District News

రాజధాని ప్రాంతంలో భూ సేకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ ప్రక్రియలో భాగంగా ఇంతవరకు యూనిట్‌ అధికారులగా ఉన్న స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్లను, ల్యాండ్‌ అక్విజిషన్‌ అధికారులుగా మారుస్తూ 304 నెంబరుతో జిఓ జారీ అయింది. 9.2 అభ్యంతర పత్రాలను తిరస్కరిస్తున్నట్లు రేపటి నుండి నోటిఫికేషన్లు ఇవ్వనుంది. వీటిని ఆయా కార్యాలయాల పరిధిలో బహిరంగంగా ఏర్పాటు చేస్తారు. వీటిపై అభిప్రాయాలు చెప్పుకునేందుకు వారం రోజులు గడువిచ్చారు. వాటిని కూడా పరిష్కరించిన అనంతరం గ్రామాలవారీగా సేకరణ నోటిఫికేషన్‌ ఇస్తామని సిఆర్‌డిఎ అధికారులు చెప్పారు. అయితే గురువారం రాత్రి తొలి విడత నోటిఫికేషన్‌ విడుదలైంది. తుళ్లూరు మండలంలోని పిచ్చుకలపాలెం, అబ్బరాజపాలెం, బోరుపాలెం,...

రాజధాని గ్రామాల్లో భూ సమీకరణకు ఒప్పుకోని రైతుల భూములను భూ సేకరణ చట్టం ద్వారా స్వాధీనం చేసుకోవాలనే ఉత్తర్వులను ఉప సంహరించాలని అఖిలపక్ష రైతు, వ్యవసాయ కార్మిక, రైతు కూలీ, ప్రజా సంఘాల నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. భూ సేకరణకు నిరసనగా శుక్రవారం క్రిడా కార్యాలయం ఎదుట ధర్నాకు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం, ఏపి వ్యవసాయ కార్మిక సంఘం సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడలోని ప్రెస్‌క్లబ్‌లో రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. ఈ నెల 20 నుంచి భూసేకరణ చేపడతామని రాష్ట్ర ప్రభుత్వ ప్రకటనను సమావేశం ఖండించింది. బలవంతపు భూసేకరణ ప్రయత్నాలను మానుకోవాలని సమావేశంలో పాల్గొన్న నాయకులు డిమాండ్‌ చేశారు. భూ సమీకరణకు తమ భూములు ఇవ్వబోమని 8 వేల ఎకరాల రైతులు...

కృష్ణా కరకట్ట దిగువ భాగంలో అనుమతులు లేకుండా నిర్మించిన కట్టడాలను రెగ్యులరైజ్‌ చేసేందుకు రంగం సిద్ధమైంది. ఆ ప్రాంతంలో ముఖ్యమంత్రి తాత్కాలిక నివాసం ఏర్పాటవుతుం డటమే ఇందుకు కారణం.రాజధాని నిర్మాణానికి భూములు సమీకరించిన 29 గ్రా మాలకు సమీపంలో పలువురు రైతులు షెడ్లు, కోళ్ల ఫారాలు, నివాస గృహాలు నిర్మించుకున్నారు. వాటన్నిటినీ పూలింగు కింద ఇవ్వాల్సిందేనని ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి తెచ్చారు. నిర్మా ణాలకు మినహాయింపు ఇవ్వాలని కోరినా ఇవ్వలేదు. పదేపదే మంత్రి నారాయణ చుట్టూ తిరిగినా పట్టించుకోలేదు. క్రిడా కమిషనర్‌ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వాల్సిందేనని ఆదేశాలు జారీచేశారు తప్పనిసరి పరిస్థితుల్లో రైతులు తమ నిర్మాణాలు, ఇళ్లనూ పూలింగు ప్రక్రియకు ఇచ్చేశారు. ఈ...

ఇద్దరు ఇంటర్‌ విద్యార్థునుల బలన్మరణానికి కారణమైన కడప జిల్లాలోని నారాయణ విద్యాసంస్థ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ విద్యార్థుల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. గుంటూరులో పోలీసులు విద్యార్థులపై జులుం ప్రదర్శించారు. ఎస్‌ఎఫ్‌ఐ, ఎఐఎస్‌ఎఫ్‌, పిడిఎస్‌యు ఆధ్వర్యంలో గురువారం గుంటూరులో శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తుండగా పోలీసులు అడ్డుకుని దుర్భాషలాడారు. పిడిగుద్దులతో బీభత్సాన్ని సృష్టించారు. నలుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. ఒక విద్యార్థిని తనను ఆసుపత్రికి తీసుకెళ్లాలని అభ్యర్థించినా పోలీసులు పట్టించుకోలేదు. 29 మందిని అరెస్ట్‌ చేసి అరండల్‌పేట పోలీసు స్టేషన్‌కు తరలించారు.

రాజధాని ప్రాంతంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సిపిఎం కార్యకర్తలు నిత్యం పనిచేయాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుల సిహెచ్‌.బాబురావు కోరారు. ఉండవల్లి సిపిఎం కార్యాలయంలో సోమవారం జొన్నకూటి వీర్లంకయ్య అధ్యక్షతన సిపిఎం రాజధాని డివిజన్‌ కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో బాబురావు మాట్లాడుతూ ప్రభుత్వం పేదల పట్ల ఉద్ధేశ్యపూర్వకంగానే వివక్ష చూపుతుందని విమర్శించారు. అందుకు పేదలకు ఇవ్వవలసిన పింఛన్లు సరిగా ఇవ్వకపోవడమేనని విశ్లేషించారు. సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ ఉదాసీనత రోజురోజుకు పెరుగుతుందని మండిపడ్డారు. లంక గ్రామాల విషయంలో అధికారులు, మంత్రులు పొంతనలేని విధంగా మాట్లాడి గందరగోళం సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అసైన్డ్‌, సీలింగ్‌...

భజరంగ్‌ జూట్‌మిల్లు అక్రమ లాకౌట్‌ వ్యవహారాన్ని తేలుస్తారో.. లేక తేల్చుకోమంటారో తేల్చి చెప్పాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.ఎ. గఫూర్‌ ప్రభుత్వానికి సవాలు విసిరారు. అక్రమ లాకౌట్‌ ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. ఆదివారం దీక్షలను ఆయన ప్రారంభించారు. గఫూర్‌ మాట్లాడుతూ భజరంగ్‌ జూట్‌మిల్లు ఆస్తులు ప్రస్తుత యజమానివి కావన్నారు. ఆ వాస్తవాన్ని గమనించి మిల్లు నడపడం చేతకాకపోతే ప్రభుత్వానికి అప్పగించిపోవాలే తప్ప అమ్ముకునేందుకు వారికి హక్కు లేదన్నారు. వారు ఈ విషయాన్ని గుర్తెరగని పక్షంలో 'ఇది కార్మిక ఆస్తి' అని ఇక్కడ బోర్డు పెట్టాల్సి ఉంటుందని హెచ్చరించారు.

ప్రజా సమస్యలపై సిపిఎం చేపట్టిన ప్రచారాందోళనల్లో భాగంగా బుధవారం తెనాలి జిల్లా వైద్యశాలను సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.కృష్ణయ్య సందర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్రం బాధ్యత తీసుకుని రాజధాని వైద్యశాలగా అప్‌గ్రేడ్‌ చేసి మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్‌ చేశారు. సూపరింటెండెంట్‌ ఈశ్వర ప్రసాద్‌తోనూ, రోగులతోనూ మాట్లాడి వైద్యసేవలపై వివరాలు సేకరించారు. 10 లక్షల మంది ఈ ఆస్పత్రిపై ఆధారపడ్డా అందుకనుగుణంగా సదుపాయాల్లేవన్నారు. డాక్టర్ల కొరతతోపాటు దోభీ, ప్లంబర్‌, ఎలక్ట్రీషియన్‌ పోస్టులను భర్తీ చేయాలన్నారు. ఆస్పత్రికి ఆర్‌టిసి లోకల్‌ సర్వీసులు తిప్పాలని,కాంట్రాక్ట్‌ ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది వేతనాలనూ పెంచాలని డిమాండ్‌ చేశారు. 

ప్రజాసమస్యలపై ప్రచార కార్యాక్రమంలో బాగంగా గుంటూరు ప్రభుత్వ జనరల్ హస్పిటల్ ను సందర్శించారు. దాతల సహకారంతో పేద ప్రజలకు వైద్యం అందాలనే లక్ష్యంతో ప్రారంభించిన జి.జి.హెచ్ లొని మిలీనియం బ్లాక్ నేడు ప్రభుత్వ నిర్లక్ష్యంతో లక్ష్యం మూలన పదిందని విమర్శించారు. ప్రభుత్వం వైద్య రంగానికి నిధులు పెంచాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోనె అతి పెద్ద హస్పిటల్స్ లో గుంటూరు జి.జి.హెచ్ ఒకటి, కాని చుట్టుపక్కల జిల్లాల నుండి ఇక్కడకి వస్తుంటే కనీసం రోగులకు సరిపడిన డాక్టర్లు, నర్సులు లేకపోతె పేద ప్రజలకు వైద్యం ఎలా అందుతుంది అని ప్రశ్నించారు. కార్డియోదోరాసిస్ సర్జరికి పి.పి.పి పద్దతులో ఆపరేషన్లు జరుగుతున్నయని దినీవలన ప్రజలపై బారం పడుతుందని, ఆపరేషన్లు చెయటానికి...

రైల్వే ప్రయాణీకులకు కావల్సింది బుల్లెట్‌ రైళ్లు కాదని, ప్రయాణంలో వారికి భద్రత కల్పించాలని అని సిపిఎం పొలిట్‌బ్యూరో కేంద్ర ప్రభుత్వానికి హితవు పలికింది. మంగళవారం అర్ధరాత్రి మధ్యప్రదేశ్‌లోని జరిగిన జంట రైలు ప్రమాదాలపై పొలిట్‌బ్యూరో దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. రైల్వేలలో తరచు జరుగుతున్న ఈ ప్రమాదాలలో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నా రైల్వే శాఖ పరిస్థితులపైన, భద్రతా ప్రమాణాలపైన ప్రభుత్వం ఇంకా కళ్లు తెరవటం లేదని, షరామామూలుగా భద్రతా కమిషనర్‌తో కంటితుడుపు దర్యాప్తునకు ఆదేశాలుజారీ చేసిందని విమర్శించింది. బుల్లెట్‌ రైళ్లు, హైస్పీడ్‌ రైళ్లు అంటూ పగటి కలలు కనటం మాని రైల్వే వ్యవస్థను గాడిన పెట్టి ప్రయాణీకుల భద్రతకు ప్రాధాన్యతనివ్వాలని, తక్షణమే ట్రాక్...

గుంటూరులో బజరంగ్ జ్యూట్ మిల్లు కార్మికుల ఆందోళనకు సిపిఎం అండగా ఉంటుందని పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు అన్నారు. ఆందోళన చేస్తున్న కార్మికుల దీక్షా శిబిరాన్నిసందర్శించి మద్దతు తెలిపారు.ఈ సందర్బంగా మధు మాట్లాడుతూ యాజమాన్యం కార్మికుల డిమాండ్లను పరిగణలోనికి తీసుకోని వారి జీవనోపాధికి సంబందించిన జ్యూట్ మిల్లును వెంటనే తిరిగి ప్రారంభించాలని కోరారు. 

Pages