District News

2018 నాటికి సీడ్‌క్యాపిటల్‌ను నిర్మిస్తామని చెబుతున్న ప్రభుత్వం దానికి అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసింది. మొత్తం 1694.5 హెక్టార్ల(4236 ఎకరాలు)లో దీని నిర్మాణం జరగ నుంది. దీనికిగాను రూ.8214 కోట్లు ఖర్చవుతుం దని అంచనా వేసింది. ఐదుదశల్లో నిర్మించ నున్న రాజధానికి సంబంధించి తొమ్మిది యాక్షన్‌ ప్లానులు రూపొందించారు. రాజధాని నగరంలో 88 కిలో మీటర్ల పొడవున రోడ్లను నిర్మించనున్నారు. ఐదు దశల్లో ఏ దశలో ఎంత స్థలం వినియోగం అవు తుంది, ఎన్ని ఉద్యోగాలొస్తాయి అనే అంశా లనూ పొందుపరిచారు. సింగపూర్‌కు చెందిన సుర్బానా ఇంటర్నేషనల్‌ కన్సలెంట్స్‌ ప్రైవేటు లిమి టెడ్‌, జురాంగ్‌ ఇంటర్నేషనల్‌, మినిస్ట్రీ ఆఫ్‌ ట్రేండ్‌ అండ్‌ ఇండిస్టీ, సింగపూర్‌ కార్పొరేషన్‌ ఎంటర్‌...

మాస్టర్‌ప్లాను నివేదిక ప్రకారం ప్రసుత్తం గ్రామాలు తరలిస్తామంటున్నారని, రేపు ఉన్న ప్రజలనూ తరలించేస్తారని సిపిఎం క్రిడా కన్వీనర్‌ సిహెచ్‌.బాబూరావు అన్నారు. గ్రామాల్లో రాజధాని కమిటీ కార్యదర్శి ఎం.రవి, నాయకులు నవీన్‌ప్రకాష్‌తో కలిసి పర్యటించారు. ప్రజలను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రజలు ఆందోళనకు దిగడంతో ఎక్కడిక్కడ నిరసన కార్యక్రమాలు, ధర్నాలు చేశారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేవరకూ ఊరుకునేది లేదని, ఎంతవరకైనా వెళతామని హెచ్చరించారు. వరదలొచ్చినా వారు ఇక్కడే ఉన్నారని, నష్టపోయారని, ఇప్పుడు కొద్దిమంది లాభం కోసం తరిమేస్తామంటే ఎలా వెళతారని ప్రశ్నించారు. ప్రభుత్వం పేదలను, ముఖ్యంగా దళితులను ఇక్కడ నుండి తరిమేసే ప్రక్రియ...

సి పి యం కేంద్రకమిటీ పిలుపులొ మేరకు జిల్లాలో వివిధ అంశాలపై ప్రత్యామ్నాయా విధానలను ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. కేంద్రంలో బి జె పి రాష్ట్రంలో టి డి పి పార్టీలు ఆధీకారంలొకి రావడనికి అవినీతిలేని స్వచ్చమైన పరిపాలన అందిస్తామని, దేశన్ని అభివృద్ది పధంలో నడిపిస్తామని వాగ్ధానం చేశారు. కాని కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అవినీతి కుంభకోణాలలో మునిగిపొయారు. లలీతమొడికి వీసాకి సాహయం చేయటంలొ,వ్యాపం కుంభకోణంలో బి జె పి పాత్ర ఉంది. రాష్ట్రంలో ఇసుక, వొటుకు-నొటు వంటి పలు అవినీతి కర్యాక్రమాలలో తి డి పి కురుకుపొయింది. ఇటువంటి తరుణంలో ప్రభుత్వాల విధానలపై ఉద్యమిస్తూ, సమగ్రభివుద్ధి, విద్యారంగసమస్యలు, సామాజికసమస్యలు, కార్మికులు, రైతులు పట్టనణ ప్రాంత సమస్యలపై 1నుండి...

 ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి సీడ్‌ క్యాపిటల్‌ మాస్టర్‌ ప్లాన్‌లో అనేక అంశాలు పొందిపరిచారు. బ్రహ్మ స్థానంలో ఏమేమి ఉంటాయి, సచివాలయం ఎక్కడ నిర్మిస్తారు.. హైకోర్టు ఎక్కడ.. తదితర అంశాలు అందులో పొందిపరిచారు.
అమరావతి సీడ్‌ క్యాపిటల్‌ మాస్టర్‌ ప్లాన్‌ను సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌ సోమవారం సాయంత్రం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అందజేయనున్నారు. నవ్యాంధ్ర రాజధాని రూపురేఖలన్నీ మాస్టర్‌ ప్లాన్‌లో పొందిపరిచారు. అంతకు ముందే ఈశ్వరన్‌ అమరవాతి రాజధాని మాస్టర్‌ ప్లాన్‌ను చంద్రబాబుకు అందజేశారు. ఇప్పుడు సీడ్‌ క్యాపిటల్‌ మాస్టర్‌ ప్లాన్‌ను అందజేయనున్నారు. సీడ్‌ క్యాపిటల్‌ మాస్టర్‌ ప్లాన్‌లో ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి అత్యంత అధునాతనమైనటువంటి...

 అమరావతిని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ ఆలోచన పై భిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి అమరావతిని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని, ఏడాది కాలంగా ప్రభుత్వ కార్యాలయాల తరలింపు చేస్తామని చెబుతున్న మంత్రులు, వాటిని ముందు అమలు చేసి, తర్వాత జిల్లా ప్రతిపాదనలు తీసుకోస్తే బాగుంటుందని అంటున్నారు. మరోవైపు అమరావతి ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని అలోచన మంచిదైనప్పటకీ , ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలంటే అనేక శాఖలను అనుసంధానం చేయాల్సి ఉంటుందని, ప్రస్తుతం మంత్రుల కార్యాలయాల తరలింపు సాధ్యం కానప్పుడు , ఇప్పుడు ప్రత్యేక జిల్లా అవసరం ఉండబోదని విశ్లేషకులు అంటున్నారు.

 ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఆగస్టు 1 నుంచి 14వ తేదీ వరకు ప్రచార కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఎమ్మెల్సీ ఎంవిఎస్‌ శర్మ తెలిపారు. గుంటూరులోని సిపిఎం జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా విస్తృత సమావేశం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జెవి రాఘవులు అధ్యక్షతన ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా శర్మ మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలపై ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా ఉండేందుకు కులం, మతం, ప్రాంతీయ తత్వాలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. భవిష్యత్‌ రాజధాని ఎలా ఉండబోతుందో చూపిస్తున్న ప్రభుత్వం అందులో కార్మికులు, కూలీలు, రైతులు, ఇతర సామాన్యుల స్థానమేమిటో, వారి జీవనోపాధి ఎలా ఉండాలో ప్రస్తావించడం లేదన్నారు. రాజధాని ముసుగులో...

ఆసియా వాణిజ్య కేంద్రంగా అమరావతి మారనుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసింది. జపాన్‌లో వ్యాపారవేత్తల బృందం, ప్రభుత్వ ప్రతినిధులూ వాణిజ్య కేంద్రాల రాజధానిగా అమరావతి రూపుదిద్దుకునే అవకాశ ముందని చెప్పినట్లు తెలిసింది. తమ రాజధాని కంటే అధునాతనమైన, ఉత్తమమైన రాజధానిని ఏర్పాటు చేసేందుకూ అవకాశాలున్నాయని జపాన్‌ ప్రతినిధులు తెలిపారని క్రిడా కమిషనర్‌ ఎన్‌.శ్రీకాంత్‌ చెబుతున్నారు. మాస్టర్‌ ప్లానొచ్చిన వెంటనే ఇక్కడ పనులు మొదలుపెట్టేందుకు తమ కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు జపాన్‌ సంస్థలు ఉత్సాహంగా ఉన్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న వనరులపై ఇప్పటికే బహుళజాతి కంపెనీలు దృష్టి సారించిన విషయం తెలిసిందే. సుదీర్ఘమైన కోస్తాతీరం...

 మద్యం దుకాణాలకు వేలం పాడిన వారంతా ఇప్పుడు తలలు పట్టుకురటున్నారు. లాభాలు బాగా ఉరటాయని ఈ వ్యాపారంలోకి వచ్చిన వారు తమ ఆదాయంలో సగ భాగాన్ని అప్పనంగా పరులకు ఇవ్వాల్సి రావడంపై వారంతా ఆరదోళన వ్యక్తం చేస్తున్నారు. మద్యం వ్యాపారుల నురచి భారీగా వసూళ్లు చేసే నేతల సంఖ్య పెరిగిపోతోరదట. పది నురచి గరిష్టంగా 50 శాతం వరకు వారికి చెల్లిరచుకోవాల్సి వస్తోరదని వ్యాపారులు అరటున్నారు. మద్యం దుకాణాలపై వేలం ముగిసిన వెరటనే అనేక మంది సీనియర్‌ నాయకులు, ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగి వ్యాపారులతో సమావేశాలు నిర్వహిరచారు. ఆ ప్రారతంలో దుకాణాలకు వచ్చే ఆదాయాన్ని బట్టి తమకూ వాటా కావాలంటూ హుకుం జారీ చేసినట్లు తెలుస్తోరది. అవసరమైతే వాస్తవ విలువపై 15 రూపాయలు అధికంగా వసూలు...

గుంటూరు జిల్లా‌లోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో బీఆర్కే(బ్యాచ్‌లర్ ఆఫ్ ఆర్కిటెక్చర్) ఫస్టియర్ చదువుతున్న రుషితేశ్విని అనే విద్యార్థిని ఉరేసుకుంది. మృతురాలిది వరంగల్ జిల్లా అని తెలుస్తోంది. ఆత్మహత్యకు ర్యాగింగే కారణమని తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థిని మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి

రాజధాని గ్రామాల్లో కౌలు రైతుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. 29 గ్రామాల పరిధిలో 33 వేల ఎకరాల్లో వ్యవసాయం ఉపసంహరణతో కౌలు రైతుల జీవనం అగమ్యగోచరంగా మారింది. రాజధాని ప్రాంతంలో మొత్తం 22 వేల మంది భూమి ఉన్న రైతులు ఉండగా వీరిలో 40 శాతం మంది రైతులు నేరుగా వ్యవసాయం చేయరు. వీరు ఎక్కువగా భూములను కౌలుకు ఇస్తారు. కొందరికి ఈ గ్రామాల్లో భూములు ఉన్నా ఇతర రాష్ట్రాలు, దేశాల్లో నివశిస్తూ ఏడాదికి ఒకటి రెండు సార్లు ఈ ప్రాంతానికి వచ్చి వెళ్తుంటారు. అలాగే మరికొందరు రైతులు గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్‌లో స్థిరపడి వారి భూములను కౌలుకు ఇస్తుంటారు. మొత్తం మీద 29 గ్రామాల పరిధిలో 4,230 మంది కౌలు రైతులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరు గత కొన్నేళ్లుగా...

Pages