July

ప్రతిష్టంభనకు తెరదించాలి!

లలిత్‌ గేట్‌, వ్యాపం కుంభకోణాలు ఊహించిన విధంగానే పార్లమెంటును కుదిపేశాయి. వర్షాకాల సమావేశాలు తొలి రోజున మొదలైన ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతూనే ఉంది. పార్లమెంటు పదే పదే వాయిదా పడడానికి ఎవరు కారకులు అన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. ప్రతిపక్షాలే పార్లమెంటును అడ్డుకుంటున్నాయని, చర్చ జరగడం ఇష్టం లేకే ఇలా చేస్తున్నాయని బిజెపి, మోడీ ప్రభుత్వం చేస్తున్న వాదన పసలేనిది. ప్రతిపక్షాలు పార్లమెంటులో కోరుతున్నదేమిటి?

రక్తదాహంతోనే ఉరి..

‘డెత్‌వారెంట్‌పై స్టే ఇవ్వాలంటూ యా కూబ్‌ దాఖలు చేసిన ఆఖరి ఫిర్యాదును సుప్రీం కోర్టు కొట్టివేయడం నిరుత్సాహాన్ని కలిగించింది. ఈ నిర్ణయం సరికాదు. అసంతృప్తితో ఉన్నా. సుప్రీం కోర్టు విషాదకరమైన పొరపాటు చేసిందని నా అభిప్రాయం’ అని యాకూబ్‌ లాయర్‌ ఆనంద్‌ గ్రోవర్‌ అన్నారు. రక్తదాహంతో ఉన్నవారు యాకూబ్‌ను ఉరితీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యాకూబ్‌ తరఫు వాదించిన మరో న్యాయవాది మీడియాపట్ల అసహనం వ్యక్తం చేశారు. యాకూబ్‌ ఉరిశిక్షపై స్పందించాలని మీడియా ప్రశ్నించగా..‘మా కక్షిదారు చనిపోతున్నాడు. నా మీద దయ చూపించండి’అని వ్యాఖ్యానించారు.

సమ్మెతో సరైన సమాధానం చెప్పాలి

హక్కుల పరిరక్షణ కోసం సమరశీల పోరాటాలకు సన్నద్ధం కావాలని కార్మికులు, ఉద్యోగులకు సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్‌.నర్సింగరావు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లా పైడిభీమవరంలో అరబిందో పరిశ్రమ వద్ద బుధవారం నిర్వహిచిన 'కార్మిక గర్జన' సభలో ఆయన ప్రసంగించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్ట సవరణలను, కార్మిక ఉద్యమాలపై నిరంకుశ దాడులను, సామాజిక సంక్షేమ పథకాల నిధుల్లో కోతను విరమించాలని డిమాండ్‌ చేశారు.

సాగు భూములు లాక్కుంటే సహించం..

వ్యవసాయ భూములు లాక్కుని కార్పొరేట్‌, విదేశీ కంపెనీలకు కట్టబెడితే చూస్తూ ఊరుకోబోమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు హెచ్చరించారు. నెల్లూరు జిల్లా మనుబోలు మండలం కట్టువపల్లి, కొలనుకుదురు గ్రామాల్లో బుధవారం ఆయన పాదయాత్ర చేశారు. కట్టువపల్లిలోని సర్వే నెంబర్‌ 110 నుండి 900 వరకున్న 936 ఎకరాల భూములను చైనా కంపెనీ డలయన్‌ వాండాకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఆ కంపెనీ ప్రతినిధి మ్యాక్సూఅబౌట్‌ ఇటీవల ఆ భూములను పరిశీలించి వెళ్లారు. ఈ నేపథ్యంలో సాగిన పాదయాత్రలో పలువురు రైతులతో మధు నేరుగా మాట్లాడారు. వారికి ధైర్యం చెప్పారు. అండగా ఉండి పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు.

రాష్ట్ర రాజధానిలో కుర్చీలాట

రాజధాని నిర్మాణ విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు గ్యాంబ్లింగ్‌ గేమ్‌ను తలపిస్తోంది. ప్రక్రియ మొదలైనప్పటి నుండి ఇప్పటి వరకూ ఇద్దరు కీలక అధికారులను మార్చేసింది. ఒకరికి రాజధాని ఎంఓయుపై అవగాహన ఉంటే, మరొకరికి ఇప్పటి వరకూ జరిగిన ప్రక్రియపై అవగాహనుంది. వీరిలో ఒకరు దొండపాటి సాంబశివరావు కాగా, మరొకరు ఆర్మానే గిరిధర్‌. రాజధానిపై జరిగిన ఒప్పందాలు, జరుగుతున్న తీరుపై వీరికి పూర్తి అవగాహన ఉంది. వీరిద్దరినీ తొలగించడం ద్వారా రాజధాని నిర్మాణ ప్రక్రియపై ముఖ్య మంత్రికి, క్రిడా కమిషనర్‌కు తప్ప మరెవరికీ పూర్తిస్థాయి అవగాహన లేని పరిస్థితి ఏర్ప డింది.

రాష్ట్ర మంత్రులకు ఉద్వాసన..

రాష్ట్ర మంత్రివర్గంలో మార్పుల అరశం మరోసారి తెరపైకి వస్తోరది. ఏడాది పాలన ముగిసిన వెరటనే మార్పులు ఉంటాయని భావిరచినప్పటికీ, అనేక కారణాలతో ప్రక్షాళన వాయిదా పడుతూ వస్తోరది. ఇప్పుడు ముఖ్యమంత్రి ఇదే అరశంపై మరోసారి దృష్టి సారిస్తున్నట్లు తెలు స్తోరది. మూడు రోజుల్లో ముఖ్యమంర్ర చంద్రబాబు విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. ఆయన తిరిగొచ్చిన తరువాత మంత్రివర్గ మార్పులు, చేర్పులపై దృష్టి పెడతారని భావిస్తున్నారు. రెరడో తేదీన ఆయన కుటుంబ సమేతంగా విదేశీ యాత్రకు వెళ్తున్నారు. ప్రస్తుతం ఆయన పర్యటన ఏ దేశానికి అన్నది రహ స్యంగా ఉరచినప్పటికీ, టర్కీకి వెళ్లే అవకాశా లున్నాయని తెలుస్తోరది.

సెప్టెంబర్ 2 కార్మిక ఉద్యోగ సమ్మెకు మద్దతు

మంచి రోజు తెస్తామని అధికారంలోకి వచ్చిన మోడీ, బాఋ కార్మికులకు కాళరాత్రులు చూపిస్తున్నారు. బ్రిటీష్‌ పాలనా కాలం నుండి భారత కార్మికవర్గం పోరాడి సాధించుకున్న చట్టపరమైన హక్కున్నీ కారాస్తున్నారు. మరలా కార్మికును కట్టుబానిసుగా యజమాను దోపిడీకి బలి చేస్తున్నారు.బ్రిటీష్‌ పాలనాకాలంలో కార్మికులతో యజమాను12గంటు పనిచేయించుకునేవారు. ఇచ్చినంత పుచ్చుకోవడమే తప్ప అడిగే హక్కులేదు. తీసేస్తే మారు మాట్లాడే అవకాశం లేదు. ప్రమాదంలో కాలు పోయినా, చేయి పోయినా ప్రమాద బీమా లేదు. చస్తే కాటికే తప్ప నష్టపరిహారమే లేదు. ఆందోళను, మీటింగు నిషేధం. సంఘం పెట్టుకునే హక్కులేదు.

గిరిజనులకు స్వయంపాలిత హక్కు కావాలి

మన రాష్ట్రంలో 15లక్ష మంది గిరిజనులు ఉన్నారు. వీరు అందరికంటే అన్ని విధాలా వెనుకబడి ఉన్నారు. అక్షరాస్యతలో రాష్ట్రం సరాసరి 67శాతం కాగా, గిరిజను అక్షరాస్యత 40శాతమే. తలసరి ఆదాయంలో అట్టడుగు స్థానం వీరిదే. ప్రసవ సమయంలో మరణాు, శిశు మరణాల్లో మొదటి స్థానం వీరిదే. ఆహార భద్రత కరువు. మలేరియా, విష జ్వరాలతో చనిపోతున్న వారికి లెక్కేలేదు. రోడ్లు, వంతెను ఇతర మౌలిక సదుపాయాల్లో వెనుకబాటే. విద్యా సదుపాయాలు  ముఖ్యంగా ఉన్నత విద్యా సదుపాయాలు  దాదాపు లేవనే చెప్పాలి.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాు అనుసరిస్తున్న సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ వల్ల దారుణంగా నష్టపోతున్నది గిరిజనులే.

ప్రభుత్వ విధానాలతో భారమౌతోన్న విద్య

సమాజాభివృద్ధికి, మానవ వికాసానికి చోదకశక్తి విద్య. విద్యా విధానాలే ఆయా దేశా పురోభివృద్ధికి సంకేతాలుగా వున్నాయి. అత్యధిక జనాభాగ చైనా అయినా, చిన్న దేశం ఫిన్‌లాండ్‌ అయినా అదే సందేశం ఇస్తున్నాయి.మన దేశంలో స్వాతంత్య్రం వచ్చి 68 యేళ్ళు గడిచినా అక్షరాస్యత 74%గా ఉంది. మన రాష్ట్రంలో చూస్తే అక్షరాస్యత 67% మాత్రమే ఉంది.  స్త్రీలో 59.74%. 2011 సర్వే ప్రకారం ఉమ్మడి రాష్ట్రంలో అక్షరాస్యత 40% లోపు ఉన్న మండలాలు 215 కాగా 40 నుంచి 55% లోపు ఉన్న మండలాలు 165 వున్నవి. 55%లోపు అక్షరాస్యత వున్న మండలాలు 383.

Pages

Subscribe to RSS - July