
‘‘గీత ఒక మత గ్రంథం కాదు. వివేకం, శాస్త్రం (సైన్స్), ఎన్నో సమస్యలకు పరిష్కారం. ఇదే జీవనం. అందుకే గీతను పాఠశాలల్లో నైతిక విద్యగా బోధిస్తాం. యోగాను కూడా హిందూ ధర్మం అన్నారు. కానీ, జూన్ 21న 192 దేశాలు యోగా నిర్వహిస్తే.. అందులో 47 ముస్లిం దేశాలే. హర్యానా ప్రభుత్వం విద్యను కాషాయీకరణ చేస్తోందని విమర్శిస్తున్నారు. మన సంస్కృతిని మనం నేర్చుకోవటం కాషాయీకరణ ఎలా అవుతుంది.?’’ అని హర్యానా విద్యా మంత్రి రాంవిలాస్ శర్మ ప్రశ్నించారు.