సాధారణంగా విత్తసంస్థలు (ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్స్) తమ ప్రాథమిక విధులు; సమాజంలో ఏర్పడే పొదుపు సమీకరించి ఉత్పత్తిని, ఉత్పాదకతను పెంచే పెట్టుబడులకు ఉపయోగపడే సంస్థలుగా, వ్యక్తుల పొదుపులను వారి జీవితకాలంలో ఆ తర్వాత నూతన తరాలకు మేనేజ్ చేసే సంస్థగా, క్రమానుగత చెల్లింపు చేసే సంస్థగా, నష్టభయాలను (రిస్క్) మేనేజ్‌చేయటం, బదిలీ చేయటం వంటి విధులు నిర్వహిస్తుంటాయి. కానీ ప్రపంచీకరణ, ఉదారీకరణ ఆర్థిక విధానాల ద్వారా బడా విత్తసంస్థలు నిజ ఆర్థిక వ్యవస్థ రంగాలకు వాటి వృద్ధికి దోహదపడే విత్తవనరులు సమకూర్చటం లేదు.