కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని టిడిపి ప్రభుత్వాలు ప్రజా సమస్యలను గాలికొదిలి, సామాజిక బాధ్యతను విస్మరిస్తున్నాయని, అదే క్రమంలో రైతులకు కల్పించాల్సిన కనీస మద్దతు ధరను కూడా కల్పించకపోవడం విచారకరమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు పేర్కొన్నారు. మండలంలోని కాజా గ్రామంలో సింహాద్రి బసవపున్నయ్య జయంతి సందర్భంగా సింహాద్రి శివారెడ్డి మోమొరియల్ కంప్యూటర్ శిక్షణ కేంద్రాన్ని ఆయన శుక్రవారం గ్రామంలోని సుందరయ్య భవన్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు ఎంపిటిసి ఈదా ప్రతాప్‌రెడ్డి అధ్యక్షత వహించారు.