January

120అడుగుల మావో గోల్డెన్‌ స్టాట్యూ

మ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ చైనా వ్యవస్థాపకులు మావో జిడాంగ్‌ భారీ విగ్రహాన్ని చైనాలో నిర్మించారు. 120 ఫీట్లు (36.6 మీటర్ల) ఎత్తైన గోల్డెన్‌ విగ్రహానికి 3 మిలియన్‌ యువాన్లు (3 కోట్ల 60లక్షలకుపైగా) ఖర్చయినట్లు నిర్వాహకులు తెలిపారు.మావో విగ్రహాన్ని పేద కళకారులు తయారుచేయడం విశేషం. 

భారత్‌-పాక్ చర్చలపై సందిగ్ధత..

పంజాబ్లోని పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో భారత్‌-పాకిస్తాన్‌ల మధ్య చర్చలపై సందిగ్ధం ఏర్పడింది. ఇరు దేశాల మధ్య విదేశాంగ కార్యదర్శుల స్థాయి చర్చలు జనవరి 14,15న ఇస్లామాబాద్‌లో జరగాల్సి ఉంది. అయితే పఠాన్‌కోట్‌లో దాడి జరిపిన ఉగ్రవాదుల మూలాలు పాక్‌లోనే ఉన్నాయని ఇప్పటికే భారత నిఘావర్గాలు ప్రాథమిక నిర్ధారణకు వచ్చాయి. పాక్ అధికార వర్గాలు ఉగ్రవాదంపై స్పష్టమైన వైఖరి పాటించకుండా ఓ వైపు చర్చలు అంటూ స్నేహహస్తం అందిస్తూనే.. మరో వైపు ఉగ్రమూకలకు సహకరిస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఫ్రీ బేసిక్స్‌తో డిజిటల్‌ బానిసత్వం

ఫ్రీ బేసిక్స్‌ వినియోగదారులను కొన్ని వెబ్‌సైట్లకు మాత్రమే పరిమితం చేస్తుంది.    వినియోగదారులు ప్రత్యక్షంగా లాభపడేలా ఇంటర్నెట్‌ ప్యాకేజీలను అందించటం మంచి పథకం. బీహార్‌లోని ముజఫర్‌నగర్‌ జిల్లా, రత్నౌలీ గ్రామానికి చెందిన సంజరు సాహ్ని పాఠశాల విద్యను మధ్యలోనే ఆపేసి ఢిల్లీలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. అతను తన గ్రామానికి ఎప్పుడు వచ్చినా తమకు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పని చేయటానికి జాబ్‌ కార్డులు అందలేదనో, చేసిన పనికి వేతనాలు అందలేదనో గ్రామస్తుల నుంచి ఫిర్యాదులు వింటుండేవాడు. ఒకరోజు ఆయన ఢిల్లీలో కంప్యూటరు ముందు కూర్చొని ''యన్‌రీగా బీహార్‌'' అని టైప్‌ చేశారు.

బలవంతపు భూసేకరణను వ్యతిరేకిస్తూ పాదయాత్ర..

కృష్ణాజిల్లా గన్నవరం నియోజవర్గంలోని పలు గ్రామాల్లో ప్రభుత్వం చేపట్టిన అనవసరపు భూసేకరణకు వ్యతిరేకంగా సోమవారం వామపక్షాల ఆధ్వర్యాన 25 కిలో మీటర్ల పాదయాత్ర జరిగింది.రైతులకు ఇష్టం లేకుండా విజయవాడ మెట్రో రైల్‌ కోచ్‌ డిపోను నిడమానూరులో ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోంది. ఏలూరు కాలువ మళ్లింపు ప్రతి పాదననూ విరమించుకోవాలి. తుళ్లూరు రైతుల కంటతడి ఆరకముందే నిడమానూరు, గన్నవరాల్లో బలవంతంగా భూములు గుంజుకోవడానికి ప్రయత్నించడం శోచనీయం. బలవంతపు భూ సేకరణను నిలిపివేయాలి.

ఉగ్ర దాడులపై మోడీ సమీక్ష్య

పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌ వైమానిక స్థావరం, ఆఫ్ఘనిస్థాన్‌లో భారత దౌత్య కార్యాలయంపై ముష్కరుల దాడిపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈరోజు సమీక్ష నిర్వహించారు. మోడీ నివాసంలో జరిగిన ఈ సమావేశానికి రక్షణశాఖ మంత్రి మనోహర్‌ పారికర్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌, విదేశాంగ కార్యదర్శి జయశంకర్‌ సహా పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. 

బర్ధన్‌కు సీపీఎం నేతల సంతాపం..

కమ్యూనిస్టు కురువృద్ధుడు ఏబీ బర్ధన్‌కు వివిధ పార్టీలు, నేతలు ఘనగా నివాళులు అర్పించాయి. వామపక్ష ఉద్యమానికి బర్దన్‌ మృతి తీరని లోటని లెఫ్ట్‌ పార్టీలు సంతాపం వ్యక్తం చేశాయి.బర్ధన్‌ మృతిపట్ల సీపీఎం ప్రధాన నాయకులు సీతారాం ఏచూరి, బి.వి. రాఘవులు, తమ్మినేని వీరభద్రం,పి.మధుతో పాటు పలువురు సంతాపం వ్యక్తం చేశారు.

సిపిఐ సీనియర్‌ నేత బర్దన్‌ ఇక లేరు..

భారత దేశం ఓ మహోన్నత నేతను కోల్పోయింది. రాజకీయాల్లో విశిష్ట ఖ్యాతిని ఆర్జించిన సిపిఐ సీనియర్‌ నేత ఏబీ బర్దన్‌ మనకిక లేరు. కమ్యూనిస్ట్‌ నేతగా ఉంటూనే ఎంతోమంది ఇతర పార్టీల నాయకులకు ఆయన మార్గదర్శకుడిగా మెలిగారు. బర్దన్‌ కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. న్యూఢిల్లీలోని జీబీ పంత్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి కన్నుమూశారు. సిపిఐ జాతీయ కార్యదర్శిగా ఆయన చాలాకాలం పనిచేశారు. బర్దన్‌ మృతిపట్ల సిపిఎం రాష్ట్ర కమిటీ  ప్రగాఢసానుభూతి వ్యక్తం చేసింది.

Pages

Subscribe to RSS - January