July

ర్యాగింగ్‌పైరగిలినవిద్యార్థులు

నాగార్జున యూనివర్సిటి బిఆర్క్‌ విద్యార్థిని రిషితేశ్వరి మృ తికి కారకులైన దోషులను కాపాడే ప్రయత్నం జరుగుతోందని, సిట్టింగ్‌ జడ్జితో ప్రభుత్వం తక్షణం విచారణ జరిపించాలంటూ విద్యార్థి సంఘ నేతలు రోడ్డెక్కారు. విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. ముఖ్యమంత్రి చం ద్రబాబు స్పందించి బాధ్యులైన వారిని అరెస్టు చేయించేందుకు చర్యలు తీసుకోవాలని, లేదంటే ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. క్యాంపు కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన విద్యార్థులకు,అడ్డుకొనేందుకు ప్రయత్నించిన పోలీసులకు మధ్య తోపులాట, ఘర్షణ చోటుచేసుకొన్నాయి.

ప్ర‌త్యేక హోదా కై ఉద్య‌మం...సిపిఎం రాష్ట్ర క‌మిటి

ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వబోమని కేంద్ర మంత్రి ఈ రోజు లోక్‌సభలో ప్రకటించడాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) రాష్ట్రకమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది.
రాష్ట్ర పునర్‌ వ్యవస్థీకరణ బ్లిుపై చర్చ సందర్భంగా ఆ నాటి ప్రధాని చేసిన ప్రకటన, నాటి ప్రతిపక్ష పార్టీ నాయకు ఇచ్చిన హామీ మేరకు వెంటనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాని రాష్ట్రకమిటి డిమాండ్‌ చేస్తున్నది.

మరో ఆధార్‌ దేనికి..?

రాష్ట్రంలో నివసిస్తున్న పౌరులందరినీ ఆధార్‌ తరహాలో గుర్తించేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా ఒక విధానం ప్రకటించి ఇప్పటికే ఉన్న కేంద్ర ఆధార్‌ను ప్రశ్నార్థకం చేసింది. ఆధార్‌తోనే నానా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు రాష్ట్ర ఆధార్‌ మరిన్ని తలనొప్పులు, గందరగోళం తెచ్చిపెట్టడం ఖాయం. ప్రజల సమస్త వివరాలనూ సేకరించేందుకు ఎపి యునిక్‌ ఐడెంటిఫికేషన్‌ ఆఫ్‌ రెసిడెంట్స్‌ పాలసీ తెస్తూ ఎపి ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ డిపార్టుమెంట్‌ బుధవారం వెలువరించిన 16వ నెంబర్‌ జీవోలో పేర్కొన్న పలు అంశాలు పేదలనూ, ప్రభుత్వ పథకాలతో లబ్ధిపొందుతున్న వారినీ మరింతగా వడపోసి తగ్గించేందుకు, పథకాలకు దూరం చేసేందుకు ఉద్దేశిం చినవి.

ఆధార్‌ తప్పనిసరి కాదు:సుప్రీం

దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ పథకాల అమల్లో ఆధార్‌ కార్డు తప్పనిసరి కాదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈ మేరకు సుప్రీం కోర్టుకు స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని రాష్ట్రాలతోపాటు సంబంధిత అధికారులకు కూడా స్పష్టం చేసినట్లు జస్టిస్‌ చలమేశ్వర్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనానికి అదనపు సొలిసిటర్‌ జనరల్‌ పింకీ ఆనంద్‌ వివరించారు.

ఉరిశిక్షలను రద్దుచేయాలి:ఏచూరి

దేశంలో ఉరిశిక్షను రద్దు చేయవలసిన సమయం అసన్నమయ్యిందని సిపిఎం అభిప్రాయపడింది. ప్రపంచంలోని అనేక దేశాలు అత్యంత హేయమైన ఈ శిక్షను రద్దుచేశాయని చెబుతూ మనదేశం కూడా ఉరిశిక్షను రద్దుచేయటం అభిలషణీయమని రాజ్యసభలో సిపిఎం పక్షం నాయకుడు సీతారామ్ ఏచూరి చెప్పారు. మెమన్ ఉరి ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనం అని అన్నారు..

ఇకపై ప్రత్యేకహోదా లేదు..

ఇకపైన ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇవ్వబోమని కేంద్రం స్పష్టం చేసింది. లోక్‌సభలో కేంద్ర మంత్రి రావ్ ఇందర్ జిత్ సింగ్ మాట్లాడుతూ ఈ విషయం స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ కేంద్రం వద్ద ఏ ప్రత్యేక విధానమూ లేదని తెలిపారు. అయితే దీనిపై మన రాష్ట్ర ఎంపీలు నోరు మెదపలేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల బీహార్ పర్యటన సందర్భంగా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామన్నారు కానీ ప్రత్యేక హోదాపై ఏ హామీ ఇవ్వలేకపోయారు.

పేదల పొట్టగొడుతున్న ప్రభుత్వం..

పేదల పొట్టగొట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు విమర్శించారు. గురువారం కృష్ణాజిల్లా నాగాయలంకలో జరిగిన కోడూరు, నాగాయలంక మండలాల మత్స్యకారుల సదస్సులో ఆయన మాట్లాడారు. దశాబ్దాల తరబడి పేదలు సాగుచేసుకుంటున్న భూములను విదేశీ కంపెనీలకు దారాదత్తం చేసే పనిలో ముఖ్యమంత్రి నిమగమయ్యారని విమర్శించారు. లక్షలాది ఎకరాల భూమిని పేదల నుండి బలవంతంగా లాక్కుంటుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. దివిసీమలోని 15 వేల మత్స్యకార కుటుంబాలకు చెందిన దాదాపు 20 వేల ఎకరాల భూమిని ఖాళీ చేయాలంటూ అధికారులు నోటీసులు జారీచేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

మొమెన్ ఉరికి ప్రతీకారం..

ముంబై బాంబు పేలుళ్ల కేసులో యాకూబ్ మెమన్ కు ఉరిశిక్ష విధించినందుకు దావూద్ ఇబ్రహీం గ్యాంకు ప్రతీకారం తీర్చుకోవచ్చని, ఒకప్పటి ఆయన అనుచరుడు చోటా షకీల్ వ్యాఖ్యానించాడు. ఇదే కేసులో నిందితుడిగా ఉండి తప్పించుకు తిరుగుతున్న చోటా షకీల్ 'టైమ్స్ ఆఫ్ ఇండియా'కు ఫోన్ చేసి మాట్లాడాడు. మెమన్ ఉరి ఘటనను దావూద్ సీరియస్ గా తీసుకున్నాడని తెలిపాడు. తన సోదరుడు టైగర్ చేసిన పాపాలకు మెమన్ బలయ్యాడన్న షకీల్, నిరపరాధిని దోషిగా చూపి ఉరేశారని ఆరోపించారు.

మోడీపై ఆరెస్సెస్ గుర్రు...

దాయాదీ పాకిస్థాన్ పై భారత ప్రధాని నరేంద్ర మోడీ అనుసరిస్తున్న వైఖరిపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అసంతృప్తితో ఉందట. భారత్ పై దండెత్తుతున్న ఉగ్రవాదులకు నిలయంగా మారిన పాక్ తో చర్చల పేరిట మోడీ సర్కారు అంత ఆసక్తి కనబరచాల్సిన అవసరం ఏముందని కూడా కొందరు ఆరెస్సెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయినా పాక్ పై వైఖరికి సంబంధించి గత యూపీఏ అనుసరించిన వైఖరితోనే ఎన్డీఏ ప్రభుత్వం కూడా ముందుకెళుతోందని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

Pages

Subscribe to RSS - July