July

జిఎస్‌టి బిల్లును తిరస్కరించడమే మార్గం:మధు

రానున్న పార్లమెంటు సమావేశాల్లో పలు కీలక బిల్లులను ఆమోదింపచేసుకోవడానికి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు విమర్శించారు.ఇప్పటికే దేశ వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కుంటున్న భూ సేకరణ చట్టానికి సవరణ బిల్లుతో పాటు, ఎస్సీఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం సవరణ, సరుకులు, సేవల బిల్లు (గూడ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ -జిఎస్‌టి) బిల్లు వీటిలో కీలకమైనాయి.

అడవులూ మింగేస్తారా !

రాష్ట్ర రాజధానిని నిర్మించడం కోసం ఈ సరికే 30 వేలకు పైగా ఎకరాల పంట భూములు సేకరించిన ప్రభుత్వం తాజాగా పేదలు సాగుచేసుకుంటున్న అటవీ భూములపై డేగ కన్నేయడం అమానుషం. భూములను సొంతం చేసుకోవడానికి వీలుగా అడవులను డీనోటిఫై చేయడమే కాక లక్ష ఎకరాలను కార్పొరేట్లకు, పెట్టుబడి దారులకు, ప్రభుత్వ అనుకూల పెద్దలకు పందేరం చేయ పూనుకోవడం దాని వర్గనైజాన్ని తెలియజేస్తోంది. అనేక కష్టాలకోర్చి అటవీ భూమిని సాగుకు అనువుగా మార్చిన రైతన్న పొట్ట కొట్టే కుట్రలు పన్నడం దుర్మార్గపూరితం.

ప్రతిపక్షాలతోఘర్షణకురెడీ:మోడీ

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు తుపానును మరిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఆ విషయాన్ని పరోక్షంగా అంగీకరించారు. కాంగ్రెస్ నాయకుడు గిరిధర్ లాల్ డోగ్రా శతజయంతి ఉత్సవాల్లో పాల్గొనడం కోసం శుక్రవారం ఇక్కడికి వచ్చిన మోదీ రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు గులాం నబీ ఆజాద్, జమ్మూ, కాశ్మీర్‌కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కరణ్ సింగ్‌తో కలిసి వేదికను పంచుకున్న సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ‘మనమంతా ఇక్కడ కూర్చుని ఉన్నాం. అయితే మనమంతా పార్లమెంటులో ఘర్షణ పడే రోజులు కూడా దగ్గర్లోనే ఉన్నాయి. అదీ చూద్దాం’ అని కాంగ్రెస్ నేతలనుద్దేశిస్తూ మోదీ అన్నారు.

మోడీపై రాహుల్ మండిపాటు..

కేంద్రంలోని మోడీ సర్కార్‌ తీసుకువచ్చిన భూ సేకరణ బిల్లు-2015పై కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తీవ్రంగా దాడిచేశారు. వచ్చే ఆరు నెలల్లో రైతులు మోడీ ధీమాను తగ్గిస్తారు కానీ ఒక్క అంగుళం భూమిని కూడా వదులుకోరని వ్యాఖ్యానించారు. లలిత్‌ మోడీతో వసుంధర రాజె ప్రభుత్వానికి సంబంధాలు వున్నాయని, లండన్‌లో వుంటూ లలిత్‌ మోడీ ఇక్కడ ప్రభుత్వానికి రిమోట్‌లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇక్కడ పార్టీ కార్యకర్తలనుద్దేశించి మాట్లాడుతూ రాహుల్‌, పార్లమెంట్‌లో భూ సేకరణబిల్లును ఆమోదించనివ్వబోమని ప్రతిన చేశారు.

ప్రజా చైతన్య యాత్రలు:ఎమ్మెల్సీ శర్మ

 ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఆగస్టు 1 నుంచి 14వ తేదీ వరకు ప్రచార కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఎమ్మెల్సీ ఎంవిఎస్‌ శర్మ తెలిపారు. గుంటూరులోని సిపిఎం జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా విస్తృత సమావేశం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జెవి రాఘవులు అధ్యక్షతన ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా శర్మ మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలపై ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా ఉండేందుకు కులం, మతం, ప్రాంతీయ తత్వాలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు.

‘ట్యాపింగ్‌’ నిజమేనా!?..

కేంద్ర ప్రభుత్వం మరోసారి తెలుగు రాష్ర్టాల జుట్లు ముడేసింది. రాష్ర్టాల మధ్య వివాదాలు ఏర్పడినప్పుడు పెద్దన్నయ్య పాత్ర పోషించాల్సిన కేంద్రం.... తెలుగు రాష్ర్టాల మధ్య సమస్యలను మరింత సంక్లిష్టం చేస్తోంది. ‘ట్యాపింగ్‌’ వివాదాన్ని సర్దుబాటు చేయాల్సిందిపోయి... సర్వీస్‌ ప్రొవైడర్లను వెనుకేసుకొచ్చే క్రమంలో రెండు రాష్ట్రాల మధ్య సమస్య మరింత పెరిగేలా లేఖలు రాసింది. ‘మేం ట్యాపింగ్‌ చేయలేదు!’ అని తెలంగాణ ప్రభుత్వం, ఏసీబీ అధికారులు వాదిస్తుండగా... ఒకరాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, అధికారికంగానే సర్వీస్‌ ప్రొవైడర్లు ‘చర్య’లు తీసుకున్నారంటూ ఏపీ సర్కారుకు కేంద్రం లేఖ రాసింది.

హిజ్రాలతో ఎంపీలను సన్మానిస్తాం

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో ఏపీకి ప్రత్యేక హోదా సాధించలేకపోతే తోడు వచ్చే పార్టీలతో కలిసి సీపీఐ ఆధ్వర్యంలో ఏపీ ఎంపీలకు హిజ్రాలతో సన్మానం చేస్తామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. ప్రత్యేక హోదా సాధించేందుకు ఎంపీలు పార్టీలకు అతీతంగా కృషి చేయాలన్నారు. 

భూ బిల్లును ఎందుకు వ్యతిరేకిస్తున్నామంటే..

                     దీర్ఘకాలం నుంచి అమల్లో ఉన్న భూ సేకరణ చట్టం-1894 స్థానంలో సక్రమ నష్టపరిహారానికి గల హక్కు, భూ సేకరణలో పారదర్శకత, పునరావాసం చట్టం-2013 (ఎల్‌ఎఆర్‌ఆర్‌ 2013)ను తెచ్చారు. పార్లమెంటరీ స్థాయీ సంఘం సుదీర్ఘంగా చర్చలు జరిపిన తర్వాత, వివిధ రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు, గ్రామీణ పేదలు, సంబంధిత వ్యక్తులు అందరూ సవివరంగా చర్చలు, సంప్రదింపులు జరిపిన అనంతరం ఏకాభిప్రాయంతో ఈ చట్ట తెచ్చారు. కొన్ని పరిమితులు ఉన్నప్పటికీ రైతులు, భూమిపై ఆధారపడిన వారికి కొంతమేరకు రక్షణ కల్పించేలా, దేశ ఆహార భద్రతా ఆందోళనలను పరిష్కరించేలా ఎల్‌ఎఆర్‌ఆర్‌-2013 లో నిర్దిష్ట సూత్రాలు, నిబంధనలు పొందుపరిచారు.

నేడు ప్రభుత్వదిష్టిబొమ్మల దగ్దం

అక్రమ అరెస్టులు, ముఖ్యమంత్రి నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ జెఎసి భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటించింది. 18న ప్రభుత్వ దిష్టిబొమ్మలు దగ్దం చేయాలని, నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని జెఎసి పిలుపునిచ్చింది. 18, 19తేదిల్లో ఎంఎల్‌ఎ, ఎంఎల్‌సిల మద్దతు కోరుతూ సామూహిక రాయబారాలు నిర్వహించాలని, 20న కుటుంబ సభ్యులతో భిక్షాటన, 21న జిల్లా కలెక్టరేట్ల పికెటింగ్‌, 22న రాస్తారోకోలు, 23న పట్టణాల్లో నిరసన ర్యాలీలు, 24న మంత్రుల ఇళ్లను హోరావ్‌ కార్యక్రమాలను జయప్రదం చేయాలని మున్సిపల్‌, ఉద్యోగులు, కార్మికులకు జెఎసి విజ్ఞప్తి చేసింది.

మున్సిపల్‌ కార్మికులపై పాశవిక దాడి

మున్సిపల్‌ కార్మికుల జెఎసి ఆధ్వర్యంలో ఛలో సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడి యత్నాన్ని పోలీసులు శుక్రవారం అడుగడుగునా అడ్డుకున్నారు. మహిళలను సైతం విచక్షణ రహితంగా లాగిపారేస్తూ పాశవికంగా వ్యవహరించారు. మున్సిపల్‌ ఉద్యోగ, కార్మిక ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర నలుమూలల నుండి తరలివచ్చిన వేలాది మంది మున్సిపల్‌ పారిశుద్య కార్మికులు, వీరి ఆందోళనకు మద్దతుగా నిలిచిన వామపక్ష పార్టీలకు చెందిన నాయకులతో తుమ్మలపల్లి కళాక్షేత్రం నుండి ప్రారంభమైన భారీ ర్యాలీని పోలీసులు పాత బస్టాండ్‌ సెంటరులో అడ్డుకున్నారు. ఒకింత భయాందోళనలకు గురిచేసేలా వ్యవహరిచారు.

Pages

Subscribe to RSS - July