2016

రూ.10 లక్షలు దాటిన సంస్థలకు జీఎస్‌టీ

వస్తువులు, సేవల అమ్మకంతో పాటు ఆన్‌లైన్‌లో జరిపే కొనుగోళ్లు అన్నింటికీ జీఎస్‌టీ అమలవుతుందని, లావాదేవీ తొలి అంకం (మూలం వద్దే) ఈ పన్ను విధించాలని నమూనా జీఎస్‌టీ చట్టంలో ప్రతిపాదించారు. కోల్‌కతాలో జరిగిన రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సాధికార కమిటీ సమావేశంలో ఈ నమూనా చట్టానికి ఆమోదం తెలిపారు. వార్షిక టర్నోవర్‌ రూ.10 లక్షలు దాటిన సంస్థలకు జీఎస్‌టీ అమలవుతుంది. అదే సిక్కిం సహా ఈశాన్య రాష్ట్రాల్లో అయితే రూ.5 లక్షల టర్నోవర్‌కే విధిస్తారు. ఈ నమూనా జీఎస్‌టీ చట్టాన్ని రాష్ట్రాలు సమావేశం ఆమోదించినట్లు రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్‌ అధియా వెల్లడించారు

కాలేజీ తరలింపుపై పెల్లుబుకిన ఆగ్రహం

 పేద విద్యార్థులకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ జూనియర్‌ కళాశాల స్థలంలో కమర్షియల్‌ కాంప్లెక్స్‌ నిర్మించేందుకు 99 ఏళ్లు లీజుచిచ్చి పట్టణ నడిబొడ్డున ఉన్న కళాశాలను ఊరిచివరకు తరలించడం దారుణమని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ధ్వజమెత్తాయి. ఈ మేరకు తాలుకా సెంటర్‌లోని గుంటూరు-మాచర్ల ప్రధాన రహదారిపై మంగళవారం రాస్తారోకో చేపట్టారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు గద్దె చలమయ్య మాట్లాడుతూ టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యాభివృద్ధికి చర్యలు తీసుకోపోగా పేద విద్యార్థులకు అందుబాటులో ఉన్న కళాశాలను తరలించాలనుకోవడం సరికాదన్నారు.

గుల్బర్గ్‌ కేసులో తీర్పు 17కు వాయిదా

గుల్బర్గ్‌ అల్లర్ల కేసులో దోషులకు శిక్ష విధించే అంశంపై జరుగుతున్న విచారణను ప్రత్యేక న్యాయస్థానం 17కు వాయిదా వేసింది. 2002లో గుజరాత్‌లోని గుల్బర్గ్‌లో జరిగిన మారణకాండకు సంబంధించి కోర్టు ఇటీవల 24 మందిని దోషులుగా నిర్ధారించిన సంగతి తెలిసిందే. వీరికి శిక్ష ఖరారు అంశంపై విచారణ జరుపుతున్న కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించనున్నది. 

త్రిపుర విభజన ప్రసక్తే లేదు..

గిరిజనుల పార్టీ ఇండీజనెస్‌ పీపుల్స్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ త్రిపుర (ఐపీఎఫ్‌టీ) లేవనెత్తిన ప్రత్యేక రాష్ట్రం 'త్రిప్రా ల్యాండ్‌' డిమాండ్‌ను త్రిపురలోని ప్రధాన రాజకీయ పార్టీలు తిరస్కరించాయి. పాలక సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి విజన్‌ ధర్‌ మాట్లాడుతూ విచ్ఛిన్నకరమైన, బాధ్యతారాహిత్యం, రాజకీయ దురుద్దేశంతో కూడిన ఈ డిమాండ్‌ను తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. అసలే చిన్న రాష్ట్రమైన త్రిపురను ఇంకా విభజించాలన్న ఈ డిమాండ్‌ తమకు ఎంత మాత్రమూ ఆమోదయోగ్యం కాదని అన్నారు.

బాబ్రీ, గోద్రాలవల్ల ‘ఉగ్ర’ ఆకర్షణ

పలువురు భారతీయ యువకులు అల్ కాయిదా ఉగ్రవాదసంస్థ వైపు ఆకర్షితులవడానికి బాబ్రీ మసీదు విధ్వంసం(1992), గోద్రా అల్లర్లు(2002) కారణమని ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. ఢిల్లీ అడిషనల్ సెషన్స్ జడ్జి కోర్టులో ఢిల్లీ పోలీస్ విభాగానికి చెందిన ప్రత్యేక విభాగం దాఖలు చేసిన  చార్జిషీట్‌లో ఈ విషయాన్ని పేర్కొంది.

మాల్యా కోసం రెడ్‌ కార్నర్‌ నోటీసులు:ED

బ్యాంకు రుణాల ఎగవేత కేసులకు సంబంధించి విచారణ ఎదుర్కొంటూ విదేశాల్లో తలదాచుకున్న పారిశ్రామికవేత్త విజరు మాల్యాకు వ్యతిరేకంగా రెడ్‌ కార్నర్‌ నోటీసులు జారీ చేయాలని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఇంటర్‌పోల్‌కు లేఖ రాసింది. మనీలాండరింగ్‌ కేసులో విజరు మాల్యాకు అరెస్టు వారెంట్‌ను నోటిఫై చేసేందుకు ముందుగా ఇంటర్‌పోల్‌ కొన్ని వివరణలను కోరింది. మాల్యా కేసుల విచారణ, ఆయనకు వ్యతిరేకంగా ఆయా కోర్టులు జారీ చేసిన అరెస్ట్‌ వారెంట్ల వివరాలతో కూడిన సమాచారాన్ని ఇంటర్‌పోల్‌కు ఈడీ అందించింది.

జూలై 18 నుంచి ఆగష్టు 12 వరకు పార్లమెంట్‌..

పార్లమెంట్‌ వర్షకాలపు సమావేశాలు జూలై 18 నుంచి ఆగష్టు 12 వరకు జరిగే అవకాశాలు ఉన్నాయి. మూడు వారాల పాటు జరగబోయే ఈ సమావేశాల్లో దేశంలోని పేరుకుపోయిన సమస్యలపై చర్చిస్తారు. పార్లమెంట్‌ వ్యవహారాల సబ్‌ కమిటి సమావేశం తరువాత పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమావేశాలపై ప్రకటన చేయనున్నది.

మోడీ భారత్ కు తిరుగు పయనం

విదేశీ పర్యటనలు ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం భారత్కు తిరుగు పయనం అయ్యారు. ఆయన అయిదు రోజుల్లో ఐదు దేశాల్లో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ నెల 4వ తేదీన మోదీ విదేశీ పర్యటనకు వెళ్లారు. ముందుగా ఆఫ్గనిస్తాన్ పర్యటించారు. ఆ తర్వాత ఖతార్, స్విట్జర్లాండ్, అమెరికాతో పాటు చివరిగా మెక్సికోలో పర్యటించారు. 

Pages

Subscribe to RSS - 2016