District News

ప్రభుత్వం చేసే మోసకారి పనులు ఇప్పుడిప్పుడే నూతన రాజధానిగా ప్రకటించిన అమరావతి 29 గ్రామాల్లో ప్రజలకు అర్థమవుతున్నాయి. తమ ప్రభుత్వం అని నమ్మి భూములిచ్చిన రైతులకు ప్రస్తుతం గ్రామకంఠాల విషయమై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో వారిలో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకుంటున్నాయి. గ్రామాల్లో మంత్రులను మేళతాళాలతో ఊరేగించిన ప్రజలే ఇళ్లల్లో పెట్టి కదలడానికి వీల్లేదని నిర్బంధిస్తున్నారు. గ్రామకంఠాల విషయమై ఎటూ తేల్చకపోతే ప్రభుత్వ వ్యవహారాన్ని తేలుస్తామని తెగేసి చెబుతున్నారు. మొదట్లో రాజధాని నిర్మాణానికి భూములు తీసుకుంటామని, గ్రామాలను కదపబోమని, 2014 డిసెంబరులో శాటిలైట్‌ సర్వే నిర్వహించామని, దాని ప్రకారం బ్రిటీష్‌ కాలం నాటి గ్రామకంఠాలతో కలుపుకొని ఇప్పుడు...

ఏపీ రాజధాని కోసం ప్రభుత్వం భూసేకరణను వెంటనే విరమించుకోవాలని సీపీఎం ఎపి రాష్ట్రకార్యవర్గ సభ్యుడు బాబురావు డిమాండ్ చేశారు. గ్రామ కంఠాల పరిధిని విస్తరింపచేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ. సీఆర్డీఏ కార్యాలయాన్ని రైతు సంఘాలు, సీపీఎం నేతలు ముట్టడించారు. సీఆర్డీఏ కార్యాలయానికి తాళాలు వేసి ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ.. 140 ఎకరాలు ప్రభుత్వ కార్యాలయాలకు సరిపోతుందన్నారు. కానీ రాజధాని పేరుతో ఇప్పటికే లక్షాపదివేల ఎకరాల సమీకరించారని అది చాలదని ఇప్పుడు మరో 3వేల ఎకరాలను సేకరిస్తోందని బాబురావు మండిపడ్డారు. రాజధాని పేరుతో ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని ఆరోపించారు. సింపూర్‌, జపాన్ కంపెనీలకు భూములను తాకట్టు...

కృష్ణాయపాలెం, మందడం, మల్కాపురం, రాయపూడి, తుళ్ళూరు గ్రామాల్లోని ప్రజలు గ్రామకంఠాలపై ప్రభుత్వ తీరుపట్ల తీవ్ర ఆగ్రహావేశాలతో ఉన్నారు. సిపిఎం బృందం ఈ గ్రామంలో పర్యటించినప్పుడు వారి ఆవేదన వ్యక్తం చేశారు. తమ దగ్గర పంట భూములు తీసుకునేటప్పుడు తియ్యని మాటలు చెప్పి నేడు గ్రామకంఠాల పేరుతో చేదు తినిపిస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం ఉన్న గ్రామానికి 500మీటర్లు అదనంగా గ్రామకంఠం కింద వదులుతానన్న ప్రభుత్వ హామీ ఏమైందని రైతులు మండిపడుతున్నారు. ప్రభుత్వం తక్షణం గ్రామకంఠాల సమస్యను పరిష్కరించకుంటే పూలు వేసిన చేత్తోనే రాళ్లు వేయక తప్పదని హెచ్చరించారు.

కార్మిక చట్టాల సవరణను, ప్రభుత్వ విధానాలకు నిరసనగా సెప్టెంబర్‌ 2న దేశ వ్యాప్తంగా జరుగుతున్న కార్మిక సమ్మెకు విస్తృత సన్నాహాలు చేయాలని సెంటర్‌ ఆఫ్‌ ఇండియన్‌ ట్రేడ్‌ యూనియన్‌(సిఐటియు) జిల్లా ప్రధాన కార్యదర్శి వై.నేతాజీ పిలుపునిచ్చారు. అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం అంగన్‌వాడీలంతా సమ్మెలో పెద్దఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు మంగళవారం స్థానిక పాతగుంటూరులోని సంఘ కార్యాలయంలో నిర్వహించిన అంగన్‌వాడీ వర్కర్స్‌ యూనియన్‌ జనరల్‌ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశానికి కె.నాగలక్ష్మి అధ్యక్షత వహించారు. నేతాజీ మాట్లాడుతూ సమ్మెలో దేశంలోని అన్ని కార్మిక సంఘాలు పాల్గొంటున్నాయని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక, ప్రజా...

ప్రభుత్వం తలపెట్టిన బలవంతపు భూసేకరణను వ్యతిరేకిస్తూ ఇచ్చిన బంద్‌ పిలుపు ఉండవల్లిలో సంపూర్ణంగా జరిగింది. ఉదయం నుండే దుకాణాలన్నీ మూతపడ్డాయి. పెట్రోలు బంకుతో సహా పెద్ద వ్యాపారసంస్థలన్నీ స్వచ్ఛంధంగా బంద్‌చేసి రైతులకు తమ సంఘీభావం ప్రకటించారు. ముందుగా సిపిఎం, వైసిపి నాయకులతో కలిసి రైతులు ఉండవల్లి సెంటర్లో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా క్రిడా సిపిఎం కన్వీనర్‌ సిహెచ్‌.బాబురావు మాట్లాడుతూ ప్రభుత్వం నిరంకుశత్వంగా ముందుకెళితే తగిన మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వ మెడలు వంచైనా భూసేకరణను నిలుపుదలచేస్తామని చెప్పారు. మెరుగైన ప్యాకేజీ అంటూ ప్రభుత్వం రైతులను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తుందని విమర్శించారు. రాజధానికి భూములు...

 రాజధాని ప్రాంతంలో గ్రామకంఠాలు, భూసేకరణపై సిపిఎం ఆధ్వర్యంలో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. తాడేపల్లి, మంగళగిరి మండలాల్లోని ఉండవల్లి, నవులూరుల్లోని క్రిడా కార్యాలయాలను స్థానికులు సోమవారం ముట్టడించారు. తుళ్లూరు మండలం దొండపాడులోని క్రిడా డిప్యూటీ కలెక్టర్‌ కార్యాలయానికి రాజకీయాలకతీతంగా రైతులు తాళాలేశారు. గ్రామకంఠాల పేరుతో గ్రామాలను ఖాళీ చేయాలనే కుట్ర జరుగుతోందని నినదిస్తూ అధికారులను ఘెరావ్‌ చేయడంతో కొద్దిసేపు ఉద్రిక్తత ఏర్పడింది. సిపిఎం రాజధాని డివిజన్‌ కార్యదర్శి ఎం.రవి మాట్లాడుతూ, గ్రామాలను ఖాళీ చేయించేందుకే ప్రభుత్వం కుట్రపన్నిందన్నారు.
తొలుత గ్రామకంఠంలోని కొన్ని ఇళ్ళను తొలగించి ఆ తరువాత గ్రామాన్ని ఖాళీ చేయించడానికి చేస్తున్న...

ఆంధ్రప్రదేశ్‌ కొత్త రాజధాని భూముల లావాదేవీల్లో నల్లధనం వరదలై పారుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఆదాయ పన్ను శాఖ కళ్లుమూసుకుంటుందా అనే ప్రశ్న తలెత్తుతోంది. రాజధాని గ్రామాలలో గత ఏడాది ఆగస్టు నుంచి ఈ ఏడాది ఏప్రిల్‌ వరకు దాదాపు రూ.10వేల కోట్ల నల్లధనం లావాదేవీలు సాగినట్లు హైకోర్టు న్యాయవాది ఒకరు అంచనా వేశారు. వాటిని పరిశీలించాల్సిందిగా ఆయన డైరెక్టర్‌ ఆఫ్‌ ఇన్‌కంటాక్స్‌ (ఇన్వెస్టిగేషన్‌) కు ఫిర్యాదు చేశారు.
ఆ ఫిర్యాదులోని వివరాల ప్రకారం... ఎపి ప్రభుత్వం గత ఏడాది డిసెంబరు 30న గుంటూరు జిల్లాలోని 29 గ్రామాలను క్యాపిటల్‌ సిటీ ఏరియాగా నోటిఫై చేయడానికి ముందునుంచే అక్కడ భూముల అమ్మకాలు, కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. 2014 సెప్టెంబరు, అక్టోబరు...

రాజధాని ప్రాంతంలో సమీకరించిన భూమిని 99 సంవత్సరాలపాటు స్వదేశీ, విదేశీ కంపెనీలకు లీజుకివ్వడానికి ప్రభుత్వం ఇప్పటికే 110 జీవోను విడుదల చేసింది. రాజధాని నిర్మాణానికి, నిర్వహణకు, క్యాపిటల్‌ సిటీ డెవలప్‌మెంట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ కార్పొరేషన్‌(సిసిడిఎంసి)ను ఏర్పాటు చేసింది. ఇందులో తొలుత పది మందిని సభ్యులుగా పెట్టి అనంతరం మరొకరిని పెంచింది. అంటే పదకొండు మందిలో ఏడుగురు ప్రభుత్వాధికారులుంటే నలుగురు పారిశ్రామివేత్తలు డైరెక్టర్లుగా ఉన్నారు. రాజధాని నిర్మాణానికి మాస్టర్‌ ప్లాన్‌ను రూపొందించి సింగపూర్‌తోపాటు, జపాన్‌, తదితర దేశాలకు అప్పగించనున్నారు. డెవలప్‌మెంట్‌ పార్టనర్‌గా సింగపూర్‌ ఉంటుందని ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించారు. ప్రస్తుతం రాజధాని...

బలవంతపు భూ సేకరణ తగదు-సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు రాజధాని పరిధిలో బలవంతపు భూసేకరణ తగదని, ఈ ప్రక్రియను వెంటనే నిలిపేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు కోరారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాజధానికి సరిపోయినన్ని భూములు ఇప్పటికే సమీకరించారని, కొత్తగా సేకరించాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. రైతుల భూములను పెద్దపెద్ద కార్పొరేట్‌ సంస్థలకు కట్టబెట్టేందుకే ప్రభుత్వం సేకరణకు వెళ్లిందని ఆయన విమర్శించారు. కేంద్రం ప్రవేశపెట్టిన భూ ఆర్డినెన్స్‌లను అడ్డం పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం సేకరణ ప్రకటన చేయడం ఏ మాత్రమూ క్షమార్హం కాదని పేర్కొన్నారు. ఆర్డినెన్స్‌లు ఇంతవరకు ఆమోదం పొందలేదని, ఈ క్రమంలో వాటిని ఆసరాగా చేసుకుని...

Pages