July

ప్రభుత్వ విధానాలతో భారమౌతోన్న విద్య

సమాజాభివృద్ధికి, మానవ వికాసానికి చోదకశక్తి విద్య. విద్యా విధానాలే ఆయా దేశా పురోభివృద్ధికి సంకేతాలుగా వున్నాయి. అత్యధిక జనాభాగ చైనా అయినా, చిన్న దేశం ఫిన్‌లాండ్‌ అయినా అదే సందేశం ఇస్తున్నాయి.మన దేశంలో స్వాతంత్య్రం వచ్చి 68 యేళ్ళు గడిచినా అక్షరాస్యత 74%గా ఉంది. మన రాష్ట్రంలో చూస్తే అక్షరాస్యత 67% మాత్రమే ఉంది.  స్త్రీలో 59.74%. 2011 సర్వే ప్రకారం ఉమ్మడి రాష్ట్రంలో అక్షరాస్యత 40% లోపు ఉన్న మండలాలు 215 కాగా 40 నుంచి 55% లోపు ఉన్న మండలాలు 165 వున్నవి. 55%లోపు అక్షరాస్యత వున్న మండలాలు 383.

పశ్చాత్తాపం - ఫలితం?

జులై 30వ తేదీకి ఉరిశిక్ష విధించిన బాంబు పేలుళ్ళ కేసు నిందితుడు యాకూబ్‌ మెమన్‌ ఇప్పటి వరకు 21 సంవత్సరాలకు పైగా జైలులో ఉన్నాడు. జీవిత ఖైదీకి మనదేశంలో విధించే శిక్ష 14 నుంచి 20 సంవత్సరాలు. ఆ విధంగా చూస్తే యాకూబ్‌ మెమన్‌ ఇప్పటికే ఒక జీవిత ఖైదు అనుభవించాడు. పోనీ నిందితుణ్ణి మన చట్టబద్ధ సంస్థలు శోధించి బంధించాయా? దానికి ఎంత పరిశోధన చేశాయి? ఎలా పట్టుకున్నాయి? అని ప్రశ్నించు కుంటే అలాంటిదేం లేదు. మెమన్‌ తనకు తానుగా లొంగిపోయాడు. లొంగిపోయిన అతణ్ణి అరెస్టు చేసి ఆయన ఇచ్చిన సమాచారంతోనే విచారణ సాగించిన సంస్థలు సుదీర్ఘ విచారణ చేసిన మేరకు అతడే నిందుతుడని తేల్చిన టాడా కోర్టు ఉరిశిక్ష విధించింది.

Pages

Subscribe to RSS - July