July

కులగణనలో 8కోట్ల తప్పులు

దేశవ్యాప్తంగా సామాజిక, ఆర్థిక, కుల గణనలో మొత్తం 8,19,58,314 తప్పులు వచ్చినట్లుగా ప్రభుత్వం గుర్తించింది. వీటిని సరిదిద్దాల్సిందిగా అన్ని రాషా్ట్రలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరామని, ఇప్పటిదాకా 6,73,81,119 తప్పులను సరిదిద్దగా, ఇంకా 1,45,77,195 తప్పులను దిద్దాల్సి ఉందని కేంద్ర హోం శాఖ తెలిపింది. అయితే కులపరమైన జనాభా గణాంకాలను వెల్లడించకపోవడాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి చౌదరి బీరేంద్ర సింగ్‌ సమర్థించుకున్నారు. త్వరలో బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న దృష్ట్యా వివిధ కులాల జనాభా వివరాలను ప్రభుత్వం వెల్లడించడం లేదన్న విమర్శలను ఆయన తోసిపుచ్చారు.

ప్రభుత్వసంస్థల ఏర్పాటు షురూ

ఉమ్మడి రాజధానిలో కాకుండా నవ్యాంధ్ర రాజధాని ప్రాంతం నుంచే పాలన సాగించే ప్రక్రియలో వేగం పెంచేందుకు ఏపీ సర్కార్‌ ప్రణాళికలు రచిస్తోంది. రాజధాని ప్రాంతం నుంచి పాలన సాగించేదిశగా ఏపీ సర్కార్‌ అడుగులు వేస్తోంది. పలు శాఖల కార్యాల‌యాల త‌ర‌లింపున‌కు కసరత్తు ముమ్మరం చేస్తోంది. ఇప్పటికే వారానికి 3 రోజులు రాజ‌ధాని నుంచి పాలిస్తున్న సీఎం పూర్తిస్థాయిలో అక్కడి నుంచే కార్యకలాపాలు కొనసాగించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. ప్రభుత్వ సంస్థలు ఏర్పాటు చేయ‌డానికి అనువైన ప్రైవేట్ భవనాలను ప‌రిశీలించేందుకు ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే విజయవాడలో క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసుకున్న బాబు..

కలాం పేరు ఖరారు..

మాజీ రాష్టప్రతి అబ్దుల్ కాలామ్‌కు కేంద్ర మంత్రివర్గం నివాళులర్పించిన తరువాత రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్‌కు కలామ్ పేరు పెట్టాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతీ ఇరానీ వెల్లడించారు

రేపు ఉరితీసేందుకు ఏర్పాట్లు పూర్తి..

సుప్రీం కోర్టు విధించిన ఉరిశిక్షను రద్దుచేయాలని కోరుతూ ముంబయి పేలుళ్ల కేసు నిందితుడు యాకుబ్ మెమన్ రాష్టప్రతికి మరోసారి పిటిషన్ పెట్టుకున్నారు. గతంలో మెమన్ పెట్టుకున్న పిటిషన్‌ను రాష్టప్రతి తోసిపుచ్చారు. నాగపూర్ జైలులో మెమన్‌ను రేపు ఉరితీసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.

ఓటుకునోటు కేసులో చార్జిషీటు

ఓటుకు నోటు కేసులో ఏసీబీ చార్జిషీటు దాఖలు చేసింది. చార్జిషీటులో రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్‌, ఉదయసింహ, మత్తయ్య పేర్లు నమోదు చేశారు.

ప్రమాద ఘంటికలు

సేద్యం గిట్టుబాటు కాక, పెట్టిన పెట్టుబడులు తిరిగి రాక, రుణగ్రస్తులై నిరాశా నిస్ప్రుహలతో జీవితాలు చాలిస్తున్న రైతులను ఇప్పటి వరకు చూశాం. కానీ ఇప్పుడు ప్రభుత్వ వేధింపులు భరించలేక రోజుకో రైతు బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్న దుర్మార్గం మన రాష్ట్రంలో కనిపిస్తోంది. కర్నూలు జిల్లా ఓర్వకల్‌లో సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ కింద భూమి కోల్పోయిన ఒక రైతు కనీసం ఇస్తామన్న పరిహారం కూడా ఇవ్వకపోవడంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. విశాఖ జిల్లా భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్వాశిత రైతు ఆత్మహత్యకు ప్రయత్నించాడు. చిత్తూరు జిల్లాలో ఎయిర్‌పోర్టు బాధితులదీ అదే దారి.

అమ్మకానికి గ్రీస్‌

గ్రీస్‌ తన అప్పును సాంతం చెల్లించగలదని ఆశించటం అవాస్తవికమని గ్రీస్‌కు అప్పులిచ్చిన సంస్థలలో ఒకటైన ఐఎంఎఫ్‌ కూడా బహిరంగంగా గుర్తించిన విషయాన్ని కాసేపు మర్చిపోదాం. గ్రీస్‌కు అప్పును చెల్లించటంలో ఎలాంటి ఉపశమనాన్నీ ఇవ్వలేదనుకుంటే ఆ దేశం ప్రతి సంవత్సరం కొంత మొత్తాన్ని చెల్లించవలసి ఉంటుంది. ఏదిఏమైనా గ్రీస్‌ను రెండు మార్గాలలో తన అప్పును చెల్లించేలా చేయవలసి ఉంటుంది. మొదటిది, గ్రీస్‌ సరుకులను, సేవలను ఋణదాతలు కొనుగోలుచేసి ఇచ్చిన అప్పుకు సర్దుబాటు చేసుకోవాలి. విదేశీ చెల్లింపుల సమతూకానికి సంబంధించిన కరెంటు ఖాతాలో మిగులు ఉండాలి. అలా ఏర్పడిన మిగులును గ్రీస్‌ తన అప్పు తీర్చటానికి వినియోగిస్తుంది.

డిగ్రీలో సెమిస్టర్‌ ఎవరి కోసం?

డిగ్రీ కళాశాలలను అభివృద్ధి చేసి, ఖాళీగా ఉన్న అధ్యాపక, అధ్యాపకేతర పోస్టులను భర్తీ చేసి అంతర్జాతీయ ప్రమాణా లతో నూతన కోర్సులను ప్రవేశపెట్టి, ప్రమాణాలు పెంచాల్సిన ప్రభుత్వం ఆ దిశగా అలోచనలకు ఆమడ దూరంలో ఉంది. ఇప్పటి దాకా డిగ్రీలో ఉన్న మూడు సంవత్సరాల పరీక్షల స్థానంలో ఆరు సార్లు పరీక్షలు నిర్వహించే ''సెమిస్టర్‌ విధానాన్ని'' అమలు చేయడానికి సిద్ధం అవుతున్నది. ఈ విధానాన్ని ఎవరి ప్రయోజనాల కోసం అమలు చేస్తున్నారు?

అట‌వీభూముల‌స్వా‌ధీనంపై మైల‌వ‌రంలో రాస్తారోకో

పేద‌ల సాగులో ఉన్న అట‌వీ భూముల‌ను స్వా‌ధీనం చేసుకోవ‌ద్ద‌ని కోరుతూ సిపిఎం ఆధ్వ‌ర్యంలో కృష్ణా జిల్లా మైల‌వ‌రం జాతీయ ర‌హ‌దారిపై రాస్తా‌రోక జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా రాష్ర్ట కార్య‌ద‌ర్శి పి.మ‌ధు ను పోలీసులు అరెస్టు చేశారు. త‌ద‌నంత‌రం పోలీసులు మైల‌వ‌రం పోలీసు స్టే‌ష‌న్ కు త‌ర‌లించారు. పోలీసుల‌కు పేద‌ల‌కు మ‌ద్య వాగ్వా‌దం జ‌రిగింది. పోలీసులు విచ‌క్ష‌ణ ర‌హితంగా వారిని ఈడ్చి పారేశారు.  

Pages

Subscribe to RSS - July