July

200మంది పారిశుధ్యకార్మికుల అరెస్టు

తమ డిమాండ్లు నెరవేర్చాలని మున్సిపల్‌ పారిశుధ్య కార్మికులు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన సమ్మె మంగళవారానికి 11 రోజులు పూర్తిచేసుకుంది. ఓపక్క పోరాటం ఉధృతంగా మారుతున్నా ప్రభుత్వంలో స్పందన లేకపోగా విజయవాడలో పారిశుధ్య కార్మికులు మంగళవారం చేపట్టిన రెవెన్యూ కార్యాలయాలు, మున్సిపల్‌ అధికారుల బంగ్లాల ముట్టడి కార్యక్రమాన్ని అడ్డుకుని అరెస్టులకు తెగబడింది. పోలీసులు విచక్షణారహితంగా వ్యవహరించి 200 మందికి పైగా అరెస్ట్‌ చేశారు. మహిళలనీ చూడక ఈడ్చికెళ్లి వ్యానులో పడేశారు.

నేడు రాజమండ్రిలో కేబినెట్ సమావేశం

ఏపీ మంత్రిమండలి సమావేశం రాజమండ్రిలో బుధవారం జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు కాగానే తొలి మంత్రివర్గ సమావేశం విశాఖలో జరిగింది. ఇప్పుడు రాజమండ్రి వేదికగా మారింది.  మంగళవారం రాత్రికే మంత్రులు, సీఎస్‌ ఐవైఆర్‌ కృష్ణారావుతో సహా సీనియర్‌ ఐఎఎ్‌సలంతా రాజమండ్రి చేరుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఉదయం పది గంటలకు జరిగే సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేసిన రాజధాని మాస్టర్‌ ప్లాన్‌పై సమగ్రంగా చర్చించి.. ఆమోదించనున్నారు. మరికొన్ని కీలకాంశాలపైనా చర్చిస్తారని సమాచారం. ఈ భేటీలో రాజమండ్రి అభివృద్ధిపై చర్చించే అవకాశం ఉంది.

సింగపూర్‌కు లక్షకోట్లు నజరానా..

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని మాస్టర్‌ ప్లాన్‌ కోసం టిడిపి ప్రభుత్వం సింగపూర్‌కు లక్ష కోట్లు నజరానా ఇచ్చిందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌కు సేవ చేయడానికి సింగపూరేమైనా దార్మిక సంస్ధా అని ప్రశ్నించారు. మాస్లర్‌ ప్లాన్‌ను ఫ్రీగా ఇవ్వడానికి సింగపూర్‌ తెలుగుదేశం పార్టీ నేతలకు సింగపూర్‌ మేనమామనా అని మండిపడ్డారు. సింగపూర్‌ పెద్ద బిజినెస్‌ ( వ్యాపార ) దేశమని, మాస్టర్‌ ప్లాన్‌ను ఎందుకు ప్రీగా ఇస్తుందని అన్నారు.

జర్నలిస్టులకు ఆరోగ్యకార్డులు..

తెలంగాణాలో రాష్ట్రంలోని వర్కింగ్, విశ్రాంత జర్నలిస్టులకు ఆరోగ్య కార్డులు జారీ చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఆరోగ్యకార్డుల దస్త్రంపై సీఎం సంతకం చేశారు. జర్నలిస్టులకు ఆరోగ్యకార్డులు త్వరగా అందేలా చూడాలని రమణాచారి, అల్లం నారాయణకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.

ముందు రాహుల్ క్షమాపణ చెప్పాలి..

ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతే రాహుల్‌ గాంధీ రాష్ట్రంలో అడుగుపెట్టాలని మంత్రి పల్లె రఘునాథరెడ్డి డిమాండ్‌ చేశారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్‌ నేతలకు ఇక్కడి ప్రజల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. ఏపీ ప్రజలకు తీవ్ర అన్యాయం చేసిన కాంగ్రెస్‌ పార్టీ అధినేత కుమారుడు రాహుల్‌గాంధీ ఏ ముఖం పెట్టుకుని రాష్ట్రంలో అడుగుపెడుతున్నారని నిలదీశారు. మరో ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి మాట్లాడుతూ సోనియా, రాహుల్‌ ప్రజలకు తీవ్ర నష్టం చేశారని, ఏకపక్షంగా మాటలు విని రాష్ట్రాన్ని విభజించారని తీవ్రంగా విమర్శించారు.

Pages

Subscribe to RSS - July