July

విషకౌగిలి

ఆరెసెస్ దాని రాజకీయ పక్షమైన బిజెపి గురించి ఎన్నో రహస్యాలు ఎన్నో వాస్తవాలు విషకౌగిలో బహిర్గతమయ్యాయి.. 1991 లో జరిగిన ఎల్ కె అద్వాని రామ్ రధ యాత్ర ఎలా మత విద్వేషాలను రెచ్చగొట్టి 1992 డిసెంబర్ అయోధ్యలో బాబ్రీ మసీదు విద్వంసానికి దారి తీసిందో "రామ్ కె నామ్" చూపెట్టగా అదేకాలంలో రచించబడ్డ "విషకౌగిలి" ఆ విద్వంసకారుల శిక్షణ సంస్థను బట్టబయలు చేసింది .. ఆరెసెస్ లో దశాబ్ద కాలం పాటు ముఖ్య కార్యకర్తగా పనిచేసిన వేయిరేకుల పద్మంలోంచి ఒక్కొక్క బ్రాంతి దళం రాలిపోతుండగా మతోన్మాద కౌగిలి నుండి మానవత్వం వొడిలోకి ప్రస్థానం చేసిన " విశ్వం " కె ఇది సాధ్యం.. 

మరో 'థర్మల్‌' కుంపటి

 'మాకొద్దీ తెల్లదొరతనం/ దేవా, మా ప్రాణాలను త్రుంచి/మా మానాలను హరియించే/మాకొద్దీ తెల్ల దొరతనం' అన్న ప్రజాకవి గరిమెళ్ల సత్యనారాయణ పుట్టిన గడ్డ మీదే జపాన్‌ కంపెనీ సుమిటోమి సూపర్‌ క్రిటికల్‌ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. సిక్కోలు భూమి, ఆస్ట్రేలియా బొగ్గు, జపాన్‌ వారి శాస్త్ర సాంకేతికతతో రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడి ప్రజలను అభివృద్ధి చేస్తుందట! ఇప్పటికే సోంపేట, కాకరాపల్లిలో థర్మల్‌ పవర్‌ ప్లాంట్లకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో గత ప్రభుత్వం ముగ్గురేసి చొప్పున ఆరుగురిని పొట్టన పెట్టుకుంది. అయినా, పాలకులు వెనక్కి తగ్గడం లేదు.

ఆగస్టు1నుంచి14 వరకు పట్టణ సమస్యలపై ఆందోళనలు: సిపిఎం

పట్టణ సమస్యలపై రాష్ట్రంలోని మున్సిపల్‌ పట్టణాల్లో ఆందోళనలు నిర్వహిం చాలని సిపిఎం రాష్ట్రకమిటీ నిర్ణయించింది. సిపిఎం పట్టణ బాధ్యుల రాష్ట్రస్థాయి సమావేశం బుధవారం విజయవాడలో జరిగింది. ఆగస్టు 1 నుంచి 14 వరకు పట్ట ణ సమస్యలపై క్యాంపెయిన్‌లు, ఆందోళనలు నిర్వహించాలని ఈ సమావేశం నిర్ణ యించింది. ఈ సమావేశానికి ఆ పార్టీ రాష్ట్రకార్యదర్శి పి మధు హాజరయ్యారు. పట్టణ సమస్యలపై పోరాడాల్సిన అవశ్యకతను ఆయన వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటిస్తున్న మెగాసిటీలు, స్మార్ట్‌సిటీలు, అమృత్‌ పట్టణాలు అన్నీ కూడా పట్టణాల్లో మౌలిక సదుపాయాలను ప్రైవేటీకరింటి వ్యాపారమయం చేయ డం కోసం ఉద్దేశించినవేనని చెప్పారు.

విజయవాడలో ఉద్రిక్తత

విజయవాడ రాజీవ్‌నగర్‌ కరకట్ట ప్రాంతంలోని పేదల గుడిసెల తొలగింపు ఉద్రిక్తతకు దారితీసింది. ఈ కార్యక్రమాన్ని బాధితులు తీవ్రంగా ప్రతిఘటించారు. ఓ వృద్ధురాలు వంటిపై కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది. స్థానిక కార్పొరేటర్‌ పైడి తులసి తమను నట్టేట ముంచారని బాధితులు కంటతడిపెట్టారు. దశాబ్దాలుగా నివాసం ఉంటున్న తమకు పునరావాసం కల్పించలేదని ఆందోళన వ్యక్తం చేశారు. బాధితులకు సిపిఎం నాయకులు మద్దతుగా నిలబడ్డారు. పేదల పక్షాన నిలబడి ప్రభుత్వ యంత్రాంగాన్ని నిలదీశారు. దీంతో 200 మందికిపైగా ఉన్న పోలీసు బలగాలు మొహరించి అడ్డువచ్చిన సిపిఎం నేతలను, స్థానిక మహిళలను పోలీసులు ఈడ్చుకెళ్లి వాహనాల్లో పడేశారు.

వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కృషిచేయాలి:కృష్ణయ్య

పెట్టుబడిదారుల దోపిడీ వల్లే కొన్ని ప్రాంతాలు వెనుకబడుతున్నాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.కృష్ణయ్య ఆందోళన వ్యక్తంచేశారు. వారి దోపిడీని అరికట్టి అభివృద్ధికి పార్టీ శ్రేణులు నడుం బిగించాలని పిలుపునిచ్చారు. తిరుపతి సుందరయ్య నగర్‌లోని ఎంబి భవన్‌లో సిపిఎం జిల్లా విస్తృత స్థాయి సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కృష్ణయ్య మాట్లాడుతూ.. సామ్రాజ్య వ్యవస్థను, భూస్వామి వ్యవస్థను వ్యతిరేకించే వారిని కలుపుకుని ఉద్యమించాలన్నారు. గ్రామీణ వ్యవస్థలో నెలకు ఐదువేల రూపాయలకు మించి ఆదాయం రాని వారు 50 శాతానికి పైగా ఉన్నారన్నారు.

తీస్తా సెతల్వాద్‌పై కక్ష సాధింపు చర్యలు:సిపిఎం ఖండన

 సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్‌పై మోడీ సర్కార్‌ తీసుకుంటున్న కక్ష సాధింపు చర్యలను సిపిఎం పొలిట్‌బ్యూరో తీవ్రంగా ఖండించింది. ఆమెపై సిబిఐ కేసు పెట్టడం, ఆమె నివాసంపై 16మంది సిబిఐ అధికారులు దాడుల పరంపర సాగించడం అంతా కూడా అధికారాన్ని దుర్వినియోగం చేయడమేనని పొలిట్‌బ్యూరో పేర్కొంది. ఈ మేరకు పొలిట్‌ బ్యూరో ఒక ప్రకటన విడుదల చేసింది. గుజరాత్‌ మారణకాండకి సంబంధించిన కేసుల్లో అవిశ్రాంతంగా పోరాడుతున్న ఆమెను అడ్డుకునేందుకు, నోరు మూయించేందుకే ఇదంతా చేస్తున్నారని విమర్శించింది. ప్రభుత్వంలోని అగ్ర నేతల పాత్రను బయటపెట్టేందుకు ఇంకెవరూ యత్నించకుండా వారి నోరు మూయించేందుకు ఇదొక సంకేతమని పార్టీ పేర్కొంది.

కొన‌సాగుతున్నకార్మికులస‌మ్మె‌

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్‌ కార్మికుల సమ్మె ఏడో రోజు కొన‌సాగుతుంది. కనీస వేతనాలు ఇవ్వాలని కార్మికులు ఆందోళన చేస్తుంటే.. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా చెత్త తరలించే ప్రయత్నం చేసింది ప్రభుత్వం. ఈ ప్రయత్నాలను అడ్డుకున్న కార్మికులు.. సమస్యలు పరిష్కరించే వరకూ ఉద్యమం కొనసాగిస్తామని తేల్చి చెప్పారు.
తమ డిమాండ్లు  సాధ‌న‌కై

వేదాలకు వ్యతిరేకంగా రచనలు

వేదాలు, బ్రాహ్మణులకు వ్యతిరేకంగా రచనలు చేయాలని ప్రొఫెసర్‌ కంచె ఐలయ్య పిలుపునిచ్చారు. ఐఆర్‌టీఎస్‌ రిటైర్డ్‌ అధికారి అప్పికట్ల భరత్‌ భూషణ్‌ రచించిన ‘మెమొరీస్‌ ఆఫ్‌ దళిత్‌ సివిల్‌ సర్వెంట్‌’ పుస్తకాన్ని బుధవారం హైదరాబాద్‌లో ఏపీ హోంశాఖ ముఖ్య కార్యదర్శి బి. ప్రసాదరావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కంచె ఐలయ్య ప్రసంగిస్తూ... ‘‘ఈ దేశంలో బ్రాహ్మణ, అగ్రకుల ఆధిపత్యం నశించి... అంబేద్కర్‌, జ్యోతిబా పూలే కలలు నెరవేరాలంటే వేదాలకు వ్యతిరేకంగా రచనలు చేయాలి. బ్రాహ్మణులపై పోరాడే తెలివి వెనుకబడిన వర్గాలకు లేదు. క్రైస్తవులు, దళిత మేధావులే ఆ పని చేయాలి’’ అని సూచించారు. ఈ దేశంలో హిందుత్వం ఉండరాదని కూడా అన్నారు.

ఆగష్టు లో పట్టణ సమస్యల పై ప్రజాందోళన. సి పి యం రాష్ట్ర సమావేశం పిలుపు

పట్టణ సమస్యల పరిష్కారం కోరుతూ అన్ని మున్సిపల్ పట్టణ కేంద్రాలలో ఆందోళన నిర్వహించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది.

ప్రధాని కొత్త పధకం..

ఢిల్లీలో ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకాన్ని ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించారు. నైపుణ్యాల భారత్ స్థాపన లక్ష్యంగా ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పని చేస్తుంది. ప్రపంచ యువనైపుణ్యాల దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. క్షేత్రస్థాయిలో నైపుణ్యం గల కార్మిక శక్తి సృష్టి కేంద్ర కార్యక్రమ లక్ష్యం. నైపుణ్యాభివృద్ధి, సాంకేతికత, వృత్తివిద్య అందించేందుకే కౌశల్ వికాస్ యోజన. యువతను వేరువేరు రంగాల్లో నిపుణులుగా తీర్చిదిద్దేందుకు కేంద్రం ప్రణాళికలు రూపొందించింది. 

Pages

Subscribe to RSS - July