పట్టణ సమస్యలపై రాష్ట్రంలోని మున్సిపల్ పట్టణాల్లో ఆందోళనలు నిర్వహిం చాలని సిపిఎం రాష్ట్రకమిటీ నిర్ణయించింది. సిపిఎం పట్టణ బాధ్యుల రాష్ట్రస్థాయి సమావేశం బుధవారం విజయవాడలో జరిగింది. ఆగస్టు 1 నుంచి 14 వరకు పట్ట ణ సమస్యలపై క్యాంపెయిన్‌లు, ఆందోళనలు నిర్వహించాలని ఈ సమావేశం నిర్ణ యించింది. ఈ సమావేశానికి ఆ పార్టీ రాష్ట్రకార్యదర్శి పి మధు హాజరయ్యారు. పట్టణ సమస్యలపై పోరాడాల్సిన అవశ్యకతను ఆయన వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటిస్తున్న మెగాసిటీలు, స్మార్ట్‌సిటీలు, అమృత్ పట్టణాలు అన్నీ కూడా పట్టణాల్లో మౌలిక సదుపాయాలను ప్రైవేటీకరింటి వ్యాపారమయం చేయ డం కోసం ఉద్దేశించినవేనని చెప్పారు.