సెప్టెంబర్ 2 కార్మిక ఉద్యోగ సమ్మెకు మద్దతు

మంచి రోజు తెస్తామని అధికారంలోకి వచ్చిన మోడీ, బాఋ కార్మికులకు కాళరాత్రులు చూపిస్తున్నారు. బ్రిటీష్‌ పాలనా కాలం నుండి భారత కార్మికవర్గం పోరాడి సాధించుకున్న చట్టపరమైన హక్కున్నీ కారాస్తున్నారు. మరలా కార్మికును కట్టుబానిసుగా యజమాను దోపిడీకి బలి చేస్తున్నారు.బ్రిటీష్‌ పాలనాకాలంలో కార్మికులతో యజమాను12గంటు పనిచేయించుకునేవారు. ఇచ్చినంత పుచ్చుకోవడమే తప్ప అడిగే హక్కులేదు. తీసేస్తే మారు మాట్లాడే అవకాశం లేదు. ప్రమాదంలో కాలు పోయినా, చేయి పోయినా ప్రమాద బీమా లేదు. చస్తే కాటికే తప్ప నష్టపరిహారమే లేదు. ఆందోళను, మీటింగు నిషేధం. సంఘం పెట్టుకునే హక్కులేదు. సమ్మె చేస్తే సమ్మె చేసిన కార్మికుతో పాటు కార్మిక నాయకులపై జరిమానా విధించేవారు. క్రిమినల్‌ కేసు పెట్టేవారు.