January

GSTపై సోనియాతో వెంకయ్య భేటీ..

జీఎస్టీ బిల్లు ఆమోదానికి సానుకూల నిర్ణయం తీసుకుంటే బడ్జెట్‌ సమావేశాలను ముందే ప్రారంభించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని వెంకయ్య నాయుడు కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీతో అన్నారు. గురువారం ఢిల్లీలో సోనియా గాంధీని వెంకయ్యనాయుడు కలిశారు. జీఎస్టీ బిల్లుపై కాంగ్రెస్‌ లేవనెత్తిన మూడు అంశాలపై ఇప్పటికే ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ సవివరంగా సమాధానం చెప్పారని, కాబట్టి బిల్లు ఆమోదానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. 

అంగన్‌వాడీలను వర్కర్లుగా:తపన్‌సేన్‌

ఆలిండియా ఫెడరేషన్‌ ఆఫ్‌ అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌్‌ సిల్వర్‌జూబ్లీ ఉత్సవాల సందర్భంగా నాలుగు రోజుల పాటు జరిగే 8వ మహాసభ గురువారం హైదరాబాద్‌లోని ఆర్టీసి కళాభవన్‌ (కామ్రేడ్‌ దీపామాలిక్‌ మంచ్‌, కామ్రేడ్‌ ఆర్తీదాస్‌ గుప్తా హాల్‌)లో ఉత్సాహంగా ప్రారంభమైంది.ఆరోగ్యవంతమైన భావి భారతావనికి కృషి చేస్తున్న అంగన్‌వాడీలు తమను వలంటీర్లుగా కాకుండా వర్కర్లుగా గుర్తించాలని రోడ్డున పడి పోరాటం చేయాల్సి రావడం దురదృష్టకరమని సీఐటీయూ అఖిల భారత ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్‌ అన్నారు. ఇలాంటి కీలకమైన భాద్యత నిర్వర్తిన్తున్న అంగన్‌వాడీల సమస్యలపై పాలకులు సానుకూలంగా స్పందించకపోవడం సరికాదని చెప్పారు.

సందీప్‌ పాండేపై RSS వేటు..

విద్య, భావజాల రంగాల్లో హిందూత్వ శక్తులు పేట్రేగిపోతున్నాయి.తాజాగా బనారస్‌ హిందూ విశ్వవిద్యాలయానికి చెందిన ఐఐటీ ప్రముఖ సామాజిక కార్యకర్త, మెగసెసే అవార్డు గ్రహీత సందీప్‌ పాండేను బోధనా బాధ్యతల నుంచి తొలగించింది. సందీప్‌ ఈ ప్రతిష్టాత్మక విద్యా సంస్థలోని మెకానికల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో గెస్ట్‌ ఫ్యాకల్టీగా ఉన్నారు. ఆయన 'అవాంఛనీయ కార్యకలాపాలకు' పాల్పడుతున్నారని అధికారులు ఆరోపించారు. కాగా, తనను వెళ్లగొట్టడం వెనుక ఆర్‌ఎస్‌ఎస్‌ హస్తముందని సందీప్‌ పాండే ఆరోపించారు. 

బర్ధన్‌ కష్టజీవుల పక్షపాతి:మధు

సిపిఐ రాష్ట్ర సమితి బర్ధన్‌ సంస్మరణ సభ ను విజయవాడలోని దాసరి నాగభూషణరావు భవన్‌లో గురువారం నిర్వహించింది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు మాట్లా డుతూ బర్ధన్‌ కార్మికులు, కష్టజీవుల పక్షపాతని పేర్కొంటూ నివాళులర్పించారు. నమ్మిన సిద్ధాం తాల కోసం అలుపెరగని పోరాటం చేశారన్నారు. యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 1991నాటి నూతన ఆర్థిక విధానాలు, ప్రపంచీకరణ విధానాలకు తిలోదకాలు పలకాలని చెప్పిన వారిలో బర్థన్‌ ఒకరని తెలిపారు. 

విశాఖపట్నంకు ప్రత్యేక రైల్వే జోన్‌ ఏర్పాటు చేయాలి. ఈ నెల 13 నుండి కొత్తగా హౌరా - యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ (02863) కు విశాఖలో హాల్ట్‌ ఏర్పాటు చేయాలి. - సిపియం జిల్లా కార్యదర్శి కె.లోకనాధం

                 ఈ సంవత్సరంలో ప్రవేశపెట్టే రైల్వే బడ్జెట్‌లో విశాఖపట్నంకు ప్రత్యేక రైల్వేజోన్‌ ప్రకటించాలి. రైల్వేపరంగా విశాఖపట్నంకు జరుగుతున్న అన్యాయాన్ని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలి. నిన్న రైల్వే అధికారుతో జరిగిన రాష్ట్ర ఎం.పి.ల సమావేశంలో ఎం.పి.లే అసంతృప్తి చెందారంటే రైల్వేపరంగా ఆంధ్ర రాష్ట్రానికి ఎంత అన్యాయం జరుగుతుందో అర్ధమౌతుంది. విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రగల్భాలు పుకుతుంది తప్ప, దానికి కావల్సిన మౌళిక రవాణా సదుపాయం అయిన రైల్వే జోన్‌ సాధించడంలో పూర్తిగా వైఫ్యలం చెందింది.

నాడు ద్వేషం..నేడు ప్రేమా? :VH

తెలంగాణ రాకముందు టీఆర్‌ఎస్‌ నేతలు సీమాంధ్రులను రెచ్చగొట్టి నేడు ఎన్నికల వేళ.. ప్రేమ కురిపిస్తున్నారని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, ఎంపీ వి.హనుమంతరావు విమర్శించారు. టీఆర్‌ఎస్‌ నేతలు సినిమా వారిని బ్లాక్‌ మెయిల్‌ చేసిన ఘటనను ప్రజలు మరువరని అన్నారు. సీమాంధ్రులపై టీఆర్‌ఎస్‌ నేతలన్న వ్యాఖ్యలను విడుదల చేస్తామని చెప్పారు. ప్రభుత్వ లోపాలపై గవర్నర్‌ నరసింహన్‌ స్పందించడం లేదని ఆరోపించారు.

లిక్కర్ పాలసీపై బ్రిందా ఫైర్..

విజయవాడలోని హనుమంతరాయ గ్రంథాలయంలో మద్యపాన నిషేదంపై జరిగిన సదస్సులో  పాల్గొన్న సీపీఎం మహిళా నాయకురాలు బృందాకారత్ మాట్లాడుతూ జన్మభూమిని మద్యం భూమిగా చంద్రబాబు నాయుడు మార్చేశారని విమర్శించారు. ఆదాయం కోసం మద్యాన్ని వాడుకోవడం సిగ్గుచేటని అన్నారు.

నష్టాలతో స్టాక్ మార్కెట్లు

చైనా స్టాక్ మార్కెట్ల పతనం భారత స్టాక్‌మార్కెట్లపై స్పష్టంగా కనిపించింది. స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 554 పాయింట్లు నష్టపోయి 24,851 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 172 పాయింట్లు నష్టపోయి 7,568 వద్ద ముగిసింది. కాగా, హైదరాబాద్ నగర బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.26,140కి అమ్ముడు పోతోంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.24,310కి అమ్ముడు పోతోంది. కిలో వెండి ధర రూ.36,112కు అమ్ముడవుతోంది.

రాయల సీమ జిల్లా సమస్యల ఫై ప్రజా ఉద్యమం

 6.1.2016తేదీన చిత్తూర్ జిల్లా తిరుపతిలోని సిపియం  పార్టీ  కార్యాలయంలో  రాయల సీమ జిల్లాలకు చెందినా  సిపియం కమిటీ సబ్యులతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి  రాష్ట్ర కార్యదర్శి పి. మధు గారు, కేంద్ర కమిటీ సబ్యులు యం. ఎ. గాఫ్ఫూర్ గారు, రాయల సీమ అభివృది సబ్ కమిటీ కన్వినర్ ఓబులు గారు, హాజారు ఐయరు.

Pages

Subscribe to RSS - January