District News

అమరావతి శంకుస్థాపనలోపే రాజధాని ప్రాంత రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సీపీఎం డిమాండ్‌ చేసింది. ప్రస్తుతం భూములు కోల్పోయి ఆందోళనలో ఉన్న రైతులకు అండగా ఉండేందుకు ఆ పార్టీ రాజధాని ప్రజా చైతన్య యాత్రకు శ్రీకారం చుట్టింది. ఈ యాత్ర ద్వారా 120 కిలోమీటర్లు 29 గ్రామాల్లో 6 రోజుల పాటు పర్యటించనున్నారు. రాజధాని ప్రాంత రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేవరకూ పోరాటం చేస్తామని రాజధాని ప్రాంత సమన్వయ కమిటీ సీపీఎం కన్వీనర్‌ బాబురావు పేర్కొన్నారు.

రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు వెన్నుదన్నుగా నిలిచేందుకు వీలుగా ప్రభుత్వం ఇచ్చిన పలు హామీలు ఇప్పటికీ అమలు కాలేదు. తుళ్లూరును రాజధాని ప్రాంతంగా ప్రకటించిన నేపథ్యంలో ఈ ప్రాంత ప్రజలకు ప్రభుత్వం పలు హామీలిచ్చింది. అయితే అమలులో మాత్రం చతికిలపడింది. భూములిచ్చిన రైతులకు పరిహారం ప్యాకేజి కింద అభివృద్ధి చేసిన భూములను ఎక్కడ కేటాయిస్తారనేది ఇప్పటికీ స్పష్టతివ్వలేదు. భూమిలేని నిరుపేదలకు పింఛను ఇస్తామన్నారు. 23,500 మంది నిరుపేదలున్నట్లు పంపిన ప్రతిపాదనలను ఆమోదించిన ప్రభుత్వం తరువాత వివిధ రూపాల్లో వడపోత చేపట్టి గురువారం వరకూ 13,019 మందికి ఫించన్లు అందించింది. ఇంకా దాదాపు నాలుగు వేల వరకూ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు...

రాజధాని గ్రామాల్లో భూ సమీకరణ ఇంకా కొనసాగుతోంది. 95 శాతం మంది భూములివ్వగా ఐదు శాతం మందే వ్యతిరేకిస్తున్నారని ప్రభుత్వ పెద్దలు చెబుతున్న మాటల్లో వాస్తవం లేదన్నదీ తాజా గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. మరో 20 రోజుల్లో రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలోనూ సమీకరణ ప్రక్రియ పూర్తి కాలేదు. మొత్తం 37,724 వేల ఎకరాల పట్టా భూమి సమీకరించాలని నోటిఫికేషన్‌ ఇవ్వగా ఇందులో 31,359 ఎకరాలకే అంగీకార పత్రాలిచ్చారు. అందులోనూ 29,854 ఎకరాలకే హక్కుదారులను నిర్థారించారు. ఇందులో 27,082 ఎకరాలకే ఒప్పంద పత్రాలందాయి. కానీ మంత్రులు మాత్రం ఇప్పటికి మొత్తం భూమికి ఒప్పంద పత్రాలు అందాయని చెబుతున్నారు. ఇప్పటికీ పట్టాభూమిలో 6,500 ఎకరాలకు అంగీకార పత్రాలే అందలేదు....

జిల్లాలోని అర్భన్‌ హెల్త్‌ సెంటర్ల ఉద్యోగుల ఆరు నెల్ల వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వై.నేతాజీ కోరారు. సోమవారం ఎపి అర్భన్‌ హెల్త్‌ సెంటర్స్‌ కాంట్రాక్ట్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ టి.పద్మజారాణికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నేతాజీ మాట్లాడుతూ జీతాల్లేక ఉద్యోగులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పిలల్ల స్కూల్‌ ఫీజులు కట్టలేక, కుటుంబాలు గడవక ఉద్యోగులు అప్పుులు చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డిఎంహెచ్‌ఒ మాట్లాడుతూ రాష్ట్ర అధికారులకు ఇప్పటికే బడ్జెట్‌ ప్రతిపాదనలు పంపించామని, వాటిని త్వరగా తెప్పించి వేతనాలు చెల్లిస్తామని చెప్పారు...

అతిచిన్న వయస్సులోనే తన చుట్టూ ఉన్న పరిస్థితులను ఆకళింపు చేసుకోవటమే కాకుండా ప్రపంచంలో ఉన్న ప్రజలు అభివృద్ధివైపు పయనించాలంటే విద్యకు మించిన మార్గం లేదని మలాల ఇచ్చిన పిలుపును మనమంతా అందిపుచ్చుకోవాలని ఐద్వా రాష్ట్రకార్యదర్శి రమాదేవి పేర్కొన్నారు. సోమవారం వివిఐటి ఇంజినీరింగ్‌ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమానికి ఆమె అధ్యక్షత వహించి మాట్లాడారు. ప్రపంచ దేశాలు యుద్దాలకు ఖర్చుపెట్టే సొమ్మును విద్యాభివృద్ధికి మళ్లించాలని చెప్పిన మలాలను నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ప్రజాశక్తి బుకహేౌస్‌ ఎడిటర్‌ ఉషారాణి మాట్లాడుతూ మతం పేరిట తాలిబన్లు చదువు వద్దని, ఇంటినుండి బయటకి రావద్దని బురకా ధరించాలని ఆక్షంలు విధిస్తున్న పిదప మనదేశంలోనూ మతోన్మాదులు మహిళలు పట్ల...

గ్రామకంఠాల సమస్యలను వారంలో పరిష్కరించాలని ముఖ్యమంత్రి, మంత్రులు భావించినా నెల దాటిపోయింది. గత నెల 20వ తేదీన భూ సేకరణ ప్రకటన విడుదల చేశారు. వెంటనే వరసుగా గ్రామాల్లో సిఆర్‌డిఏకు అవసరమైన భూముల తుది జాబితాలను 9.5 ఫారం రూపంలో అధికారులు ప్రకటించారు. దీంతో ఒక్క సారిగా గ్రామాల్లో కలకలం చెలరేగింది. రైతులు సిఆర్‌డిఏ కార్యాలయాలను ముట్టడించారు. కొన్ని చోట్ల తాళాలు వేశారు. దీంతో ప్రభుత్వ పెద్దలు ఒక్కసారిగా కలవరపాటుకు గురయ్యారు. వెంటనే ఈ సమస్యను పరిష్కరించేందుకు శిక్షణలో ఉన్న జాయింట్‌ కలెక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌ను ఆఘమేఘాలపై పిలిపించారు. గత నెల 24 నుంచి ఈ సమస్యపై ఆయన దృష్టి సారించారు. దాదాపుగా అన్ని గ్రామాలను పరిశీలించారు. రైతులతో చర్చించారు. కొన్ని...

కుల, వర్ణ వ్యవస్థల నిర్మూలనకు కృషి చేస్తూ తన సాహిత్యం ద్వారా సాంఘిక అసమానతలపై పోరాడి పద్యానికి ప్రాణం పోసిన మహాకవి గుర్రం జాషువా రచనలపై మరోసారి అధ్యయనం జరగాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. గుర్రం జాషువా 120వ జయంతి సందర్భంగా ఆదివారం ఎసి కళాశాలలో 'జాషువా సమగ్ర రచనలు - సమాలోచన' అంశంపై నిర్వహించిన రాష్ట్ర సదస్సుల్లో సాహితీ వేత్తలు, అభ్యుదయవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్సీ కె యస్‌ లక్ష్మణరావు అధ్యక్షతన ప్రారంభ సభ జరిగింది. సభలో దళిత తత్వవేత్త డాక్టర్‌ కత్తి పద్మారావు మాట్లాడుతూ.. జాషువా తెలుగు పద్యాన్ని ఆయుధంగా మలుచుకుని శాస్త్రీయ, హేతుబద్ధమైన ఆలోచనలతో కులవివక్ష, అస్పృశ్యతపై యుద్ధం చేశారని అన్నారు.

రాజధాని నిర్మాణంలో ప్రభుత్వ వ్యాపార ధోరణులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. సింగపూర్‌లో సిఎం బృందం ఇటీవలి పర్యటనలో పట్టణాభివృద్ధిశాఖ అధికారులు లేరు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ కేంద్రమంత్రి, ఇద్దరు రాష్ట్ర మంత్రులకు లబ్ధి చేకూర్చే ఉద్దేశంతోనే సిఆర్‌డిఎ పరిధిని పెంచారనే వార్తలూ వస్తున్నాయి. రెవెన్యూ శాఖను పక్కన పెడుతునట్టు, మున్సిపల్‌శాఖలో అధికారులను ఒక్కొక్కరిని మార్పు చేస్తున్నట్టు పరిస్థితులు వెల్లడిస్తున్నాయి. రాజధాని నిర్మాణాలకు సంబంధించిన ఒప్పందాల్లోనూ సంబంధిత అధికారులకు సమాచారం ఉండటం లేదు. ఇటీవలి సింగపూర్‌ పర్యటనలో పట్టణాభివృద్దిశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ కరికాల వలవన్‌కు స్థానం కల్పించలేదు. రాజధాని ప్రణాళికపై సింగపూర్‌లో...

అసైన్డ్‌, సీలింగు భూముల లబ్ధిదారులకు పరిహారం చెక్కులివ్వాలని రాజధాని ప్రాంత పేదలు వినూత్న నిరసనకు దిగారు. బహిరంగ నిరసనలపై ప్రభుత్వం ఆంక్షలు పెట్టి, అరెస్టులకు పాల్పడుతుండటంతో పేదలు మూతికి నల్లగుడ్డలు కట్టుకుని స్వీయ గృహ దీక్ష చేపట్టారు. దాదాపు 30 చోట్ల వందలాది మంది మహిళలు ఈ దీక్షల్లో కూర్చున్నారు. ప్రభుత్వం స్పందించే వరకు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టబోమని భీష్మించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు పెద్ద ఎత్తున తుళ్లూరు లైబ్రరీ సెంటర్లో మోహరించారు.ఈ దీక్షలకు క్రిడా కన్వీనర్‌ సిహెచ్‌.బాబూరావు మద్దతు ప్రకటించారు. బాబూరావు మాట్లాడుతూ 206 ఎకరాల భూములను 380 మంది పేద రైతులు తరతరాలుగా సాగు చేసుకుంటున్నారని వాటికి ఇంతవరకు కౌలు పరిహారం ఇవ్వలేదని...

 ఇళ్ల స్థలాలు, పట్టాలు, సాగు భూముల కోసం పేదలు కదం తొక్కారు. వ్యవసాయ కార్మిక సంఘం, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం, రైతు సంఘం సంయుక్తంగా గుంటూరు కలెక్టరేట్‌ ఎదుట మంగళవారం చేపట్టిన ధర్నాకు జిల్లా నలుమూలల నుండి వేలాది మంది పేదలు తరలొచ్చారు.నీరు-చెట్టులో భాగంగా పేదలు ఏళ్లతరబడి సాగు చేసుకుంటున్న భూముల్లో చెరువులు తవ్వి తమకు ప్రభుత్వం అన్యాయం చేసిందని పేదలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగాసిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు మాట్లాడారు. ఇళ్లస్థలాలు ఇస్తామని ఎన్నికలప్పుడు హామీనిచ్చిన చంద్రబాబు దాన్ని నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేశారు. రైతుల భూములు లాక్కుని కార్పొరేట్‌ శక్తులకు అప్పగించాలనే ప్రయత్నాన్ని అడ్డుకుంటామని హెచ్చ రించారు. ఈ సమస్యపై...

Pages