
హైదరాబాద్: గత పది రోజులుగా సమ్మె చేస్తున్న మున్సిపల్ కార్మికులను పట్టించుకొకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని దానికి నిరసనగా ప్రభుత్వ తీరును ఖండిస్తూ కార్మికులు,వామపక్షాల పార్టీలు నేటి నుంచి ఇందిరాపార్క్ వద్ద నిరహారదీక్షకు దిగాయి. ఈ దీక్షలు సిపియం పోలిట్ బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు ప్రారంభించారు. అనంతరం బి.వి.రాఘవులు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని లేకుంటే సమ్మె ఇంకా తీవ్ర రూపం దాలుచుతుందదాన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొననున్నారు.