District News

పర్యావరణ అనుమతులు లేని కారణంగా రాజధాని పనులను నిలిపివేయాలని నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌జిటి) ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వు లను రాష్ట్ర ప్రభుత్వం ఖాతరు చేయడం లేదు. తోటలను కూల్చివేయడం, పొలాలను చదును చేయడం, శంకుస్థాపన పేరిట తాత్కాలిక నిర్మాణా లను చేపట్టడం వంటి పనులు కొనసాగుతున్నాయి. రాష్ట్ర మంత్రులతో పాటు, ఉన్నతస్థాయి అధికారులు దగ్గరుండి పనులను పర్యవేక్షిస్తున్నారు. ఎన్‌జిటి ఇచ్చిన ఆదేశాలను బేఖాతరు చేస్తుండటం పట్ల పర్యావరణ వేత్తల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. సర్కారుపై ధిక్కార కేసును దాఖలు చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. ఈ దిశలో అవసరమైన ఆధారాలను ఇప్పటికే సేకరించారు. పర్యావరణ ఉల్లంఘనలతో పాటు అనేక చట్టపరమైన అవకత వకలతో ఉన్న రాజధాని శంకుస్థాపనకు...

ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న నిరవధిక నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. సరిగ్గా 4 గంటల ప్రాంతంలో దీక్షా స్థలికి వచ్చిన పోలీసులు 4.11 గంటలకు వైఎస్ జగన్తో తొలుత మంతనాలు జరిపే ప్రయత్నం చేసి వెంటనే దీక్షను భగ్నం చేశారు. బలవంతంగా ఆయనను దీక్షా స్థలినుంచి ఎత్తుకెళ్లారు. ప్రత్యేక హోదా వచ్చే వరకు తాను దీక్ష విరమించబోనని, తన నిరాహార దీక్షను ఆపలేరని, శాంతియుతంగానే తాను దీక్ష చేస్తున్నాను తప్ప ఎవరికీ ఎలాంటి హానీ చేయడం లేదని చెప్పినా పోలీసులు ఆయన మాట వినలేదు. మరోపక్క, పోలీసులు భారీ సంఖ్యలో రావడంతో అక్కడే ఉన్న పార్టీ ముఖ్యనాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు, సామాన్య ప్రజానీకం పోలీసులను అడ్డుకునే...

ఇంట్లో పోలీస్‌ కవాతు బయట డిజిటల్‌ డాబుసరి.. ఇదీ చంద్రబాబు పాలనలో ఆంధ్రప్రదేశ్‌లో తిష్ట వేసిన తాజా దృశ్యం. విశ్వనగరంగా అమరావతిని అభివర్ణిస్తూ ప్రచారం లంకించుకున్న ముఖ్యమంత్రి, శంకుస్థాపన అదరగొడతామని హోరెత్తిస్తున్నారు. కాగా ఈ అట్టహాసాల మాటున ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు, జనం ఆందోళనలను తొక్కేసేందుకు అన్ని రకాల కుయుక్తులకు పాల్పడుతున్నారు. శంకుస్థాపన దగ్గర పడే కొద్దీ రాజధాని గ్రామాల్లోనూ, రాష్ట్ర వ్యాప్తంగా కూడా పౌరుల కదలికలపై ప్రభుత్వం ఆంక్షలు విధించి అణచిపెట్టాలని తాపత్రయ పడటం ప్రజాస్వామ్యానికి విఘాతం. గత చంద్రబాబు జమానాలో జార్జిబుష్‌, ఉల్ఫెన్‌ సన్‌, టోనీ బ్లేయర్‌ పర్యటనల సందర్భంగా ప్రయోగించిన నిర్భందం ప్రజలింకా మర్చిపోలేదు. అమరావతి...

పర్యావరణ అనుమతులకు ఆమోదం లభించకుండా ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధాని ప్రాంతంలో ఎలాంటి పనులూ(నేల చదును, నిర్మాణాలు చేపట్టడం) చేయకూడదని ఆ రాష్ట్ర ప్రభుత్వానికి నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌(ఎన్‌జిటి) ఆదేశాలిచ్చింది. అలాగే నూతన రాజధాని ప్రాంతంలోని చిత్తడి నేలలు, ముంపు ప్రాంతాల గుర్తింపుపై పూర్తి నివేదికను తమకు సమర్పించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను నవంబర్‌ 5వ తేదీకి వాయిదా వేసింది. ప్రతిపాదిత రాజధాని నిర్మాణ స్థలంలోని ముంపు ప్రాంతాలకు సరిహద్దులు నిర్ణయించాలని సూచించిన ట్రిబ్యునల్‌... అందులో ఎలాంటి నిర్మాణాలూ చేపట్టకూడదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్ష నేత జగన్‌ చేపట్టిన నిరవధిక దీక్ష ఆదివారం ఐదో రోజుకు చేరింది. ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి వైద్యులు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. షుగర్‌ లెవల్స్‌, పల్స్‌ రేటు పడిపోవడంతోపాటు బరువు తగ్గుతున్నట్లు వైద్యులు నిర్ధారించారని వైసీపీ వర్గాలు తెలిపాయి. దీక్షా శిబిరానికి వచ్చిన జగన్‌ సతీమణి వైఎస్‌ భారతి జగన్‌ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. 

 నల్లపాడులో నిరవధిక దీక్ష చేపట్టిన వైసీపీ పార్టీ అధ్యక్షుడు జగన్ చేపట్టిన దీక్షకు సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు మద్దతు తెలియజేసారు .. ఈసందర్భంగా ఆయన ప్రజలనుద్ధేశించి ప్రసంగించారు. చంద్రబాబు.. రోజు వారి ఉపన్యాసాలు వింటుంటే నిజాయితీ నశించిందని అనిపిస్తోందన్నారు. ప్రత్యేక హోదా కాదు...ప్యాకేజీలున్నాయని ఇప్పుడు మాట్లాడుతున్నారని తెలిపారు. కనీస నిజాయితీ లేదని, ప్రజలకిచ్చిన వాగ్దానాలు నెరవేర్చడంలో నిజాయితీ లేదని విమర్శించారు. పీఆర్సీ 2013 అమలు జరగాల్సి ఉంటే 2014 నుండి అమలు చేస్తామని తెలిపారు. హెల్త్ కార్డులు..అంగన్ వాడీలు..మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన వాగ్ధానాలు అమల్లోకి రాలేదని గుర్తు చేశారు. 43 శాతం ఫిట్ మెంట్ అమలు చేస్తానని చెప్పి ఇంతవరకు...

 'రాజధాని ప్రజా చైతన్య యాత్ర'ను పోలీసులు అడ్డుకున్నారు.పాదయాత్రను పోలీసులు అడ్డుకోవడంపై రాజధాని ప్రాంత సీపీఎం కమిటీ కన్వీనర్ సీ.హెచ్.బాబురావు తీవ్రంగా తప్పుబట్టారు. తాము ఎం తప్పు చేశామని పోలీసులను ప్రశ్నించారు. ఈ సందర్భంగా టెన్ టివితో ఆయన మాట్లాడారు. రాజధాని నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని, కానీ ఇక్కడ నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని తాము డిమాండ్ చేయడం జరుగుతోందన్నారు. అందులో భాగంగా తాము పాదయాత్ర చేపట్టినట్లు ఇక్కడ ఉన్న కౌలు రౌతుల పరిస్తితి ఏంటీ ? రూ.2500 పెన్షన్ ఎలా సరిపోతుంది అని ప్రశ్నించారు. పాదయాత్ర చేపట్టి స్థానిక ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నామని, శాంతియుతంగా పాదయాత్ర జరుగుతోందన్నారు. కానీ పోలీసులు అడ్డుతగులుతున్నారని, సమస్యలు...

సిపిఎం చేపట్టిన 'రాజధాని ప్రజా చైతన్య యాత్ర'కు  పోలీసులు అడ్డు తగిలారు. తుళ్లూరు ప్రాంతంలో చేపట్టిన పాదయాత్రకు అనుమతి లేదంటూ సీపీఎం నేతలను అరెస్టు చేశారు.ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు..పేదలకు ఎలాంటి పాట్లు పడుతున్నారో కళ్లకు కట్టినట్లుగా కళారూపాలు ప్రదర్శించారు. పాదయాత్రలో పేదలు..ఇతరులు..వామపక్ష నేతలు భారీగా హాజరయ్యారు. కొద్దిసేపు ముందుకు సాగిన అనంతరం పోలీసులు అక్కడకు చేరుకున్నారు. పాదయాత్రకు అనుమతి లేదంటూ అడ్డుకున్నారు. తాము శాంతియుతంగా చేస్తున్న యాత్రకు ఎందుకు అడ్డుతగులుతున్నారని వామపక్ష నేతలు ప్రశ్నించారు. పోలీసులను దాటుకుని నేతలు ముందుకెళ్లారు. భారీ సంఖ్యలో వచ్చిన పోలీసులు నేతలను బలవంతంగా ఈడ్చుకెళ్లి అరెస్టు చేసి వ్యాన్ లలో పడేశారు....

రాజధానిలో పింఛన్ల జాబితాలో అవకతవకలున్నాయనే ఆగ్రహంతో పేదలు తాడేపల్లి, తుళ్లూరు మండలాల్లో మంగళవారం ధర్నాలు నిర్వహించారు. తాడేపల్లి మండలం పెనుమాక పంచాయతీ కార్యాలయం ఎదుట మంగళవారం బైఠాయించారు. పచ్చచొక్కలోళ్ళకే పింఛన్లు దక్కుతున్నాయని మండిపడ్డారు. విషయం తెలుసుకున్న సిపిఎం క్రిడా కన్వీనర్‌ సిహెచ్‌.బాబూరావు రాజధాని డివిజన్‌ కార్యదర్శి ఎం.రవి, జె.నవీన్‌ప్రకాష్‌ అక్కడికి చేరుకున్నారు. అవకతవకలను సరిచేయాలని సర్పంచ్‌ కళ్ళం పానకాలరెడ్డిని కోరారు. అనంతరం ఎస్‌ఐ వినోద్‌కుమార్‌, కార్యదర్శి పద్మావతి ఆందోళనకారులతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీనిచ్చారు. మరోపక్క తుళ్లూరు మండలం అనంతవరంలో 200 మంది పేదలు క్రిడా కార్యాలయాన్ని ముట్టడించారు. గ్రామంలో గత నెల్లో...

ప్రభుత్వ నిర్ణయాలు కాకులను కొట్టి గద్దలకు పెట్టిన చందంగా ఉంటున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలో లే అవుట్లు, ఇళ్ల నిర్మాణాల అనుమతులకు సిఆర్‌డిఎ విధిస్తున్న నిబంధనలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. సిఆర్‌డిఎ పరిధిలోని 58 మండలాల్లో అగ్రికల్చర్‌ ప్రొటక్షన్‌ జోన్‌ (గ్రీన్‌బెల్ట్‌)ను ఏర్పాటు చేసి ప్రస్తుతం గ్రామంలో ఇళ్లున్న ప్రాంతానికి 500 మీటర్లలోపు దూరంలోని లే అవుట్లకు మాత్రమే అనుమతి ఇస్తామని సిఆర్‌డిఎ చెబుతోంది. దీంతో గ్రీన్‌బెల్ట్‌ ప్రాంతంలో రైతుల పొలాలకు విలువ తగ్గిపోతోంది. అలాగే పేద, మధ్య తరగతి ప్రజలు జీవితాంతం కష్టపడి సంపాధించుకుని అంతో ఇంతో తక్కువ ధరకు వచ్చే గ్రామానికి దూరంగా ఉండే స్థలాలను కొనుగోలు...

Pages