District News

ఏపీ సర్కార్ సీఆర్డీఏ చట్టాన్ని తాజాగా మళ్లీ సవరించింది. దీంతో ఇప్పటి వరకున్న 7068.20 చదరపు కిలోమీటర్ల సీఆర్డీఏ పరిధి...ఇప్పుడు 8,352.69 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. అంటే అదనంగా 1,284.49 చదరపు కిలోమీటర్లు పెరిగింది.కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేట పట్టణం పూర్తిగా సీఆర్డీఏ లో కలిసింది. దీంతోపాటు వివిధ మండలాల్లోని 136 గ్రామాలను ఇందులో కలిపారు. గుంటూరు జిల్లాలోనూ 30 గ్రామాలు సీఆర్డీఏ లో అదనంగా కలిశాయి.

రాజధాని ప్రాంతలో అర్హులందరికీ పింఛన్లు ఇవ్వాలని సిపిఎం సిఆర్‌డిఎ కన్వీనర్‌ సిహెచ్‌ బాబురావు డిమాండ్‌ చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నిడమర్రులోని సిఆర్‌డిఎ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో పేదలు శనివారం ధర్నా చేశారు. కార్యక్రమానికి సిపిఎం రాజధాని కమిటీ కార్యదర్శి ఎం.రవి అధ్యక్షత వహించారు. బాబురావు మాట్లాడుతూ పేదలకు పింఛన్లే ఇవ్వలేనివారు రాజధానిని ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. నదుల అనుసంధానం పేరుతో చేపట్టిన కార్యక్రమానికి రూ.10కోట్లు ఖర్చుచేసిన ప్రభుత్వం పేదలకు పింఛన్లు ఇవ్వడంలేదని విమర్శించారు. తన సొంత ఇల్లు చూసుకున్న సిఎం పేదల ఇళ్ల గురించి మర్చిపోవడం దారుణమన్నారు. దళితుల నుండి తీసుకున్న భూములకు ఇంకా కౌలు చెక్కులు ఇవ్వలేదని, ఈ...

సిపియం ఆధ్వర్యంలో రాజధాని ప్రాంతంలో నిర్భంధం అనే అంశంపై నిర్వహించిన రౌండ్ టెబుల్ సమావేశంలో సిపియం రాష్ట్రకార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు మాట్లాడుతూ ప్రపంచ స్థాయి రాజధాని అని చెబుతున్న ప్రభుత్వం శంఖుస్థాపన జరగక ముందే అక్కడి ప్రజల హక్కుల్ని కాలరాస్తుందన్నారు. ఇది రాజధాని సమస్య కాదని పౌర హక్కుల సమస్యని పేర్కొన్నారు. రాజధాని నిర్మాణానికి 1.10 లక్షల ఎకరాల భూమిని తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోందనీ, కానీ మాస్టర్ ప్లాన్ లో మాత్రం అన్ని కార్యాలయాలకు కలిపి 155 ఎకరాలు సరిపోతుందని చూపిస్తున్నారని, మిగిలిన భుమూల్ని కార్పోరేట్ శక్తులకు అప్పగిస్తున్నారని ఆరోపించారు. వ్యవసాయ కూలిలకు ఉపాధి, పింఛన్లు ఇంత వరుకు ఇవ్వలేదని, రైతులకు భూమి...

144 సెక్షన్‌ పేరుతో రాజధాని ప్రాంతంలో పేదలను భయభ్రాంతులకు గురిచేస్తూ పోలీసు రాజ్యాన్ని నడపుతున్న ప్రభుత్వ పోకడను సిపిఎం రాజధాని డివిజన్‌ కమిటీ తీవ్రంగా ఖండించింది. ఆదివారం మంగళగిరిలో శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్దతిలో నిరసన వ్యక్తం చేస్తున్న ఎంఆర్‌పిఎస్‌ నాయకులను అక్రమంగా అరెస్టు చేయటం అప్రజాస్వామికమని సిపిఎం రాజధాని డివిజన్‌ కమిటీ కార్యదర్శి ఎం.రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఆర్‌పిఎస్‌ అధ్యక్షులు మంద కృష్ణను, కోస్తా జిల్లాల కన్వీనర్‌ మల్లవరపు నాగయ్య తదితర నాయకులను పోలీస్‌ స్టేషన్‌లో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ రాజధానిలో దళితులు, పేదలు హక్కుల గురించి మాట్లాడుతుంటే చట్టాల పేరుతో పేదలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు....

రాజధానిలో విధించిన 144 సెక్షన్‌ను వెంటనే ఎత్తివేయాలని, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని, వ్యవసాయ కార్మికులు, ఇతర భూమిలేని వర్గాల ప్రజలకు ఉపాధి కల్పించాలని, ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఐక్య కార్యాచరణ చేపట్టాలని గుంటూరులో మంగళవారం జరిగిన సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. 'రాజధాని ప్రాంతంలో నిర్భంధం' అనే అంశంపై సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు అధ్యక్షతన జరిగిన సభలో రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పలువురు ప్రసంగించారు.ప్రభుత్వం రాజధాని ప్రజలకిచ్చిన ఒక్క వాగ్థానం కూడా అమలు చేయకపోగా నిర్భంధాలు ప్రయోగిస్తోంది. ఈ విధానాలను అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు ఐక్యంగా ఎదుర్కొవాలి. నిర్భంధాలకు ప్రయోగిస్తే ప్రజలు ఏ గుణపాఠం చెబుతారో రాష్ట్ర...

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ప్రాంతంలో గుడినీ గుడిలో లింగాన్ని మింగే స్వాములు బయలుదేరారు. వంశపారం పర్యంగా ఎన్నో ఏళ్లుగా రైతులు సాగు చేసుకుంటున్న దేవాలయ మాన్యాలను దక్కించుకునేందుకు అధికార పార్టీకి చెందిన మాఫియా రంగంలోకి దిగింది. సుమారు 150 నుంచి 200 ఎకరాలను కైంకర్యం చేసేందుకు పకడ్బందీ ప్రణాళిక అమలు జరుగుతున్నట్లు తెలిసింది. దాదాపు రెండొందల కోట్ల రూపాయల కుంభకోణానికి తెరతీసినట్లు సమాచారం. ఈ భూమాయకు తెలుగుదేశం పార్టీ యువ నేత తన స్వంత మనుషులను రాజధాని గ్రామాల్లో దించి ఆపరేషన్‌ మొదలుపెట్టినట్లు ఆరోపణలొస్తున్నాయి. గుంటూ రు జిల్లాలోని రాజధాని ఏరియాలో సర్కారు ప్రతిపాదించిన భూసమీకరణ కిందకురాని రైతుల భూములను సేకరిస్తున్న విషయం విదితమే. ఇప్పటికే తొలిదశలో...

అసైండ్, సీలింగ్ సాగుదారులకు వెంటనే కౌలు చెక్కులు ఇవ్వాలని , పట్టాభూమితో సమాన ప్యాకేజి ఇవ్వాలని కోరుతూ అమరవతి (రాజధాని) ప్రాంతంలో సిపిఎం నాయకులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు..శాంతియుతంగా దీక్షలు చేస్తున్న దళితులు, సిపిఎం నాయకుల్ని పోలీసులు  అక్రమంగా అరెస్టులు చేసి స్టేషనుకు తరలించారు.వీరిపై 144 సెక్షన్ కింద పోలీసులు కేసులు నమోదు చేసారు. 

రాజధానికి భూములిచ్చిన రైతుల జీవనస్థితి మారిపోతోంది. భూములిస్తే అకాశ హర్య్మాలు నిర్మించి ఇస్తామని చెప్పిన ప్రభుత్వం తదనుగుణంగా కనీస శిక్షణ కూడా ఇవ్వకపోవడంతో వారు గేదెలు కాసుకుంటున్నారు. అన్ని గ్రామాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. సాగులేక పోవడంతో పొలాలన్నీ బీళ్లుగా మారాయి. తోటల్లో పిచ్చిచెట్లు మొలిచి నడవలేని పరిస్థితి ఏర్పడింది. మాగాణుల్లో మోకాళ్ల ఎత్తున గడ్డి మొలిచింది. వాటిని చూసి రైతులు చలించిపోతున్నారు. కొద్దిపాటి మొత్తాన్ని వెచ్చించి రైతులు ఒకటీ లేదా రెండు గేదెలు కొనుగోలు చేసుకున్నారు. సాగు చేసిన పొలాల్లోనే వాటిని మేపుకొంటూ కాలం గడుపుతున్నారు. జరీబు గ్రామాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది. సహజంగానే సారవంతమైన నేలలు...

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సార్వత్రిక సమ్మెలో భాగంగా విజయవాడలో బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. వేలాది మంది కార్మికులు ముందు రథం సెంటర్‌కు చేరుకు న్నారు. అక్కడి నుంచి ర్యాలీలో కార్మికులు చీమల దండులా కదిలారు. దీంతో బెడవాడ ఎర్రబారింది. ప్రజానాట్య మండలి కళాకారుల పాటలు, డప్పు కళాకారుల వాయిద్యాలు కార్మికులను ఉత్సాహపరి చాయి. ఫ్లైఓవర్‌ మీదుగా సాగిన ర్యాలీ సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వరకు కొనసాగింది. సిఐటియు, ఏఐటి యుసి, ఐఎప్‌టి యు, టియుసిసి, వైఎస్‌ఆర్‌టియుసి, ఐఎన్‌టియుసి, ఏఐసిసిటియుసి, ఐఎఫ్‌టియు తదితర కార్మిక సంఘాల రాష్ట్ర నాయకులు ఈ ర్యాలీకి అగ్రభాగాన ఉండి నడిపించారు. సిపిఎం, సిపిఐ...

దేశవ్యాపితంగా అన్ని కార్మిక సంఘాల పిలుపు మేరకు సెప్టెంబర్ 2న నిర్వహించిన సార్వత్రిక సమ్మెలో భాగంగా మిర్చి యార్డు, కోల్డ్ స్టోరేజీలు, మిర్చి గూడాల్లో పని చేసే వేలాది మంది కార్మికులు సంపూర్ణంగా సి.ఐ.టి.యు ఆధ్వర్యంలో సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి నగర్ లోని మిర్చివర్కస్ యూనియన్ (సి ఐ టి యు ) కాయాలయం నుండి చుట్టుగుంట సెంటర్ వరకు కార్మిక ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనను ఉద్దేశించి సిపియం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.కృష్ణయ్య మాట్లాడూతూ మిర్చి రంగంలో షుమారు 20 వేల మందికిపైగా పనిచేస్తున్నా కష్టానికి తగ్గకూలీ, ప్రభుత్వం నుండి ఎలాంటి సంక్షేమ పథకాలకు నోచుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వివిధ ప్రభుత్వ సంస్థలో పని చేసే...

Pages