July

గిరిజనుల కోసం ఉచిత భోజన కేంద్రాలు

విశాఖ ఏజెన్సీలో గిరిజనుల  ఆరోగ్యాలను రక్షించాలని, పి.హెచ్.సిలలో రోగులకు భోజనం పెట్టాలని, సిపియం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత భోజన కేంద్రాలకు చేయూత నివ్వాలని కోరుతూ సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్ నర్సింగరావు, విశాఖ జిల్లా కార్యదర్శులు లోకనాధం, గంగరావు  విశాఖ పూర్ణమార్కెట్ వద్ద క్యాంపెయిన్ చేసి వ్యాపారుల వద్ద నుండి  బియ్యం, పప్పులు వగైరా సేకరించారు.

గిరిజ‌న ప్రాంతంలో సిపియం నిర్వహిస్తున్న ఉచిత భోజన కేంద్రాలకు చేయూత నివ్వాలని కోరుతూ విశాఖ లో మాస్ క్యాపెయిన్ చేస్తున్న సిపిఎం శ్రేణులు

మద్దతుధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం

కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని టిడిపి ప్రభుత్వాలు ప్రజా సమస్యలను గాలికొదిలి, సామాజిక బాధ్యతను విస్మరిస్తున్నాయని, అదే క్రమంలో రైతులకు కల్పించాల్సిన కనీస మద్దతు ధరను కూడా కల్పించకపోవడం విచారకరమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు పేర్కొన్నారు. మండలంలోని కాజా గ్రామంలో సింహాద్రి బసవపున్నయ్య జయంతి సందర్భంగా సింహాద్రి శివారెడ్డి మోమొరియల్‌ కంప్యూటర్‌ శిక్షణ కేంద్రాన్ని ఆయన శుక్రవారం గ్రామంలోని సుందరయ్య భవన్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు ఎంపిటిసి ఈదా ప్రతాప్‌రెడ్డి అధ్యక్షత వహించారు.

చిత్తూరులో దళిత హక్కుల సదస్సు

చిత్తూరు జిల్లాలో దళితులు తీవ్రమైన వివక్ష ఎదుర్కొంటున్నారు. వివక్ష రూపుమాపేందుకు అధికారయంత్రాంగం చొరవతీసుకోవాలి. లేకుంటే పోరాటం తప్పదని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు హెచ్చరించారు. తనకు కులంపైన నమ్మకం లేదని సిఎం చెబుతున్నారు...మరి సొంత జిల్లాలో కుల వివక్షపై మీ స్పందన ఏమిటని ప్రశ్నస్తున్నాను. కుల వివక్ష ముఖ్యమంత్రికే సిగ్గుచేటు. టిటిడికి ఒకరినయినా ఈవోగా నియమించారా. ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే టిటిడి ఈవో గా దళితులను నియమించసలి. గతంలో దళితగోవిందం పూజలుచేసిన శ్రీవారి విగ్రహాలను గోదాముల్లో పడేశారు. ఇది వివక్ష కాదా. కబ్జా అయిన దళితుల భూములను తిరిగి వారికి అప్పగించాలి.

కార్మికుల ఇళ్ల తొలగింపు దుర్మార్గం:CPM

తిరుపతిలో  స్మార్ట్ సిటీ పేరుతో పారిశుద్ధ్య కార్మికుల కాలనీ తొలగింపునకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అశోక్ నగర్ 'స్కావింజర్స్ కాలనీ' లో  స్మార్ట్ సిటీ పేరుతో 250 ఇళ్ళు తొలగించి అపార్ట్ మెంట్ కట్టాలని ప్రయత్నిస్తుండడంతో కాలనీ వాసులు ప్రతిఘటించారు. సిపియం కేంద్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి. కృష్ణయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు కందారపు మురళి తదితరులు కాలనీ వాసులను కలసి వారికి అండగా పోరాడుతామని హామీ ఇచ్చారు 

దేవరపల్లిలో దళితులకు న్యాయం చేయాలి..

 ప్రకాశం జిల్లా పర్చూరు మండలం దేవరపల్లిలో దళితులను నిర్బంధించి వారి భూములను సాగు చేసుకుంటున్నారనే విషయం తెలుసుకుని వారికి మద్దతుగా వెళ్లిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, నాయకులు వై.వెంకటేశ్వరరావులను అరెస్టు చేయడాన్ని వామపక్ష పార్టీలు ఖండించాయి.అధికార యంత్రాంగం పెత్తందారులకు మద్దతుగా పోలీసులను పంపించి వారి పహారాలో దళితుల భూముల్లో చెరువులు తవ్వుతోం దని ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టు చేసిన నాయకులను వెంటనే విడుదల చేయాలని, దేవరపల్లి దళితులు సాగులో ఉండేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని కోరారు.

Pages

Subscribe to RSS - July