గిరిజనులకు స్వయంపాలిత హక్కు కావాలి

మన రాష్ట్రంలో 15లక్ష మంది గిరిజనులు ఉన్నారు. వీరు అందరికంటే అన్ని విధాలా వెనుకబడి ఉన్నారు. అక్షరాస్యతలో రాష్ట్రం సరాసరి 67శాతం కాగా, గిరిజను అక్షరాస్యత 40శాతమే. తలసరి ఆదాయంలో అట్టడుగు స్థానం వీరిదే. ప్రసవ సమయంలో మరణాు, శిశు మరణాల్లో మొదటి స్థానం వీరిదే. ఆహార భద్రత కరువు. మలేరియా, విష జ్వరాలతో చనిపోతున్న వారికి లెక్కేలేదు. రోడ్లు, వంతెను ఇతర మౌలిక సదుపాయాల్లో వెనుకబాటే. విద్యా సదుపాయాలు  ముఖ్యంగా ఉన్నత విద్యా సదుపాయాలు  దాదాపు లేవనే చెప్పాలి.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాు అనుసరిస్తున్న సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ వల్ల దారుణంగా నష్టపోతున్నది గిరిజనులే. విద్యను ప్రైవేటుపరం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ విద్య నిర్వీర్యం అయిపోతున్నది. స్కూళ్లలోటీచర్లు లేరు. పశ్చిమగోదావరి జిల్లా రామన్నపాలెం ప్రాధమిక పాఠశాల్లో 120 మంది విద్యార్దుండగా టీచర్‌ ఒక్కరే. కాలేజీల్లో లెక్చరర్లు లేరు. లేబొరేటరీు లేవు. టీచర్లే లేకుండా చదువు ఎలా వస్తుంది? గిరిజనుకు ప్రభుత్వం నాణ్యతగ విద్య అందించడంలేదు. గిరిజను వాడుకభాషలో బోధించే భాషావాంటీర్లను తీసేశారు. 20మంది ప్లికు తక్కువ ఉన్న స్కూళ్లను మూసివేశారు. దీంతో మళ్లీ గిరిజను చదువుకు దూరమైపోతున్నారు.