July

దీక్షకు దిగ‌నున్నఅన్నాహాజారే

 ప్రముఖ సామాజిక వేత్త అన్నా హాజారే మళ్లీ నిరహార దీక్ష చేయబోతున్నారు. రాంలీలా మైదాన్ లో అక్టోబర్ 2వ తేదీన అన్నా నిరహార దీక్షకు కూర్చొంటున్నారు. భూ సేకరణ బిల్లుకు వ్యతిరేకంగా ఈ దీక్ష చేయనున్నారు.

స్మార్ట్‌విశాఖా..చెత్తవిశాఖా

విశాఖ మున్సిపల్‌ కార్మికుల సమ్మెతో స్మార్ట్‌ విశాఖ కాస్తా చెత్త విశాఖ‌గా మారిపోయింది. గత ఆరు రోజులుగా మున్సిపల్‌ కార్మికుల సమ్మె కొనసాగుతున్న త‌రుణంలో నగరమంతా కంపుమయం అయ్యింది. 72 వార్డుల్లో దుర్గంధమయం అయ్యాయి. రోజుకు 800 టన్నుల చెత్త విశాఖలో పేరుకుపోయింది. ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకపోవడంతో జనం పరిస్థితి దయనీయంగా మారింది. దానికి తోడు వ‌ర్షం ప‌డ‌తే రోడ్డు‌లు అస్త‌వ్య‌స్తంగా త‌యారవుతున్నా‌యి. దాని వ‌ల‌న అంటువ్యా‌ధులు ప్ర‌భ‌లే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌జ‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తు‌న్నా‌రు.

బిజెపి నేడు ఇఫ్తార్‌ విందు

రంజాన్‌ పవిత్ర మాసం సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వ ర్యంలో బుధవారం ముస్లిం సోదరులకు ఇఫ్తార్‌ విందు ఏర్పాటు చేస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. నాంపల్లిలోని పబ్లిక్‌ గార్డెన్‌ ఎదురుగా హాజ్‌ హౌస్‌ పక్కన గల రెడ్‌రోస్‌ పంక్షన్‌ హాలులో 15వ తేదీ సాయంత్రం ఆరు గంటలకు ఈ ఇఫ్తార్‌ విందు జరుగు తుందని ఆయన పేర్కొన్నారు.

జులై 30న ఉరిశిక్ష!

వందలాది మందిని పొట్టన పెట్టుకున్న యాకుబ్ మెమెన్(53)కు ఉరిశిక్ష ఖాయమైంది. 1993 ముంబయి బాంబు పేలుళ్ల కేసులో ఉరిశిక్ష పడ్డ మెమెన్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించిన విషయం విదితమే. మెమెన్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ కూడా తోసిపుచ్చారు. దీంతో మెమెన్ ఉరిశిక్ష ఖాయమైంది. జులై 30న మెమెన్‌ను ఉరి తీసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం మెమెన్ నాగపూర్ సెంట్రల్ జైలులో ఉంటున్నారు. ముంబయి బాంబు పేలుళ్ల కేసులో మెమెన్‌కు 2007లో కోర్టు మరణశిక్ష విధించింది. 1993 మార్చి 12న జరిగిన పేలుళ్లలో 250 మందికి పైగా మృతి చెందగా, 750 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు.

కలం గళమై గర్జించిన 'గరిమెళ్ల'

అభ్యుదయ భావజాలంతో దేశభక్తిని చాటుతూ బ్రిటిష్‌ పాలనకు వ్యతిరేకంగా ఉత్తరాంధ్ర నుంచి ఎగసి పడ్డ కవి కెరటం గరిమెళ్ల.. 1892 జులై 15న నాటి కళింగాంధ్ర (నేడు ఉత్తరాంధ్ర) ప్రాంతానికి చెందిన శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం ప్రియాగ్రహారంలో సూరమ్మ, వెంకట నరసయ్యకు జన్మించారు. ప్రజాకవి, జాతీయ కవి సార్వభౌమ బిరుదాకింతుడైన గరిమెళ్ల కలం గళమై బ్రిటిష్‌ సామ్రాజ్యపు గుండెల్లో రైళ్లు పరుగెత్తించాయంటే ఆశ్చర్యం కలుగక మానదు. పాత్రికేయ వృత్తిని దేశ హితం కోసం, పరపీడన నుంచి జాతి విముక్తి కోసం అనేక రచనలు సాగించారు.

ప్రాణాంతక నిర్లక్ష్యం..

మంగళవారం రాజమండ్రి పుష్కర ఘాట్‌లో చోటుచేసుకున్న మహా విషాదం ప్రతి ఒక్కరి గుండెల్ని పిండేసింది. దీనిని వర్ణించడానికి మాటలు చాలవు. సర్కారీ నిర్లక్ష్యానికి రెండు డజన్లకు పైగా నిండు ప్రాణాలు గోదారిలో కలిసిపోయాయి. మృతులలో ఎక్కువ మంది మహిళలే. మరో 30 మంది తీవ్రగాయాలతో ఆసుపత్రుల పాలయ్యారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా వుంది. కాబట్టి మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముంది. సర్కార్‌ అనుసరించిన దారుణ నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనమే ఈ తొక్కిసలాట. ప్రతి పన్నెండేళ్లకొకసారి వచ్చే గోదావరి పుష్కరాల్లో కనీవిని ఎరుగని ఘోరమిది.

గ్రీస్‌సంక్షోభానికి పరిష్కారం

ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకుని రుణభారంతో సతమతం అవుతున్న గ్రీస్‌ దేశాన్ని యూరోజోన్‌లోనే కొనసాగించేందుకు యూరోజోన్‌ సభ్యదేశాలు సమ్మతించాయి. గ్రీస్‌కకు కొత్త ఉద్దీపన ప్యాకేజిలు కూడా లభిస్తున్నాయి. ప్రజలపై కఠిన షరతులతో కూడిన కొత్త సంస్కరణలు చేపట్టి ఆర్ధికంగా నిలదొక్కుకునేందుకు గ్రీస్‌ప్రయత్నించాల్సి ఉంటుంది. గ్రీస్‌ను యూరోజోన్‌లో ఉంచేందుకు అందరూ ఏకగ్రీవంగా అంగీకరించారని, ఆర్ధిక సం స్కరణలు, కఠిన షరతులతో గ్రీస్‌కు మూడో విడత బెయిల్‌ఔట్‌ ప్యాకేజి కింద రుణపరతిని అందిం చేందుకు సహకరించినట్లు యూరోపియన్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు డొనాల్డ్‌ టస్క్‌ సోమవారం వెల్లడించారు.

14 రాష్ర్టాల సిఎంలు డుమ్మా

నీతి ఆయోగ్ సమావేశం ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన ప్రారంభమైంది. ఈ సమావేశం ప్రధాని నివాసంలో కొనసాగుతోంది. సమావేశానికి 14 రాష్ర్టాల ముఖ్యమంత్రులు హాజరు కాలేదు. బీజేపీ పాలిత రాష్ర్టాల సీఎంలు మాత్రమే సమావేశానికి హాజరయ్యారు. సమావేశానికి ఆయా రాష్ర్టాల సీఎంలు హాజరు కాకపోవడానికి కారణం వివాదాస్పద భూసేకరణ బిల్లుపై చర్చించడమే. సమావేశానికి ఢిల్లీ సిఎం కేజ్రీవాల్‌తో పాటు బీహార్ సిఎం నితీష్‌కుమార్ హాజరయ్యారు. కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల ముఖ్యమంత్రులతో పాటు యూపి సిఎం అఖిలేష్, బెంగాల్ సీఎం మమత హాజరు కాలేదు. భూసేకరణ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, అఖిలేష్, మమత స్పష్టం చేశారు.

హోరాహోరిగా పార్లమెంట్ సమావేశాలు

ఈనెల 21 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు తొలిరోజునుంచే వేడిపుట్టించనున్నాయి. ఐపీఎల్‌ మాజీ కమిషనర్‌ లలిత్‌ మోదీకి సాయం చేసినట్లు ఆరోపణలు వచ్చిన విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్‌, రాజస్థాన్‌ ముఖ్యమంత్రి వసుంధరా రాజే, ఇతర కుంభకోణాల్లో ఇరుక్కున్న మరో ఇద్దరు బీజేపీ రాషా్ట్రల సీఎంలు శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, రమణ్‌ సింగ్‌లు రాజీనామా చేసే ప్రసక్తి లేదని ప్రభుత్వం తేల్చిచెప్పడంతో ప్రతిపక్షాలు ఏకమయ్యాయి. పార్లమెంట్‌ సమావేశాలలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు తమ వ్యూహానికి పదును పెడుతున్నాయి.

Pages

Subscribe to RSS - July