July

BJP కి ఊహించని షాక్..

బీజేపీకి సొంతపార్టీ నేతలే షాక్‌ల మీద షాకులిస్తున్నారు. ఇప్పటికే లలిత్‌ గేట్‌, వ్యాపం తదితర కేసులపై విపక్షాల దాడిని ఎదుర్కొనేందుకు నానాతంటాలు పడుతున్న బిజెపికి ఊహించని విధంగా సొంత పార్టీ నేత నుండే మరో గట్టి షాక్‌ తగిలింది. పార్టీ ప్రతిష్టతకు భంగం కలిగేలా కుంభకోణాలు బయటపడడం పార్టీకి సిగ్గుచేటని ఓ బీజేపీ ఎంపీ ఘాటుగా విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఆయన పార్టీ అధ్యక్షుడు అమిత్‌షాకు లేఖ రాశారు. నేతలపై వచ్చిన అవినీతి ఆరోపణలు పార్టీ ప్రతిష్ఠకు భంగం వాటిల్లేలా ఉన్నాయని, మధ్యప్రదేశ్‌లో వ్యాపం కుంభకోణం బీజేపీ సిగ్గుతో తలదించుకునేలా చేసిందని ఆయన ఘాటుగా విమర్శించారు.

రాజ్యసభ కోసమే రఘువీరా

రాజ్యసభ సీటు కోసమే రఘువీరా రెడ్డి రాహుల్‌ గాంధీతో పాదయాత్రలు చేయిస్తున్నారని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ కాల్వ శ్రీనివాసులు ధ్వజమెత్తారు. బుధవారం ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో ఆయన మాట్లాడుతూ అనంతపురానికి ఆనుకొని ఉన్న కర్నాటకలో వందలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే రాహుల్‌ గాంధీ అక్కడ ఎందుకు యాత్రలు చేయడం లేదని విమర్శించారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు, ప్రతిపక్షనేత జగన్మోహన్‌ రెడ్డి, కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాందీ లు కేవలం అనంతపురం, హిందూపూర్‌ పార్లమెంట్‌ నియోజక వర్గాల్లోనే ప్రచారం చేయడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు.

ప్రత్యేకంపై దోబూచులు

రాష్ట్రానికి ప్రత్యేక హొదా దాదాపు లేనట్లుగానే తేలిపోయిరది. నాలుగు నెలల క్రితమే రాష్ట్ర అధికా రులకు కూడా కేంద్రం నురచి సంకేతాలు వచ్చాయి. సీనియర్‌ అధికారి ఒకరు కేంద్ర నిర్ణయాన్ని అనధికారంగా వెల్లడిరచారు కూడా. అయితే ఇప్పుడు మళ్లీ అదే ప్రత్యేక హౌదా తెరపైకి వస్తోరది. అధికార తెలుగుదేశం పార్టీ నురచి ప్రాతినిథ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఇదే అరశంపై గత నాలుగు రోజులుగా ప్రకటనలు చేస్తున్నారు. నెల రోజుల్లో ప్రత్యేక హౌదా వస్తురదని, దీనికోసం పోరాటం కొనసాగి స్తామని, కేంద్రం కూడా ప్రత్యేక హౌదా ఇచ్చేరదుకు ఆలోచన చేస్తోరదని చెప్పుకురటూ వస్తున్నారు.

క్యాపిటల్‌ ఖర్చు 8,214 కోట్లు

2018 నాటికి సీడ్‌క్యాపిటల్‌ను నిర్మిస్తామని చెబుతున్న ప్రభుత్వం దానికి అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసింది. మొత్తం 1694.5 హెక్టార్ల(4236 ఎకరాలు)లో దీని నిర్మాణం జరగ నుంది. దీనికిగాను రూ.8214 కోట్లు ఖర్చవుతుం దని అంచనా వేసింది. ఐదుదశల్లో నిర్మించ నున్న రాజధానికి సంబంధించి తొమ్మిది యాక్షన్‌ ప్లానులు రూపొందించారు. రాజధాని నగరంలో 88 కిలో మీటర్ల పొడవున రోడ్లను నిర్మించనున్నారు. ఐదు దశల్లో ఏ దశలో ఎంత స్థలం వినియోగం అవు తుంది, ఎన్ని ఉద్యోగాలొస్తాయి అనే అంశా లనూ పొందుపరిచారు.

క‌ళంకిత క‌మ‌లం

అ...అమ్మ, ఆ...ఆవు' అని చెప్పుకునే రోజులు పోయాయి. 'అ...అవినీతి, ఆ...ఆశ్రిత పక్షపాతం' అనుకోవాల్సిన కాలం వచ్చేసింది. మాది భిన్నమైన పార్టీ. స్వచ్ఛమైన పార్టీ అంటూ జనాన్ని నమ్మించి మరీ గద్దెనెక్కిన బి.జె.పి వారూ తక్కువ తినలేదని నిరూపితమౌతోంది. మోడీ గేట్‌, వ్యాపమ్‌ స్కామ్‌, చిక్కీ కుంభకోణం, అగ్నిమాపకాల కొనుగోళ్ల స్కామ్‌ ఓ వైపు, నకిలీ సర్టిఫికెట్లు- అక్రమ చదువుల ఆరోపణలు మరోవైపు కమలనాథులకు పట్టపగలే చుక్కలు చూయిస్తున్నాయి. 

ప్రపంచీకరణ సంస్కృతి

 'ప్రపంచీకరణ-సంస్కృతి' సంకలనం లోని వ్యాసాలు మీడియా, సంస్కృతి, నాగరికత, సామాజిక పోకడల వివిధ పార్శ్వాలను తెలియజేస్తాయి. ఈ వ్యాసకర్తలలో అత్యధికులు అధ్యయనపరులుగా ప్రసిద్ధులే (వారిలో ఒకరిద్దరు ఇప్పుడు సజీవంగా లేరు.). వ్యాసాల నేపథ్యం, అవి రాసిన లేదా ప్రసంగం చేసిన సందర్భాలు కూడా భిన్నమైనవే. అయితే వీటన్నిటిలోనూ పూసల్లో దారంలాగా ఒక ఇతివృత్త ఏకత వుంది. ఆలోచనా పరులైన వారెవరైనా తరచూ ప్రస్తావించుకునే అంశాల పరామర్శ వీటిలో లభిస్తుంది. అలాగే మన ఇంట్లో, సమాజంలో దేశంలో వచ్చిన ఏ అవాంఛనీయ మార్పుల గురించి మనం మథన పడుతుంటామో అవి యాదృచ్ఛికంగా వచ్చినవి కాదని ఈ రచనలు మనకు తెలియజెబుతాయి.

మున్సిపల్‌ సమ్మె పట్ల దళిత సంఘాల వైఖరేంటి?

 రాష్ట్రంలో గత 12 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్‌ కార్మికులు, మున్సిపల్‌ ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కరించమని కోరుతూ సమ్మె చేస్తున్నారు. అనేకసార్లు రాష్ట్ర ప్రభుత్వానికి తమ సమస్యలను నివేదించిన తరువాత, పలుమార్లు అధికారులతో చర్చలు జరిగిన తరువాత అధికారుల, రాష్ట్ర ప్రభుత్వ వైఖరి సమస్యల పరిష్కారం పట్ల సానుకూలంగా లేకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో మున్సిపల్‌ కార్మికులు సమ్మెలోకి దిగాల్సి వచ్చింది. మున్సిపల్‌ ఉద్యోగులు సంప్రదాయకంగా దళిత కులానికి చెందినవారే. ఒకప్పుడు నూటికి నూరు శాతం దళితులే పారిశుధ్య కార్మికులుగా పనిచేసేవారు.

కలల రాజధాని

యావత్‌ ప్రపంచాన్ని ఆకర్షించేలా అమరావతి కేంద్రంగా నవ్యాంధ్ర రాజధానిని నిర్మిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్‌ సంస్థ రూపొందించిన సీడ్‌ కాపిటల్‌ నమూనాను 70 ఎంఎం టెలిస్కోప్‌లో చూపించి యావదాంధ్ర ప్రజలకు కనువిందు కలిగించారు. చంద్రబాబు నాయుడు చూపించిన రాజధాని ప్రణాళికలో కలల రాజధానిపై కలలుగనేవారికీ, కలలతో వ్యాపారం చేసుకునేవారికీ కావాల్సిన హంగూ ఆర్భాటాలన్నీ పుష్కలంగా వున్నాయి. 7, 325 చ. కమి. మీ . విస్తీర్ణంలో నిర్మించే మూడంచెల రాజధానిలో 16.9 చ.కి.మీ వైశాల్యంలో మొదట ఈ సీడ్‌ కేపిటల్‌ సిటీని ఏర్పాటు చేయనున్నారు.

కాంగ్రెస్ బండారం బయటపెడతా:సుష్మా

బొగ్గు స్కాంలో నిందితుడిగా ఉన్న కేంద్ర మాజీ మంత్రి సంతోష్ బర్గోడియాకు డిప్లమాటిక్ పాస్ పోర్టును ఇప్పించాలంటూ ఓ ప్రముఖ కాంగ్రెస్ నేత తనపై ఒత్తిడి తెచ్చారని సుష్మా స్వరాజ్ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. పార్లమెంట్ వేదికగా ఈ విషయాన్ని బట్టబయలు చేస్తానని ట్వీట్ చేశారు. సుష్మా స్వరాజ్ చేసిన విమర్శలపై ఏఐసిసి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పార్లమెంట్ లోనే మాట్లాడుతామని పేర్కొన్నారు

Pages

Subscribe to RSS - July