January

సీమ అభివృద్ధికి సీపీఎం పాదయాత్ర..

సీమ అభివృద్ధిలో భాగంగా ఉద్యమాలకు సీపీఎం శ్రీకారం చుట్టినట్లు పార్టీ రాష్ట్ర కార్యదర్శి మధు పేర్కొన్నారు. రాయలసీలమ అభివృద్ధి నినాదంతో వచ్చే నెలలో భారీ ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు. ఫ్రిబవరి రెండో వారంలో రాయలసీమ జిల్లాల నుండి బస్సు, పాదయాత్రలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మార్చి మొదటి వారంలో అసెంబ్లీని ముట్టడిస్తామని, రాయలసీమలోని సమస్యలు పరిష్కరించాలని, ప్రత్యేక రాయలసీమ అన్నది వ్యర్థమైన డిమాండ్ అని తెలిపారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాయలసీమకు అదనంగా నిధులు కేటాయించాలన్నారు. మంచినీటి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

మాస్టర్‌ప్లాన్‌పై రైతుల్లో ఆగ్రహం..

రాజధాని ప్రాంత రైతుల్లో అగ్రహం పెరుగుతోంది. ప్రభుత్వమిచ్చిన హమీలేమీ అమలుకు నోచకపోగా జరీబులో భూములిచ్చిన వారికి మెట్ట ప్రాంతంలో భూములు కేటాంచాలని నిర్ణయించడం, వేలకోట్లతో నిర్మిస్తామని చెబుతున్న రాజధాని తొలి తాత్కాలిక నిర్మాణానికే అప్పు తీసుకోవాలని నిర్ణయించడం వంటి విషయాలతో రైతుల్లో అనుమానాలతోపాటు ఆగ్రహమూ పెరుగుతోంది. జరీబు రైతులకు వారి గ్రామాల్లో భూములివ్వబోమని చెప్పడంతో మందడం రైతులు సిఆర్‌డిఏ కార్యాలయంలోనే మాస్టర్‌ప్లాను నకలు కాపీని చించిపారేశారు. అక్కడ భూములిస్తే మాస్టర్‌ప్లాన్‌కు ఇబ్బందని, పక్కకు వెళ్లిపోవాల్సిందేనని సిఆర్‌డిఏ అధికారులు తేల్చిచెప్పారు.

ఆంధ్రప్రదేశ్‌ - అద్దె సచివాలయం

ఆంధ్రపదేశ్‌ రాష్ట్ర తాత్కా లిక సచివాలయాన్ని మంగళగిరిలోని అమరావతి టౌన్‌షిప్‌లో 20 ఎకరా లలో నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు రూ.180 కోట్లు ఖర్చవుతుందని, ఈ మొత్తంలో రూ.90 కోట్లు వడ్డీలేని రుణం ఇస్తారని, మరో రూ.90 కోట్లు రుణాలు తీసుకొని సిఆర్‌డిఎ నిర్మాణాలను పూర్తి చేస్తుందని, నిర్మాణం పూర్తయి, వివిధ ప్రభుత్వ శాఖలు ఆ భవనాలలోకి వచ్చిన తర్వాత, ఆయా ప్రభుత్వ శాఖలు వినియోగించుకున్న విస్తీర్ణాన్ని బట్టి సిఆర్‌డిఎకు అద్దె చెల్లించాల్సి ఉంటుందని ప్రకటించారు.

సిపిఎం ప్లీనం-బడా మీడియా పాక్షిక రూపం

భారత కమ్యూనిస్టు పార్టీ(మార్క్సిస్టు) నిర్మాణంపై ప్రత్యేక ప్లీనం సమావేశం జయప్రదంగా ముగిసింది. ప్రతినిధుల నుంచి వచ్చిన కొన్ని సవరణలతో నిర్మాణంపై తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. అన్ని రాజకీయ పక్షాలూ అంతర్గత కలహాలతో అతలాకుతలమవుతున్న స్థితిలో-కమ్యూనిస్టు ఉద్యమం కూడా సంక్లిష్టమైన సవాళ్లను ఎదుర్కొంటున్న స్థితిలో-సిపిఎం బలం లోక్‌సభలో ఎన్నడూ లేనంత తక్కువకు పడిపోయిన దశలో- ఈ అఖిల భారత సమావేశం ఇంత ఏకోన్ముఖంగా జరగడం ఒక విశేషం.

విద్యార్థులపై రాజధాని రుసుం..

రాజధాని నిర్మాణానికి ప్రతి విద్యార్థి, ఉపాధ్యాయుల నుంచి తలో రూ.10 చొప్పున వసూలు చేయాలని జిల్లా విద్యాశాఖాధికారులకు రాష్ట్ర ప్రభుత్వం మెమో జారీ చేసింది. 'నా రాజధాని నా అమరావతి నా ఇటుక' కార్యక్రమంలో భాగంగా ఈ వసూళ్లు చేయాలంది. ఈనెల 10లోగా ఈ వసూళ్లు పూర్తి చేసి, ముఖ్యమంత్రికి అందజేయాలని మోమోలో పేర్కొన్నారు.

హక్కుల రక్షణకు కమిషన్‌:VSR

హక్కుల రక్షణకు జాతీయ స్థాయిలో కమిషన్‌ ఏర్పాటుచేయాలని దళిత్‌ శోషణ్‌ ముక్తి మంచ్‌ జాతీయ కన్వీనర్‌ వి.శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. 'మారుతున్న రాజకీయ నేపథ్యంలో దళితులు, గిరిజనులు కర్తవ్యం' అనే అంశంపై సోమవారం ఉక్కునగరంలోని సిఐటియు కార్యాలయంలో జరిగిన సెమినార్‌కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాజకీయ పదవుల్లో ఉన్న ఎంతటి వారైనా శిక్షలు పడితేనే వివక్ష అంతమవుతుందన్నారు. ప్రస్తుత ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాల వల్ల రిజర్వేషన్లు నిర్వీర్యం అవుతున్నాయని, ఈ తరగతులకు ఉన్న హక్కులు పోతున్న తరుణంలో కాపాడుకునేందుకు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు

దేశంలోనే అగ్రగామిగా త్రిపుర స్టేట్

ఆదివాసీ చట్టాల అమలు, అభివృద్ధిలోనూ త్రిపుర రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా ఉన్నదని, మార్క్సిస్టు పాలన వల్లే ఇది సాధ్యమైందని ఆ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మాజీ మంత్రి, పార్లమెంట్‌ సభ్యులు జితిన్‌ చౌదరి తెలిపారు.మార్క్సిస్టు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముందుగా భూమి బదలాయింపు నిషేధి త చట్టాన్ని అమలు చేసిందని, ఆదివాసీల భూమిని ఆదివాసేతరులు కొనకుండా కట్టడి చేసిందన్నారు. రాష్ట్రంలో పకడ్బందీగా భూసంస్కరణలు అమలు చేసిందని, భూమి లేని నిరుపేద లందరికీ భూములు పంచిందని తెలిపారు. 

గిరిజనసంఘంఅధ్యక్షులుగా రాజయ్య

తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర తొలి మహాసభలు ఉట్నూర్‌లోని హెచ్‌కేఎన్‌ గార్డెన్‌లో సోమవారం ముగిశాయి. చివరి రోజున తెలగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రతినిధుల మహాసభల సందర్భంగా రాష్ట్ర నూతన కమిటీని ఎన్నుకున్నారు. 25 మందికి కమిటీలో స్థానం కల్పించారు. అధ్యక్షులుగా మరోసారి సున్నం రాజయ్య ఎన్నికకాగా, ప్రధాన కార్యదర్శిగా తొడసం భీంరావును ఎన్నుకున్నారు. 

మోడీని టార్గెట్ చేసిన శివసేన

ప్రధాని మోడీపై శివసేన మరోసారి నిప్పులు చెరిగింది. పఠాన్‌కోట్‌లో ఉగ్రవాదుల దాడిపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు మోడీ పాక్‌కు వెళ్లకుండా ఉంటే ఈ ఘటన జరిగేది కాదని తన అధికార పత్రిక సామ్నాలో విమర్శించింది. ఇద్దరు నేతలు కలిసి టీ తాగిన ఫలితం.. ఏడుగురు సైనికులు బలయ్యారని ఆరోపించింది. 

Pages

Subscribe to RSS - January