July

గురుకులాల ఘోష పట్టని సర్కారు

నాటి ముఖ్యమంత్రి యన్‌టి రామారావు, ఎస్‌ఆర్‌ శంకరన్‌ల ఆధ్వర్యంలో 1983లో సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడిన షెడ్యూల్డ్‌ కులాల అభ్యున్నతి కోసం ఆంధ్రప్రదేశ్‌ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు ఏర్పాటుచేశారు. అవి సాధారణ హాస్టళ్ళ కంటే మెరుగైన విద్య, క్రమశిక్షణ వంటి విషయాల్లో మంచి ఫలితాలు సాధిస్తూ నడుస్తున్నాయి. 1987లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకులాలను కలిపి ఎపిఎస్‌డబ్ల్యుఆర్‌ఇఐ సొసైటీ పేరుతో రాష్ట్ర సంస్థగా ఏర్పాటు చేశారు. కొన్ని సంవత్సరాలపాటు విద్యావేత్తల ఆధ్వర్యంలో ఇవి సజీవంగా నడిచాయి. ఆ తరువాత ఈ సంస్థ స్థాయి పెంచి ఐఎఎస్‌, ఐపిఎస్‌ అధికారులను కార్యదర్శులుగా నియమించారు.

GST కాంగ్రెస్‌, బిజెపి వ్యవహారం కాదు

జిఎస్టీ బిల్లు కాంగ్రెస్‌, బిజెపి వ్యవహారం కాదని సిపిఎం ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ పక్షనేత సీతారామ్‌ ఏచూరి పేర్కొన్నారు. ఇది అన్ని పక్షాలకు, దేశ ప్రజలకు సంబంధించిన అంశమని అఖిల పక్ష సమావేశానంతరం మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. గత రెండేళ్లగా సిపిఎం తరపున అఖిల పక్షం వేయాలని కోరుతున్నామన్నారు. కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు అఖిల పక్షం సమావేశం ఏర్పాటు చేయలేదన్నారు.

స్విస్‌ ఛాలెంజ్‌ బహిరంగం

నూతన రాజధాని నిర్మాణంలో భాగంగా సింగపూర్‌ కన్సార్టియం దాఖలు చేసిన స్విస్‌ ఛాలెంజ్‌ ప్రతిపాదనను బహిరంగ పరిచేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే దీనికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం లభించింది. దీంతో అధికారులు పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి స్విస్‌ ఛాలెంజ్‌పై ఉత్తర్వులు కూడా జారీ చేశారు.ఈ ఛాలెంజ్‌ ప్రతిపాదనను బాహాటంగా ప్రకటించి, ఇతర సంస్థల నుంచి కౌంటర్‌ ఛాలెంజ్‌ కోరాల్సి ఉంటుంది. వీలైంత త్వరగా ఛాలెంజ్‌ను బహిరంగపరచాలని నిర్ణయించారు. ముఖ్య మంత్రితో కూడా చర్చించామని, సోమవారం దీన్ని ప్రకటించే అవకాశాలున్నాయని సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు.

కొవ్వాడ అణువిద్యుత్ ప్లాంట్ కు వ్యతిరేకం..

శ్రీకాకుళం జిల్లా రణస్ధలంలో కొవ్వాడ అణువిద్యుత్ ప్లాంట్ కు వ్యతిరేకంగా జరుగుతున్న సదస్సుకు సిపిఎం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు కామ్రేడ్ ప్రకాశ్ కరత్ హాజరయ్యారు .భారత్ దేశంలో ఎక్కడా లేనటువంటి ఒకే చోట ఆరు రియాక్టర్లు పెట్టటం అనేది పెను ప్రమాదకరమని తెలిపారు.ఒకే ప్రదేశంలో ఆరు రియాక్టర్లు ఏర్పాటు చేస్తే.. ఒక్క కొవ్వాడ ప్రాంతానికే కాదు..ఉత్తరాంధ్రలో వున్నటువంటి మూడు జిల్లాలకు తీవ్రమైన పెను ప్రమాదం పొంచి వుందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని గతంలో మన్ మోహన్ సింగ్ ప్రభుత్వ ఉన్నప్పటి నుండీ సీపీఎం పార్టీ పోరాడుతోందన్నారు.

ప్రభుత్వ విధానాలవల్ల ధరల పెరుగుదల

రోజురోజుకూ పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చేయడంలోనూ, నిరుద్యోగాన్ని అరికట్టడంలోనూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సిపిఎం నాయకులు వేమారెడ్డి అన్నారు. సిపిఎం ఆధ్వర్యంలో బుధవారం దేవాపురంలో అధిక ధరలకు నిరసనగా ప్రదర్శన నిర్వహించారు. వేమారెడ్డి మాట్లాడుతూ అంతర్జాతీయంగా ఆయిల్‌ ధరలు తగ్గినా ఇక్కడ ధరలు తగ్గించకుండా సామాన్య ప్రజలు బతకలేని పరిస్థితి కల్పించిన ఈ ప్రభుత్వ పెట్టుబడిదారీ విధానాలకు వ్యతిరేకంగా నిరనన వ్యక్తం చేయాలని పిలుపునిచ్చారు. కార్పొరేట్‌ సంస్థలకు రాయితీలు కల్పిస్తూ పేద ప్రజలకు కనీస అవసరాలైన విద్య, వైద్యం కల్పించడంలేదని అన్నారు.

రహస్య పత్రాల్ని బయటపెట్టిన కేంద్రం..

1945లో తైవాన్‌లో జరిగిన విమాన ప్రమాదంలో నేతాజీ మరణించినట్లు అధికారికంగా ప్రకటించినా భారతీయులు అందరికి ఆయన మృతిపై ఆనుమానాలు మిగిలే ఉన్నాయి. తాజాగా కేంద్రం బయటపెట్టిన ఓ రహస్య పత్రంలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. 1999లో నేతాజీ మృతిపై వాస్తవాలను వెలుగులోకి తేచ్చేందుకు అప్పటి వాజ్‌పేయి ప్రభుత్వం జస్టిస్‌ మనోజ్‌ ముఖర్జీ నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేసింది.  2వేల సంవత్సరంలో నరేంద్రనాథ్‌ సింద్‌కర్‌ అనే జర్నలిస్టు ఈ కమిషన్‌కు ఓ అఫిడవిట్‌ సమర్పించారు. 1968లో నేతాజీ బతికే ఉన్నట్లు తన అఫిడవిట్‌లో సింద్‌కర్‌ పేర్కొన్నారు.

నీట్ ను రద్దు చేయాలని సుప్రీంలో పిటీషన్

కేంద్రం జారీ చేసిన నీట్ ఆర్డినెన్స్ ను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలయ్యింది. ప్రయివేట్ వైద్య కళాశాల యాజమాన్యాలు సంకల్ప్ స్వచ్ఛంధ సంస్థ, సామాజిక వేత్త ఆనంద్ రే పిటీషన్ దాఖలు చేశారు. కాగా పిటీషన్ విచారణను కోర్టు వాయిదా వేసింది. జస్టిస్ అనిల్ ఆర్ దవే, జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయల్ లతో కూడిన బెంచ్ కు నీటి ఆర్డినెన్స్ రద్దు పిటీషన్ సుప్రీం బదాలాయింపు చేసింది.

తీస్తా సెతల్వాద్‌ పిటిషన్‌ ఆగస్టు 17కు

నిధుల దుర్వినియోగం ఆరోపణలపై తన స్వచ్చంద సంస్థతో పాటు తన వ్యక్తిగత ఖాతాలను ప్రభుత్వం నిలిపివేయడాన్ని సవాల్‌ చేస్తూ తీస్తా సెతల్వాద్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు ఆగస్టు 17కు వాయిదా వేసింది. మరోవైపు ఫోర్డ్‌ ఫౌండేషన్‌కు సంబంధించిన ఖాతాలతో పాటు, వ్యక్తిగత ఖాతాలు, వీటికి సంబంధం లేని ఇతర ఖాతాలను ప్రభుత్వం స్తంభింపచేసిందని తీస్తా సెతల్వాద్‌ ఇప్పటికే సుప్రీంకోర్టుకు నివేదించారు.

Pages

Subscribe to RSS - July