ఇవి తొక్కిసలాట మరణాలు కావు, ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలు. గోదావరి పుష్కరాలు జరుపుతున్నాం రండి, రండి అని వేలాది మంది ప్రజలను రప్పించి నిర్లక్ష్యంతో సర్కారు చేసిన హత్యలివి. గొప్ప పరిపాలనా దక్షునిగా తనకు తానే కితాబులిచ్చుకునే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి సమక్షంలో జరిగిన హత్యలివి.
రాజమండ్రి పుష్కరఘాట్ వద్ద మంగళవారం ఉదయం జరిగిన తొక్కిసలాటలో 31 మంది మృత్యువాత పడ్డారన్న వార్త విన్నప్పుడు వెంటనే వచ్చే ప్రశ్న ఈ ఘటన ఎలా జరిగింది, దీనికి బాధ్యులెవరు అని. మూడు ముఖ్యమైన కారణాలు కనిపిస్తున్నాయి.