July

అవినీతిపై సమర శంఖం:CPM

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అవినీతి పాలనను నిరసిస్తూ, అవినీతి వ్యతిరేక దినంలో భాగంగా వామపక్షాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సోమవారం వివిధ రూపాల్లో ఆందోళనలు, సదస్సులు జరిగాయి. విశాఖలో జరిగిన సభలో సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు మాట్లాడుతూ అవినీతి కుంభకోణాల్లో పీకల్లోతు కూరుకుపోయిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పాలించే నైతిక హక్కు ఇంకెంతమాత్రమూ లేదని , పార్లమెంటులో ప్రతిపక్షాలు నిలేసే సమయంలో నిజాయితీగలవారైతే రాజీనామాలు చేయాలని, లేదంటే ప్రభుత్వమే వారిపై చర్య తీసుకోవాలని రాఘవులు డిమాండ్‌ చేశారు. 

ఎస్సీ,ఎస్టీసబ్‌ప్లాన్‌ను అటకెక్కించింది చంద్రబాబే:మధు

మున్సిపల్‌ ఉద్యోగు లు, కార్మికుల నిరవధిక సమ్మెకు మద్దతుగా రాజకీయ పార్టీలు, ట్రేడ్‌ యూనియన్‌ నాయకుల రౌండ్‌ టేబుల్‌ సమావేశం సోమవారం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో జరిగింది. మున్సిపల్‌ జేఏసీ నాయకులు ఉమామహేశ్వరరావు అధ్యక్షత వహించిన ఈ కార్య క్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు మాట్లాడుతూ మున్సిపల్‌ ఉద్యోగుల్లో అధిక శాతం దళితులే ఉన్నారన్నారు. వారికి సంబంధించిన ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ కూడా అటకెక్కించిన ఘనత చంద్ర బాబు ప్రభుత్వానికే దక్కిందని విమర్శించారు.

మున్సిపల్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి-రాఘవులు

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ కార్మికుల సమ్మె మరింత ఉధృతంగా సాగుతోంది. ఆందోళనలో భాగంగా విశాఖలోని జీవీఎంసీ కార్యాలయం ఎదుట కార్మికులు, ఉద్యోగులు మహాధర్నా నిర్వహించారు. ఈ సమ్మెకు సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి.రాఘవులు సంఘీభావం తెలిపారు. కార్మికుల న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలంటున్నారు. ప్రైవేటీకరణ పేరుతో మున్సిపాలిటీలను కార్పొరేట్లకు దోచిపెట్టేందుకు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు చూస్తున్నాయని విమర్శించారు.

విశాఖ కెజిహెచ్ హాస్పటల్ ను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం సిగ్గుచేటు ...

విశాఖ కెజిహెచ్ ను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడాన్నివ్యతిరేకిస్తూ సిపియం పార్టీ ఆద్వర్యంలో  సంతాల సేకరణలో పాల్గొన్న బి.వి.రాఘవులు ... 

BJP, TDP ప్రభుత్వాల అవినీతిపై సమర శంఖారావం పూరించండి ..

ఈ రోజు విశాఖ లో జరిగిన అవినీతి వ్యతిరేక సభలో బి.వి. రాఘవులు గారు మాట్లాడుతూ ... ఏడాది కాలంలోనే తాము అవినీతి పార్టీలేనని బిజెపి, టిడిపి  రుజువు చేశాయన్నారు. అవినీతి, అక్రమాలకు ఆలవాలమైన కాంగ్రెస్ కు భిన్నంగా నీతిమంతమైన పాలన అందిస్తామని ప్రచారం చేసారు. అధికారం చేపట్టిన నాటి నుండి బిజెపి, టిడిపి కాంగ్రెస్ దారిలోనే నడుస్తున్నాయి . దేశ, విదేశ భాహుళజాతి కంపెనీలు వేలకోట్లు ఖర్చుపెట్టి  బిజెపిని గెలుపించుకున్నయన్నారు.  గెలిచినా తరువాత వారి రుణం తీర్చుకుంటున్నాడు  మోడీ . అందువలనే  దొంగల ముటాకు సహకరించడం, తద్వారా  తాము  వాటాలు పంచుకుంటున్నారు.

కాంగ్రెస్‌ ఆత్మపరిశీలన చేసుకోవాలి

కాంగ్రెస్‌ మరోసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ పార్లమెంటులో ప్రభుత్వాన్ని అడ్డుకుంటామని హెచ్చరించిన కాంగ్రెస్‌ గత ఎన్నికల్లో ఎందుకు అంతగా దిగజారిందో తెలుసుకోవాలని వెంకయ్య అన్నారు.

పార్లమెంట్‌లో తాజా బిల్లు?

విదేశీ ప్రభుత్వాధికారులు లంచాలు ఇవ్వడాన్ని లేదా స్వీకరించడాన్ని క్రిమినల్ నేరంగా పరిగణించి వారికి ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధించేందుకు ఉద్దేశించిన బిల్లును కేంద్ర ప్రభుత్వం తాజాగా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనుంది. వాస్తవానికి విదేశీ ప్రభుత్వాధికారులు, అంతర్జాతీయ ప్రభుత్వ సంస్థల అధికారుల లంచాల నిరోధక బిల్లును 2011లోనే రూపొందించినప్పటికీ గత ఏడాది మే నెలలో 15వ లోక్‌సభ రద్దవడంతో ఆ బిల్లుకు కాలం చెల్లిపోయింది.

కాలంచెల్లిన చట్టాలురద్దు:మోడీ

దేశంలో కార్మిక సంస్కరణల పట్ల వెల్లువెత్తుతున్న విమర్శలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దీటుగా సమాధానమిచ్చారు. న్యూఢిల్లీలో సోమవారం ఆయన 46వ అఖిల భారత కార్మిక సదస్సులో ప్రసంగిస్తూ, ఏకాభిప్రాయం సాధించిన తర్వాత మాత్రమే కార్మిక చట్టాలకు మార్పులు, చేర్పులు చేస్తామని, అలాగే కాలం చెల్లిన, అనవసరమైన కార్మిక చట్టాలను తొలగిస్తామని స్పష్టం చేశారు. దేశంలో కార్మికులు, కార్మిక సంఘాల ప్రయోజనాలకు మధ్య పలుచటి విభజన రేఖ ఉందని, అయినా దీనిని గౌరవించి తీరాల్సిందేనని మోదీ పేర్కొన్నారు.

ఏపీ సీడ్‌క్యాపిటల్‌ మాస్టర్‌ప్లాన్‌...

 ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి సీడ్‌ క్యాపిటల్‌ మాస్టర్‌ ప్లాన్‌లో అనేక అంశాలు పొందిపరిచారు. బ్రహ్మ స్థానంలో ఏమేమి ఉంటాయి, సచివాలయం ఎక్కడ నిర్మిస్తారు.. హైకోర్టు ఎక్కడ.. తదితర అంశాలు అందులో పొందిపరిచారు.

Pages

Subscribe to RSS - July