
ఏపీకీ ప్రత్యేక హోదా కోరుతూ శుక్రవారం రాజ్యసభలో కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేటు మెంబర్ బిల్లు విషయంలో ఎలాంటి కుట్రలు చేయకుండా ఓటింగ్‌కు సహకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబును పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి కోరారు.ఆయన గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. బిల్లు శుక్రవారం ఓటింగ్‌కు రాకుండా చేయడానికి చంద్రబాబు విశ్వప్రయత్నాలు చేస్తున్నారని దుయ్యబట్టారు.