కలెక్టరేట్ల ముట్టడి ఉద్రిక్తం

తమ సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్‌ కార్మికులు శుక్రవారం చేపట్టిన కలెక్టరేట్ల ముట్టడి ఉద్రిక్తంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు మూడున్నర వేల మంది కార్మికులను అరెస్టు చేశారు. పలుచోట్ల లాఠీఛార్జీలు జరిపారు. విజయవాడలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌ బాబూరావుసహా పలువురు వామపక్ష నేతలు సొమ్మసిల్లి పడిపోయారు. పిఎం రాష్ట్ర కార్య దర్శి పి.మధు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామ కృష్ణ, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఎ గఫూర్‌, ఎఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబలేసు సహా వేలాది మందిని అరెస్టు చేశారు. విశాఖలో 2,500 మందినీ, రాష్ట్రంలో కలెక్టరేట్ల వద్ద మరో వెయ్యి మందినీ అరెస్టు చేశారు.