July

ప్రత్యేక బిల్లుపై రాజ్యసభలో ఓటింగ్‌..

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తూ ఏపీ పున ర్వ్యవస్థీకరణ బిల్లులో సవరణ చేయాలంటూ కాంగ్రెస్‌ ఎంపీ కేవీపీ రామచంద్రరావు రాజ్యసభలో ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లుపై శుక్రవారం ఓటింగ్‌ జరుగనుంది. 

పోలీసుల మౌనం ఎందుకు ..? :కేజ్రీ

గుజరాత్ లో దళితులను బీజేపీ ప్రభుత్వం అణచివేస్తోందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు.  రాజ్కోట్ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న ఉనా ఘటన బాధితులను ఆయన శుక్రవారం పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. బాధ్యులను చట్టం ముందు నిలబెట్టాలని డిమాండ్ చేశారు. ఉనాలో దళితులపై దాడి చేసిన వారిపై పోలీసులు ఎందుకు చర్య తీసుకోలేదని ప్రశ్నించారు.

దళితులకు ఆర్థిక సాధికారత:ఏచూరి

దళితులపై దాడులు నివారించాలంటే మహాత్మగాంధీ చెప్పినట్టుగా 'మనసు' మార్చుకుంటే సరిపోదని, అణగారిన వర్గాలకు ఆర్థిక సాధికారత కల్పించాలని సీపీఐ(ఎం) రాజ్యసభాపక్ష నేత సీతారాం ఏచూరి స్పష్టం చేశారు. 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ.. దళితులపై దాడులు చేసేందుకు నూతన ద్వారాలు తెరిచిందని విమర్శించారు. గోసంరక్షణ, యూనివర్శిటీలు, అవమానకర వ్యాఖ్యలు ఇవన్నీ అందులో భాగమని చెప్పారు. దళితులపై బీజేపీ ఆలోచనా వైఖరిలో మార్పురావాలన్న ఏచూరి... సమాజంలో ఆధ్యాత్మిక ఆలోచనలకు బదులు రాజ్యాంగంలో పేర్కొన్నట్టుగా శాస్త్రీయ దృక్పథం పెంపొందించాల్సిన అవసరముందన్నారు. 

రాజకీయాల కోసమే దళితుల విభజన

రాజకీయ నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం దళితులను విభజించే కుట్రలు పన్నుతున్నార ని మాల మహానాడు మండిపడింది. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మాల మహానాడు చేపట్టిన నిరసన కార్యక్రమాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ అనేది సుప్రీం కోర్టు, జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ల తీర్పులకు విరుద్ధమన్నారు.

కనీస వేతనాల చట్టాన్నిసవరించండి

రాష్ట్రంలో తక్షణమే కనీస వేతనాల సలహా మండలిని ఏర్పాటు చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు కోరారు. పదేళ్లుగా కనీస వేతనాల చట్టాన్ని సవరించలేదన్నారు. దీంతో ప్రతి నెలా కార్మికులు రూ.500 కోట్లు నష్ట పోతున్నట్లు తెలిపారు. 65 షెడ్యూల్స్‌లోని కార్మికులు, అంగన్‌వాడీ వర్కర్లు, విఆర్‌ఎ, కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎంఎ గఫూర్‌ విజయవాడలోని క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును గురువారం కలిసి ఈ మేరకు ఒక వినతిపత్రాన్ని అందజేశారు. 

గుజరాత్‌ నమూనాపై జాతీయ సదస్సులో విమర్శలు..

అంతర్జాతీయ ద్రవ్య నిధి, ప్రపంచ బ్యాంక్‌ విధానాల ఫలితంగానే గుజరాత్‌ నమూనా రూపుదిద్దుకుందని భూమి అధికార్‌ ఆందోళన్‌ పేర్కొంది. గత మూడు రోజులుగా ఇక్కడ సాగుతున్న భూమి అధికార్‌ ఆందోళన్‌ జాతీయ సదస్సులో భాగంగా గుజరాత్‌ అభివృద్ధి నమూనాను బట్టబయలు చేసేందుకు ప్రత్యేక సమావేశం జరిగింది. గత 17 ఏండ్లుగా రాష్ట్రంలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వంలో అమలు జరుగుతున్న అభివృద్ధి విధానాల చీకటి పార్శ్వాలను ఈ సమావేశం ప్రముఖంగా ప్రస్తావించింది. రైతుల, కార్మికుల, ఆదివాసీల, దళితుల హక్కులను కాలరాస్తూ ఈ గుజరాత్‌ నమూనా ఆవిర్భవించిందని సమావేశంలో వక్తలు స్పష్టంచేశారు.

ఎంపీలకు రెట్టింపు వేతనాలు..!

కేంద్ర మంత్రుల బృందం సిఫారసులకు పార్లమెంట్‌ ఆమోదం తెలిపితే ఎంపీల జీతాలు 100 శాతం పెరగనున్నాయి. ప్రస్తుతం నెలకు రూ.50 వేలు వేతనంగా ఇస్తున్న మొత్తాన్ని రూ.లక్షకు పెంచాలని మం త్రుల బృందం తమ ప్రతిపాదనలను క్యాబినెట్‌కు నివేదిం చింది. వేతనాలపై గతంలో నియమించిన ఎంపీల కమిటీ సిఫారసులకు మంత్రుల బృందం ఆమోదం తెలిపింది. ఇక ప్రధాని మోడీ కూడా అంగీకరిస్తే ఈ సమావేశాల్లోనే పార్లమెంట్‌లో ఆమోదం పొందే అవకాశ మున్నది.

Pages

Subscribe to RSS - July