తీస్తా సెతల్వాద్‌పై కక్ష సాధింపు చర్యలు:సిపిఎం ఖండన

 సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్‌పై మోడీ సర్కార్‌ తీసుకుంటున్న కక్ష సాధింపు చర్యలను సిపిఎం పొలిట్‌బ్యూరో తీవ్రంగా ఖండించింది. ఆమెపై సిబిఐ కేసు పెట్టడం, ఆమె నివాసంపై 16మంది సిబిఐ అధికారులు దాడుల పరంపర సాగించడం అంతా కూడా అధికారాన్ని దుర్వినియోగం చేయడమేనని పొలిట్‌బ్యూరో పేర్కొంది. ఈ మేరకు పొలిట్‌ బ్యూరో ఒక ప్రకటన విడుదల చేసింది. గుజరాత్‌ మారణకాండకి సంబంధించిన కేసుల్లో అవిశ్రాంతంగా పోరాడుతున్న ఆమెను అడ్డుకునేందుకు, నోరు మూయించేందుకే ఇదంతా చేస్తున్నారని విమర్శించింది. ప్రభుత్వంలోని అగ్ర నేతల పాత్రను బయటపెట్టేందుకు ఇంకెవరూ యత్నించకుండా వారి నోరు మూయించేందుకు ఇదొక సంకేతమని పార్టీ పేర్కొంది. గుజరాత్‌ నరమేథానికి సంబంధించిన కేసుల్లో రెండింటిపై విచారణ జరుగుతున్న సందర్భంగా ఈ చర్యలు తీసుకోవడం యాథృచ్ఛికమేమీ కాదని సిపిఎం పేర్కొంది. తీస్తా సెత్వలాద్‌పై కక్ష సాధింపుతో ఈ రకంగా వేధించడం తగదని పా ర్టీ హచ్చరించింది.