January

సింగపూర్‌ మాస్టర్‌ప్లాన్‌ నమూనాల దహనం

సింగపూర్‌ మాస్టర్‌ ప్లాన్‌ సమూ లంగా మార్చాలని, వ్యవ సాయ పరిరక్షణ జోన్‌లో ఆంక్షలు ఎత్తివేయాలని CRDA కార్యాలయం వద్ద ధర్నా జరిగింది. మాస్టర్‌ప్లాన్‌ నమూనాలను రైతులు, నాయకులు దహనం చేశారు. వ్యవసాయ జోన్ల పేరుతో కృష్ణా, గుంటూరు జిల్లాల రైతులకు సిఆర్‌డిఎ ఉరి తాడు బిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. సిఆర్‌డిఎ చైర్మన్‌గా ఉన్న ముఖ్యమంత్రే బాధ్యత వహించాలన్నారు. పారిశ్రామిక వేత్తలు, అధికార పార్టీ నాయకులతో సహా అన్ని వర్గాల ప్రజలు ముక్తకంఠంతో మాస్టర్‌ప్లాన్‌ తిరస్కరిస్తున్నారని, స్వదేశీ నిపుణులతో మాస్టర్‌ప్లాన్‌ రూపొందించాలని డిమాండ్‌ చేశారు.

అట‌వీ భూములివ్వం:కేంద్రం

  రాజధాని చుట్టు పక్కల 33,500 హెక్టార్ల (83,750 ఎకరాలు) అటవీ భూమిని రాజధానికి ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతూ లేఖ రాసిన విషయం తెలిసిందే. ఏపీ రాజధానికి అటవీ భూములివ్వబోమని కేంద్రం తేల్చి చెప్పింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది.

యూనివర్సిటీల బంద్ కు పిలుపు ..

హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయు)లో వివక్షపై పోరు రోజురోజుకు ఉధృతమవుతోంది.హెచ్‌సీయు వెలివాడలో నిర్వహించిన సభలో వివిధ ప్రజా, దళిత, విద్యార్థి, కార్మిక సంఘాల నాయకులు పాల్గొని విద్యార్థులకు సంఘీభావం ప్రకటించారు. మరోవైపు భవిష్యత్‌ కార్యాచరణలో భాగంగా బుధవారం దేశవ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాల బంద్‌కు హెచ్‌సీయు జేఏసీ పిలుపునిచ్చింది. 

డెక్కన్‌ కెమికల్ కంపెనీ విస్తరణ అనుమతులు నిలిపేయాలి. ఫిబ్రవరి 23న ప్రజాభిప్రాయసేకరణను రద్దు చేయండి - జిల్లా కలెక్టర్‌కు సిపిఎం జిల్లా కార్యదర్శి లోకనాథం లేఖ

            విశాఖ జిల్లా పాయకరావుపేట మండలం డెక్కన్‌ ఫైన్‌ కెమికల్స్‌ కంపెనీ విస్తరణ ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని, దీని కోసం వచ్చే నెల 23న నిర్వహించబోయే ప్రజాభిప్రాయసేకరణను రద్దు చేయాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌.యువరాజ్‌ను సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం కోరారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్‌కు లోకనాథం రాసిన లేఖను పత్రికలకు విడుదల చేశారు. 'భద్రతా చర్యలు పాటించకపోవడంతో తరచూ డెక్కన్‌ కెమికల్‌ కంపెనీలో ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు.

విలీన మండలాల్లో అభివృద్ధిపై

భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని విలీన మండలాల్లో పంచాయతీరాజ్‌ శాఖ ద్వారా అభివృద్ధి పనులపై దృష్టిపెట్టాలని భద్రాచలం ఎంఎల్‌ఎ సున్నం రాజయ్య కోరారు. ఈ మేరకు తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని పంచాయతీరాజ్‌ ఎస్‌ఇ వెంకటేశ్వరరావును సోమవారం కలిశారు. సిపిఎం జిల్లా కార్యదర్శి దువ్వా శేషబాబ్జితో కలిసి సమస్యలను వివ రించారు.

ఊళ్లకు ఊళ్లే మారొచ్చు:బాబు

రాజధాని ప్రాంతంలో సమస్యల పేరుతో రైతులు తిరగ బడితే వారికే నష్టమని, కొద్దిమంది పనీపాటా లేనివాళ్లు మాత్రమే అక్కడ అల్లరి చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. రాజధాని ప్రాంతంలో రైతులకున్న రుణమాఫీ మొత్తం రద్దు చేస్తానని తాను చెప్పలేదని, వన్‌టైం సెటిల్‌మెంట్‌ కింద రూ.1.50 లక్షల మాత్రమే ఇస్తానని చెప్పానని అన్నారు.రోడ్లవల్ల కొద్ది ఇళ్లు పోతాయని, ఆందోళన చేపడితే భవిష్యత్‌లో జరిగే మార్పులకు ఊళ్లకు ఊళ్లే మార్చాల్సిన పరిస్థితి రావచ్చని తెలిపారు..

RSSపై పరోక్ష్యంగా మాజీ జస్టిస్ విమర్శలు

ఆర్‌ఎస్‌ఎస్‌కు భయపడి ఏ ఒక్కరికో ఓట్లు వేయొద్దని ముస్లింలకు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఏఎం అహ్మదీ పరోక్షంగా సూచించారు. ‘‘నిక్కర్లు ధరించి చేతిలో లాఠీలు పట్టుకొని రోడ్లపైకి వచ్చేవారిని చూసి భయపడకండి. ప్రజల్లో భయాన్ని రేకెత్తించేందుకు కేవలం ఎన్నికల సమయంలోనే వారు బయటకు వస్తారు. అది ఎన్నికల ప్రక్రియలో భాగం’’ అని ఆర్‌ఎస్‌ఎస్‌ పేరు ప్రస్తావించకుండా అహ్మదీ పేర్కొన్నారు. 

అభివృద్ధి మంత్రం - అసలు తంత్రం!

ఈ మధ్య విజయవాడ పుస్తక ప్రదర్శనలో ప్రసంగించిన తర్వాత నాతో మాట్లాడిన వారిలో ఇద్దరు విద్యాధికులు ఒక అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రసంగం ప్రధాన భాగాన్ని అభినందిస్తూనే అమరా వతిని భ్రమరావతి అని వర్ణించడం ఎందు కని వారు ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏదో ఒకటి చేస్తే మంచిదే కదా అని అడిగారు. అమరావతిపై అనేకసార్లు ఈ శీర్షికలో చెప్పుకున్నాం. మొన్నటి మంత్రి వర్గ సమావేశం తర్వాత ఒక సీనియర్‌ మంత్రితో మాట్లాడితే ముఖ్యమంత్రి సింగపూర్‌పై చాలా ఆశలు పెట్టుకున్న మాట నిజమైనప్పటికీ వారి నుంచి అంత సహకారం రాలేదని చెప్పారు. ఈ కారణంగా హడ్కో రుణ సహాయంతో తామే నిర్మాణం చేపట్టవచ్చని సూచించారు.

బిసిల సంక్షేమానికి సబ్‌ప్లాన్‌ ఏర్పాటు చేయాలి - ప్రొఫెసర్‌ దుర్గాప్రసాద్‌, జమలయ్య డిమాండ్‌

రాష్ట్రంలోని వెనుకబడిన తరగతుల సంక్షేమానికి సబ్‌ప్లాన్‌ ఏర్పాటు చేయాలని, బిసిలకు ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని బిసి సబ్‌ప్లాన్‌, ప్రయివేటు రంగంలో రిజర్వేషన్ల సాధన వేదిక రాష్ట్ర గౌరవ సలదారులు ప్రొఫెసర్‌ ఎ.దుర్గాప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. పోరాట వేదిక ఆధ్వర్యంలో, జిల్లా గొర్రెల పెంపకందారుల సహకార సంఘాల యూనియన్‌ ఛైర్మన్‌ గంటా శ్రీరామ్‌ అధ్యక్షతన స్థానిక వివేకానంద హాలులో ఆదివారం జిల్లా సదస్సు జరిగింది. ఇందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న దుర్గాప్రసాద్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో 50శాతానికి పైగా ఉన్న బిసిల్లో అత్యధిక మంది సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా వెనుకబడి ఉన్నారన్నారు.

Pages

Subscribe to RSS - January