కార్మికల కలెక్టరేట్ల ముట్టడికి మద్దతు: మధు

నేడు మున్సిపల్ కార్మికల కలెక్టరేట్ల ముట్టడికి మద్దతు తెలియచేస్తున్నామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. సమ్మెను అణచివేయాలని రాష్ట్ర కాబినెట్ తీసుకున్న నిర్ణయం దారుణమన్నారు. రాష్ట్ర మంత్రే ఈ ప్రకటన చేయడం సిగ్గుచేటని,ప్రభుత్వం కార్మికుల సమ్మెను పరిష్కరించకుండా రాజకీయం చేస్తే ఇది ఒక్క కార్మికుల సమస్య గానే కాక రాజకీయ సవాల్ గా కూడా స్వికరించాల్సివస్తుందన్నారు. సమస్య పరిష్కారం కాకుంటే నెల రోజులైనా ఆందోళనలకు సిద్ధమన్నారు. ప్రభుత్వ బెదిరింపులకు భయపడేది లేదన్నారు.ప్రభుత్వం వెంటనే కార్మిక జెఎసి తో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేసారు ..