితే మీరు ఆ తేదీని సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని చూస్తే ఇది ఒకటికి రెండు రెట్లు ఊహించని విషయంగా కనిపిస్తుంది. 1883లో మార్క్స్‌ విఫలజీవిగా మరణించాడని ఎవరూ చెప్పడానికి లేదు.

నూతన మద్యం పాలసీని ఉపసంహరించుకోవాలి:మధు

ఎపి ప్రభుత్వం నూతన మద్యం పాలసీని ఉపసంహరించుకోవాలని సీపీఎం ఎపి రాష్ట్ర కార్యదర్శి పి.మధు డిమాండ్ చేశారు. ఇళ్ల మధ్య నెలకొల్పిన మద్యం షాపును వెంటనే తొలగించాలని కాకినాడలో మహిళలు ఆందోళనకు దిగారు. రామారావుపేట నైట్‌ హోటల్‌ సెంటర్‌లో ధర్నాకు దిగిన మహిళలకు సీపీఎం మద్దతు తెలిపింది. ఈ కార్యక్రమంలో మధు పాల్గొని, మాట్లాడారు. చంద్రబాబుపై మధు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఆడిన మాట తప్పారని..మోసగాడని ఘాటుగా విమర్శలు చేశారు. అధికారంలోకి వస్తే.. మద్యాన్ని నిషేధిస్తానని చెప్పిన బాబు అధికారంలోకి వచ్చాక.. విస్తరింపచేసే కార్యక్రమాన్ని చేపట్టారని మండిపడ్డారు.

భారత కార్మికోద్యమ చరిత్ర

ప్రముఖ ట్రేడ్‌ యూనియన్‌ నాయకులు, ప్రసిద్ధ రచయిత సుకోమల్‌ సేన్‌ బృహత్తర రచన 'భారత కార్మిక వర్గం -ఆవిర్భావం, ఉద్యమం, 1830-2010'. క్షుణ్ణంగా సవరించి, విస్తరించిన తృతీయ ప్రతికి తెలుగు అనువాదం ఇది. రచయిత తొలి ప్రతి ముందు మాటలో పేర్కొన్నట్లు ఇది సంప్రదాయ సిద్ధమైన ట్రేడ్‌ యూనియన్‌ చరిత్రలకు భిన్నమైనది. విస్తృతమైన జాతీయ, అంతర్జాతీయ నేపథ్యంలో భారత కార్మిక వర్గ పోరాటాలను రాజకీయాలు ఆర్థికాంశాల పరస్పర ప్రభావాలను గమనంలోకి తీసుకొని సాగిన రచన ఇది. భారత దేశంలో కార్మిక వర్గ ఆవిర్భావం, సంపన్న దేశాలలో కార్మిక వర్గ ఆవిర్భావానికి భిన్నమైన రీతిలో వలస పాలకులు పూర్తి ఆధిపత్యం కొనసాగుతున్న సమయంలో జరిగింది.

బాబు సెటిల్మెంట్ సిఎం..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా ధ్వజమెత్తారు. ట్యాపింగ్ తప్పు అని చెప్పిన చంద్రబాబు ఏ చట్టం ప్రకారం ట్యాపింగ్ టెక్నాలజీని కొనుగోలు చేస్తున్నారని ప్రశ్నించారు. బాబు సీఎంలా కాదు.. సెటిల్‌మెంట్ మినిస్టర్‌లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ట్యాపింగ్ టెక్నాలజీ కొనుగోలుకు బాబు యత్నిస్తున్నాడన్న వ్యవహారంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని రోజా డిమాండ్ చేశారు. 

నవ్యాంద్రాలో మద్యం మాఫియా

నవ్యాంద్రాలో మద్యం మాఫియా విచ్చల విడిగా పెచ్చురిల్లుతుందని..రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన మద్య విధానం వల్ల మండల స్థాయిలో బెల్ట్‌ షాపులు పెరుగుపోతున్నాయని మహిళ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ విమర్శించారు. డ్వాక్రా రుణమాఫీ చేస్తానని మహిళ ఓట్లు వేయించుకొని గద్దెనెక్కిన చంద్రబాబు మహిళ వ్యతిరేఖ విధానాలు రూపొందుస్తున్నారని ఆరోపించారు. బుధవారం నుంచి రెండు రోజుల పాటు జరిగే జాతీయ మహిళ కాంగ్రెస్‌ సమావేశాలకు ఢిల్లీ వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడుతూ...కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేఖ విధానాల, భూఆర్ధినెన్స్‌,బీజేపీ అవినీతిపై చర్చించామన్నారు.

మాజీ సైనికోద్యోగులకు అండగా సిపిఎం

 'ఒక ర్యాంక్‌కి ఒక పెన్షన్‌' అంటూ మాజీ సైనికోద్యోగులు చేస్తున్న సుదీర్ఘ డిమాండ్‌కు తమ పూర్తి మద్దతు, సంఘీభావం ఎల్లప్పుడూ వుంటుందని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రకటించారు. గత నెల 14వ తేది నుండి ఇక్కడ జంతర్‌మంతర్‌ వద్ద వారు చేస్తున్న ధర్నాకి, నిరవధిక రిలే నిరాహార దీక్షలకు సంఘీభావం ప్రకటించారు. ఈ మేరకు ఏచూరి ఒక లేఖ రాశారు. ఈ దేశ ఐక్యత, ప్రాదేశిక సమగ్రత కోసం సాయుధ బలగాలు ఎనలేని త్యాగాలు చేశాయని ఆయన ఆ లేఖలో కొనియాడారు.

Pages

Subscribe to RSS - July