
తెలంగాణ రాకముందు టీఆర్‌ఎస్ నేతలు సీమాంధ్రులను రెచ్చగొట్టి నేడు ఎన్నికల వేళ.. ప్రేమ కురిపిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ వి.హనుమంతరావు విమర్శించారు. టీఆర్‌ఎస్ నేతలు సినిమా వారిని బ్లాక్ మెయిల్ చేసిన ఘటనను ప్రజలు మరువరని అన్నారు. సీమాంధ్రులపై టీఆర్‌ఎస్ నేతలన్న వ్యాఖ్యలను విడుదల చేస్తామని చెప్పారు. ప్రభుత్వ లోపాలపై గవర్నర్ నరసింహన్ స్పందించడం లేదని ఆరోపించారు.