July

వేదాల్లో జ్ఞానాన్ని వెలికితీయండి

విద్యార్థులు, యువత తమలోని జ్ఞానాన్ని వెలికితీసి దేశాభివృద్ధికి తోడ్పడాలని రాజ్యసభ సభ్యుడు, బెనారస్‌ యూనివర్సిటీ చాన్సలర్‌, పద్మవిభూషణ్‌ కరణ్‌సింగ్‌ అన్నారు. ఆదివారం శామీర్‌పేటలోని బిట్స్‌ క్యాంపస్‌లో వైస్‌ చాన్సలర్‌ బిజేంద్రనాథ్‌ జైన్‌ ఆధ్వర్యంలో 4వ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన కరణ్‌సింగ్‌ విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు. మన వేదాలు, ఉపనిషత్తుల్లో ఎంతో సమాచారం ఉందని, అందులో నుంచి జ్ఞానాన్ని వెలికితీయాలని.. ఇందుకు విద్యార్థులు, యువత చైతన్య స్ఫూర్తితో ముందడుగేయాలని కరణ్‌ సింగ్‌ పిలుపునిచ్చారు.

కులహత్యలపై సమగ్ర చట్టం:ఐద్వా

పరువు ప్రతిష్టల పేరుతో దేశవ్యాప్తంగా కొనసాగుతున్న కులదురహంకార హత్యలకు అడ్డుకట్ట వేసేందుకు సమగ్ర చట్టాన్ని రూపొం దించాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఐద్వా ప్రతినిధి వర్గం కేంద్ర న్యాయశాఖమంత్రి సదానంద గౌడను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందచేసింది.ఐద్వా రూపొందించిన ముసాయిదా చట్టం ప్రకారం జిల్లా మేజిస్ట్రేట్‌/కలెక్టర్‌ కులపంచాయితీలపై నిషేధాజ్ఞలు విధించవచ్చని, యువజంట, వారి కుటుంబాల పరిరక్షణకు తగు చర్యలు తీసుకునేందుకు సుమోటోగా చర్యలు తీసుకోవచ్చని వివరించింది.

విదేశీ బాబు :రాహుల్‌

 ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విదేశీబాబు అయ్యారని, రాష్ట్ర ప్రజల గురించి పట్టించుకోవడం లేదని ఎఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్‌ గాంధీ విమర్శించారు. పేదల సమస్యలను పట్టించుకునే పరిస్థితుల్లో లేరన్నారు. శుక్రవారం అనంతపురం జిల్లా ఓబుళదేవరచెరువు(ఒడిసి) నుంచి ప్రారంభమైన రాహుల్‌ రైతు భరోసా పాదయాత్ర కొండకమర్ల గ్రామం వద్ద ముగిసింది. 1979లో ఒడిసిలో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఇందిరాగాంధీ పాల్గొన్న వేదిక వద్దనే బహిరంగ సభ నిర్వహించారు. ఆ ప్రాంతంలో రాహుల్‌ వేపమొక్కను నాటారు. గ్రామశివారులో రైతులు, చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న కుటుంబ సభ్యులతో సమావేశ మయ్యారు.

విశాఖ జూపార్కును తరలించడాన్ని వ్యతిరేకించండి.

విశాఖనగరంలో ఉన్న ఇందిరాగాంధీ జూలాజికల్‌ పార్కును తరలింపును, దాన్ని ప్రభుత్వ`ప్రైవేట్‌`భాగస్వామ్యం (పిపిపి) పేరుతో ప్రైవేట్‌ కంపెనీలకు అప్పజెప్పడాన్ని సిపిఐ(యం) పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. 1971లో 625 ఎకరాల విస్తీర్ణంలో జూ పార్కు ఏర్పడిరది. ఇది రెండు కొండల మధ్య, ఒకవైపు నేషనల్‌హైవే మరోవైపు సముద్రతీరం మధ్య ఉంది. ఇది వన్యప్రాణులకు సంరక్షణార్ధం ఎంతో ఉపయోగకరంగా ఉంది.  పిల్లలకు, పెద్దలకు విజ్ఞానం, వినోదాన్ని అందిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోనే ఇది అతిపెద్ద జంతుప్రదర్శనశాల.

కార్మికల కలెక్టరేట్ల ముట్టడికి మద్దతు: మధు

నేడు మున్సిపల్ కార్మికల కలెక్టరేట్ల ముట్టడికి మద్దతు తెలియచేస్తున్నామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. సమ్మెను అణచివేయాలని రాష్ట్ర కాబినెట్ తీసుకున్న నిర్ణయం దారుణమన్నారు. రాష్ట్ర మంత్రే ఈ ప్రకటన చేయడం సిగ్గుచేటని,ప్రభుత్వం కార్మికుల సమ్మెను పరిష్కరించకుండా రాజకీయం చేస్తే ఇది ఒక్క కార్మికుల సమస్య గానే కాక రాజకీయ సవాల్ గా కూడా స్వికరించాల్సివస్తుందన్నారు. సమస్య పరిష్కారం కాకుంటే నెల రోజులైనా ఆందోళనలకు సిద్ధమన్నారు. ప్రభుత్వ బెదిరింపులకు భయపడేది లేదన్నారు.ప్రభుత్వం వెంటనే కార్మిక జెఎసి తో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేసారు .. 

రాహుల్‌ పాదయాత్రకు అడ్డంకి

నేడు అనంతపురం ఓబులదేవరచెరువు నుంచి రాహుల్‌ గాంధీ పాదయాత్ర చేపట్టనున్న నేపథ్యంలో టిడిపి కార్యకర్తలు నిరసన తెలిపారు. పాదయాత్రలో భాగంగా రాహుల్‌ మామిళకుంటపల్లి, దేబురాపల్లి, కొండకమర్లలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించనున్నారు. రాహుల్‌గాంధీ పర్యటనపై చంద్రదండు ఆందోళన చేసింది. చిలమత్తూరు మండలం కొడికొండ చెక్‌పోస్టు దగ్గర చంద్రదండు కార్యకర్తలు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. దీంతో చంద్రదండు కార్యకర్తలను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Pages

Subscribe to RSS - July