ప్రభుత్వ తీరు మారకుంటే సహించబోం..

కృష్ణాజిల్లా‌లోని మైలవరం మండలం వెల్వడంలో సీపీఎం బృందం పర్యటించింది. ఫీల్డ్ లేబర్ కో-ఆపరేటివ్ సొసైటీ భూములను పరిశీలించింది. ఈ సందర్భంగా సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతూ... రాజధాని పేరుతో పేదల భూములు లాక్కొని పొట్టకొడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం తీరు మారకుంటే సహించమని స్పష్టం చేశారు. దేవినేనిఉమ‌కు మంత్రి పదవి వచ్చాక పేదల్ని పట్టించుకోవట్లేదన్నారు. మా ప్రాణాలు పోయినా పేదలకు భూములు దక్కేలా చేస్తామని హెచ్చరించారు.