January

రోహిత్‌ ఆత్మహత్య ఘటనపై ఆందోళన..

రోహిత్‌ ఆత్మహత్య ఘటనపై సిపిఎం అధ్వర్యంలో విజయవాడలో ఆందోళనలు కొనసాగుతున్నాయి.కేంద్రమంత్రుల దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. కర్నూలులో కూడా సీపీఎం ఆధ్వర్యంలో నిరసనలు కార్యక్రమాలు నిర్వహించారు. రోహిత్‌ కుటుంబానికి 5కోట్ల రూపాయల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని సీపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభాకర్‌ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వం వివక్ష చూపడంవల్లే రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు ఆరోపించారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వం చేసిన హత్యేనని ఆయన మండిపడ్డారు. రోహిత్‌ కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా చెల్లించి ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.

రాయలసీమ వెనుకబాటుకు కారకులెవరు?

స్వార్థ రాజకీయమే సీమకు శాపం అనే శీర్షికన ఆంధ్రజ్యోతిలో ఒక వ్యాసం ప్రచురిత మైంది. శీర్షికకు పెట్టిన పేరు అక్షరసత్యం. అయితే రచయిత వ్యాసం నిండా అర్థసత్యాలు, అసత్యాలు తప్ప ఏ ఒక్కటీ నిజం కాదు. చంద్ర బాబు అధికారానికి వచ్చిన తర్వాత అహరహం వెనుకబడిన సీమ అభివృద్ధి కోసమే కష్టపడుతు న్నట్లు చెప్పారు. ఆర్థిక, పారిశ్రామిక, మౌళిక సదుపాయాల కొరకు ఆర్థిక ఇబ్బందులలో కూడా అడ్డంకులను అధిగమించి కృషి చేస్తున్నార న్నారు. ఆర్థిక వికేంద్రీకరణను గురించి ప్రస్తావిస్తూ రాయల సీమలో పారిశ్రామికీకరణకు కృషి చేస్తున్నట్లు అందులో పేర్కొ న్నారు.

రోహిత్ మరణానికి కారణమయిన వారిని కటినంగా శిక్షించాలి .

రోహిత్ మరణానికి కారణమయిన  వారిని కటినంగా శిక్షించాలని అఖిల పక్ష్యం, ప్రజసంగల అద్వర్యం లో తిరుపతి సి పి యం ఆఫీసు లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.

ప్రజా పోరాటాలతో తిప్పికొడతాం - సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు నర్సింగరావు

                 బాక్సైట్‌ వ్యతిరేక పోరాటంలో చురుగ్గా పాల్గొన్న గిరిజనులను మావోయిస్టులతో సంబంధాలున్నాయని ముద్రవేసి అక్రమ అరెస్టులకు పాల్పడడం దుర్మార్గమని, బలమైన ప్రజాపోరాటాల ద్వారా ప్రభుత్వ చర్యలను తిప్పికొడతామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.నర్సింగరావు హెచ్చరించారు. జర్రెల మాజీ సర్పంచ్‌ వెంకటరమణను మావోయిస్టులు హత్య చేసిన తరువాత ఏజెన్సీలో పోలీసులు తీవ్ర నిర్బంధం ప్రయోగించి మావోయిస్టు కార్యకలాపాలతో సంబంధంలేని గిరిజన యువతను వేధింపులకు గురిచేసి, అక్రమ అరెస్టులు చేయడం సరికాదన్నారు.

రోహిత్‌ ఆత్మహత్యపై ఆందోళన...

హెచ్‌సీయూలో పీహెచ్‌డీ విద్యార్థి రోహిత్‌ ఆత్మహత్యపై దేశ రాజధాని అట్టుడుకుతోంది. విద్యార్థి సంఘాలు ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈరోజు జంతర్‌మంతర్‌ వద్ద పలు విద్యార్థి సంఘాలు ధర్నా చేపట్టారు. రోహిత్‌ ఆత్మహత్యకు బాధ్యులపై కఠినచర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్‌ చేశారు. ఆందోళన చేపట్టిన విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

AP తాత్కాలిక సచివాలయం?

ఏపీ తాత్కాలిక సచివాలయం ఎక్కడ..? ఈ ప్రశ్నకు రేపటిలోగా స్పష్టత రానుంది. సీడ్‌ కేపిటల్‌ మధ్యలోనే తాత్కాలిక సచివాలయం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే.. భవిష్యత్తులో సమస్యలు రాకుండా... వివిధ ప్రాంతాల్లో భూసార పరీక్షలూ చేయించింది. దీనికి సంబంధించిన రిపోర్ట్‌ చేతికందడంతో.. తాత్కాలిక సచివాలయంపై ఇవాళ తుది ప్రకటన వచ్చే అవకాశముంది..

పరువునష్టంపై కేజ్రీ ఘాటుగా..

తనపై జైట్లీ వేసిన పరువునష్టం దావాపై కేజ్రీవాల్ ఘాటుగానే స్పందించారు. సుమారు 2 వేల పేజీలతో కూడిన సమాధాన పత్రాలను ఢిల్లీ హైకోర్టుకు సమర్పించారు. అనంతరం కమల నేతపై తనదైన స్టయిల్‌లో సెటైర్లు విసిరారు. పరువు నష్టం దావా వేసిన వ్యక్తికి ప్రజల్లో ఎలాంటి ఆదరణ లేదని మీడియా ముందే జైట్లీ పరువు తీశారు. ఆయనకు పరువు ఉంటే కదా..! పరువు నష్టం కేసు వేయడానికి, తనను తాను కాపాడుకోవడానికే... తనపై ఈ కేసు వేశారని ఢిల్లీ సీఎం ఆరోపించారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో అమృత్‌సర్‌లో లక్ష ఓట్ల తేడాతో జైట్లీ ఓడిపోయారని కేజ్రీవాల్ గుర్తుచేశారు.

SCనిర్ణయాన్నిసమర్థించినCPM

శబరిమలై ఆలయంలోకి మహిళలను నిషేధించడంపై సుప్రీంకోర్టు కేరళ ప్రభుత్వం, ఆలయబోర్డును ప్రశ్నించడాన్ని సిపిఎం స్వాగతించింది. 2008లో సిపిఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్‌ అధికారంలో ఉండగా అయ్యప్ప ఆలయ ప్రవేశం కల్పించాలని కోరుతూ కొందరు మహిళలు వేసిన పిటిషన్‌కు తాము మద్దతిచ్చామని గుర్తు చేసింది. కాంగ్రెస్‌ నేతృత్వంలోని యుడిఎఫ్‌ ప్రభుత్వం  పిటిషన్‌పై ఎందుకు అభ్యంతరం చెబుతోందని ప్రశ్నించింది. మహిళలకు ఆలయ ప్రవేశం రాజ్యాంగ హక్కని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకరత్ పేర్కొన్నారు..

దళిత విద్యార్థుల సస్పెన్షన్ పైSFI

హైదరాబాద్‌లోని సెంట్రల్‌ వర్సిటీలో ఐదుగురు దళిత విద్యార్థులపై సస్పెన్షన్‌ ఎత్తివేయాలని మంగళవారం పలు చోట్ల ఆందోళనలు చేశారు. రౌండ్‌ టేబుల్‌ సమావేశం, దిష్టిబొమ్మల దహనం, వినతిపత్రాలు తదితర కార్యక్రమాలు నిర్వహించారు. బండారు దత్తాత్రేయను బర్తరఫ్‌ చేయాలని, వీసీని బాధ్యతల నుంచి తప్పించాలని డిమాండ్‌ చేశారు.విద్యార్థులను బహిష్కరించడం హేయమైన చర్య అని భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ) రాష్ట్ర కమిటీ సభ్యులు డీ మల్లేష్‌ మంగళవారం ఒక ప్రకటనలో విమర్శించారు. దీనికి నిరసనగా బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహించనున్నట్టు తెలిపారు.

Pages

Subscribe to RSS - January