గుజరాత్‌ నమూనాపై జాతీయ సదస్సులో విమర్శలు..

అంతర్జాతీయ ద్రవ్య నిధి, ప్రపంచ బ్యాంక్‌ విధానాల ఫలితంగానే గుజరాత్‌ నమూనా రూపుదిద్దుకుందని భూమి అధికార్‌ ఆందోళన్‌ పేర్కొంది. గత మూడు రోజులుగా ఇక్కడ సాగుతున్న భూమి అధికార్‌ ఆందోళన్‌ జాతీయ సదస్సులో భాగంగా గుజరాత్‌ అభివృద్ధి నమూనాను బట్టబయలు చేసేందుకు ప్రత్యేక సమావేశం జరిగింది. గత 17 ఏండ్లుగా రాష్ట్రంలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వంలో అమలు జరుగుతున్న అభివృద్ధి విధానాల చీకటి పార్శ్వాలను ఈ సమావేశం ప్రముఖంగా ప్రస్తావించింది. రైతుల, కార్మికుల, ఆదివాసీల, దళితుల హక్కులను కాలరాస్తూ ఈ గుజరాత్‌ నమూనా ఆవిర్భవించిందని సమావేశంలో వక్తలు స్పష్టంచేశారు.