విశాఖ జూపార్కును తరలించడాన్ని వ్యతిరేకించండి.

విశాఖనగరంలో ఉన్న ఇందిరాగాంధీ జూలాజికల్‌ పార్కును తరలింపును, దాన్ని ప్రభుత్వ`ప్రైవేట్‌`భాగస్వామ్యం (పిపిపి) పేరుతో ప్రైవేట్‌ కంపెనీలకు అప్పజెప్పడాన్ని సిపిఐ(యం) పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. 1971లో 625 ఎకరాల విస్తీర్ణంలో జూ పార్కు ఏర్పడిరది. ఇది రెండు కొండల మధ్య, ఒకవైపు నేషనల్‌హైవే మరోవైపు సముద్రతీరం మధ్య ఉంది. ఇది వన్యప్రాణులకు సంరక్షణార్ధం ఎంతో ఉపయోగకరంగా ఉంది.  పిల్లలకు, పెద్దలకు విజ్ఞానం, వినోదాన్ని అందిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోనే ఇది అతిపెద్ద జంతుప్రదర్శనశాల. రాష్ట్ర తెలుగుదేశం ప్రభుత్వం దీనిని తరలించి ఆస్థానంలో నైట్‌ సఫారీ, కాసినో క్లబ్‌లు వంటివి ఏర్పాటు చేస్తామని పేర్కొనడం దుర్మార్గం. విశాఖనగరంలో విలువైన ప్రభుత్వ భూములను విదేశీ కార్పొరేట్‌ కంపెనీలకు అప్పజెప్పేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమరావతి రాజధాని నిర్మాణం కోసం సింగపూర్‌ ప్రభుత్వం ఉచితంగా ప్లాన్‌ను ఇచ్చిందని చెబుతుంది, దానికి ప్రత్యామ్నాయంగానే జూపార్కును సింగపూర్‌ కంపెనీలకు అప్పజెప్పే ప్రయత్నం జరుగుతోంది. ఇటువంటి చర్యలు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విడనాడాలి. లేని ఎడల ప్రభుత్వం ప్రజాగ్రహాన్ని సవిచూడాల్సి ఉంటుంది.
    2014 అక్టోబర్‌ 12న సంభవించిన హుదూద్‌ తుఫాన్‌ వల్ల విశాఖనగరంలో 37శాతం పచ్చదనం కోల్పోయింది. వాతావరణంలో విపరీతమైన మార్పు చోటు చేసుకుంటున్నాయి. పర్యావరణ వేత్తలు, శాస్త్రవేత్తలు, జూపార్కును తరలించినట్లైతే నగరంలో వాతావరణ కాలుష్యం విపరీతంగా పెరుగుతుందని హెచ్చరికలు చేస్తున్నారు. మేథావలు, అభ్యుదయ వాదులు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు ఈ జూ పార్కును తరలించడాన్ని, ప్రైవేట్‌పరం చేయాడాన్ని వ్యతిరేకించాలని సిపియం పార్టీ విజ్ఞప్తి చేస్తోంది.